AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ester Noronha: విడాకులు తీసుకున్న తర్వాతే సంతోషంగా ఉన్నానంటున్న హీరోయిన్.. ఆ సింగర్ మాజీ భార్య షాకింగ్ కామెంట్స్..

భీమవరం బుల్లోడు సినిమాతో తెలుగులోకి హీరోయిన్‏గా పరిచయమయ్యింది ఎస్తేర్. ఆ తర్వాత వెయి అబద్ధాలు.. జయజయజానకి నాయక సినిమాలో క్యారెక్టర్

Ester Noronha: విడాకులు తీసుకున్న తర్వాతే సంతోషంగా ఉన్నానంటున్న హీరోయిన్.. ఆ సింగర్ మాజీ భార్య షాకింగ్ కామెంట్స్..
Ester
Rajitha Chanti
|

Updated on: Feb 20, 2022 | 8:26 AM

Share

భీమవరం బుల్లోడు సినిమాతో తెలుగులోకి హీరోయిన్‏గా పరిచయమయ్యింది ఎస్తేర్. ఆ తర్వాత వెయి అబద్ధాలు.. జయజయజానకి నాయక సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ నటించి మెప్పించింది. అయితే నటన పరంగా ఎస్తేర్ మంచి మార్కులు సంపాందించుకున్నప్పటికీ తెలుగులో అవకాశాలు మాత్రం అంతగా రాలేదు. సినిమాలు ఎక్కువగా చేయకపోయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది ఎస్తేర్. టాలీవుడ్ ర్యా్ప్ సింగర్ నోయల్‏ను ప్రేమించి పెళ్లి చేసుకుంది ఎస్తేర్. 2019లో పెళ్లి చేసుకున్న వీరిద్దరు మూడు నెలల వ్యవధిలోనే విభేదాల కారణంగా విడిపోయారు. ఆ తర్వాత 2020లో విడాకులు తీసుకుని ఎవరి జీవితం వారిది అన్నట్టుగా ఉంటున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా ఎస్తేర్ తాను విడాకుల సమయంలో ఎదుర్కోన్న మానసిక ఒత్తిడి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఎస్తేర్ 69 సంస్కార్ కాలనీ సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ మార్చి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆసక్తికర విషయాలను పంచుకుంది. వ్యక్తిగత జీవితంతోపాటు.. క్యాస్టింగ్ కౌచ్ గురించి చెప్పుకొచ్చింది.

ఎస్తర్ మాట్లాడుతూ.. విడాకుల సమయంలో చాలా ఒత్తిడికి లోనయ్యాను. కానీ ఎప్పుడైతే అన్నింటికి సిద్ధపడి విడాకుల తీసుకోవాలని నిర్ణయించుకున్నానో అప్పుడు ఫ్రీ అయ్యాను. ఎందుకంటే దీనిపై నా కుటుంబం ఎలా సమాధానం చెప్పుకోవాలని భయపడ్డాను. కానీ ఎప్పుడైతే వారికి తెలిసిందే… నా తల్లిదండ్రులు నాకు మద్దతుగా ఉన్నారు. నాలో రెట్టింపు ధైర్యం .. ఎనర్జీ వచ్చింది అంటూ చెప్పుకొచ్చింది. అలాగే.. ఎవరైనా విడాకులు తీసుకున్నారనే వార్తలు విన్నాను.. కానీ ఆ అనుభవం ఉంటుందో తెలియదు.. నేను ఆ పరిస్థితిని ఎదుర్కోంటాను అని అనుకోలేదు. మా కుటుంబంలో కూడా ఇలాంటివి లేవు.. అలాంటి పరిస్థితులలో విడాకుల నిర్ణయంతో సతమతమయ్యను. విడాకులు తీసుకున్న తర్వాత కొందరు జీవితం పాడు చేసుకుంది అంటే.. మరికొందరు మేమున్నామంటూ ధైర్యం చెప్పారు అని పేర్కోంది.

Also Read: Prabhas: ఆయనో ప్రతిభావంతుడు.. వినయానికి బ్రాండ్ అంబాసిడర్ కూడా: ప్రభాస్‌ని పొగడ్తలతో ముంచేసిన బిగ్ బీ

Richa Chadha: రోడ్డున పోయే వారందరినీ కౌగిలించుకున్న రిచా.. అసలు విషయమేమిటంటే..

Cinema News: రేపు టాలీవుడ్ సమస్యలపై కీలక సమావేశం.. ఎవరెవరు హాజరుకానున్నారంటే..