AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Richa Chadha: రోడ్డున పోయే వారందరినీ కౌగిలించుకున్న రిచా.. అసలు విషయమేమిటంటే..

'టెన్షన్‌, బాధల్లో ఉన్నవారిని ప్రేమతో హత్తుకుంటే వారి బాధలన్నీ మాయమైపోతాయి' అంటూ కౌగిలింతలో ఉన్న మాధుర్యాన్ని శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌ సినిమా ద్వారా మనకు చూపించారు మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi).

Richa Chadha: రోడ్డున పోయే వారందరినీ కౌగిలించుకున్న రిచా.. అసలు విషయమేమిటంటే..
Richa Chadha
Basha Shek
|

Updated on: Feb 19, 2022 | 10:46 PM

Share

‘టెన్షన్‌, బాధల్లో ఉన్నవారిని ప్రేమతో హత్తుకుంటే వారి బాధలన్నీ మాయమైపోతాయి’ అంటూ కౌగిలింతలో ఉన్న మాధుర్యాన్ని శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌ సినిమా ద్వారా మనకు చూపించారు మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi). ఈక్రమంలో సినిమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటారు ప్రముఖ బాలీవుడ్‌ నటి రిచా చద్దా (Richa Chadha). గతంలో ఆమె పలు ఎన్నో మంచి పనులు నిర్వహించి అభిమానుల ప్రశంసలు అందుకుంది. ఈ క్రమంలో ‘Random Acts of Kindness Day’ను పురస్కరించుకుని ‘ఫ్రీ హగ్స్‌’ అంటూ సోషల్‌ మీడియాలో ఓ వీడియో పోస్ట్‌ చేసిందీ అందాల తార. అందులో ‘ఫ్రీ హగ్స్‌’ అనే పోస్టర్‌ను చేతిలో పట్టుకుని రోడ్డున పోయే వారందరినీ ప్రేమతో హత్తుకుంది. వారిని ఆప్యాయంగా పలకరిస్తూ తన సంతోషాన్ని షేర్‌ చేసింది. అయితే ఇప్పటి వీడియో కాదు. రెండేళ్ల క్రితం నాటి వీడియో. ‘ర్యాండమ్‌ యాక్ట్స్‌ ఆఫ్‌ కైండ్‌ నెస్‌’ సందర్భంగా మరోసారి ఆ వీడియోను తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది రిచా.

‘అప్పటికీ, ఇప్పటికీ ఈ ప్రపంచం ఎంతో మారిపోయింది. రెండేళ్ల క్రితం ఓరోజు నేనిలా గడిపాను. ఈ వీడియోని చూడగానే ఇంత తక్కువ సమయంలోనే మన ప్రపంచం ఎంతలా మారిపోయిందో కదా అనిపించింది. కొవిడ్‌కి ముందు ఇలా చేయడం సాధ్యపడింది.. భవిష్యత్తులో మరోసారి చేస్తానని గట్టి నమ్మకముంది. ప్రపంచానికి కావాల్సింది ప్రేమే..దెబ్బలు మానేంతవరకు, ఖాళీలన్నీ ప్రేమతో నిండేంతవరకు.. అందరికీ దయాగుణ దినోత్సవ శుభాకాంక్షలు’ అని ఈ పోస్టులో చెప్పుకొచ్చింది రిచా. కాగా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘సానుకూల దృక్పథాన్ని పంచేందుకు మీరు చాలామంచి పనిచేస్తున్నారు’ అంటూ ఆమె మీద నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే కొద్దిమంది నెటిజన్లు ఇది పాత వీడియో అని తెలియక కరోనా టైమ్‌లో ఇలాంటి పనులేంటని రిచా చద్దాపై మండిపడుతున్నారు.

Also Read:Cinema News: రేపు టాలీవుడ్ సమస్యలపై కీలక సమావేశం.. ఎవరెవరు హాజరుకానున్నారంటే..

Raja singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ఈసీ షాక్‌.. ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు ఆదేశం..

Ipl 2022 Auction: సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌కు కొత్త అసిస్టెంట్‌ కోచ్‌.. సైమన్‌ కటిచ్‌ స్థానంలో ఎవరు రానున్నారంటే..