Cinema News: రేపు టాలీవుడ్ సమస్యలపై కీలక సమావేశం.. ఎవరెవరు హాజరుకానున్నారంటే..
తెలుగు సినీ పరిశ్రమలోని సమస్యలపై రేపు సమీక్షా సమావేశం జరగనుంది. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో జరిగే ఈ సమావేశానికి తెలుగు ఫిలిం ఛాంబర్
తెలుగు సినీ పరిశ్రమలోని సమస్యలపై రేపు సమీక్షా సమావేశం జరగనుంది. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో జరిగే ఈ సమావేశానికి తెలుగు ఫిలిం ఛాంబర్, తెలంగాణ ఫిలిం ఛాంబర్, నిర్మాతల మండలి, మా అసోసియేషన్, దర్శకుల సంఘం, చలనచిత్ర కార్మిక సమాఖ్య ప్రతినిధులు హాజరుకానున్నారు. కరోనా కాలంలో సినీ పరిశ్రమకు ఎదురైన గడ్డు పరిస్థితులు, అనంతరం సినిమా పరిశ్రమకు సంబంధించి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు జారీ చేసిన ఉత్తర్వులు, సినీ కార్మికుల సంక్షేమంపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది. సినీ పరిశ్రమకు చెందిన సుమారు 240 మంది ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఇందుకోసం ఫిల్మ్ ఛాంబర్‌లోని ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఎగ్జిబిటర్స్ అసోసియేషన్, డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్, స్టూడియో సెక్టార్, మూవీ ఆర్టిస్టు అసోసియేషన్, ఫిల్మ్ ఫెడరేషన్, డైరెక్టర్స్ అసోసియేషన్.. ఇలా సినీ పరిశ్రమలోని అన్ని విభాగాలకు చెందిన వారిని ఈ మీటింగ్‌కు ఆహ్వానించారు.
కాగా టాలీవుడ్‌లోని సమస్యలపై ఇటీవల మెగాస్టార్ చిరంజీవి, రాజమౌళి, మహేష్ బాబు, ప్రభాస్ తదితరులు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో సమావేశమైన సంగతి తెలిసిందే. అయితే ఈ భేటీ కంటే ముందే ఈ సమావేశం జరగాల్సి ఉండగా .. కొన్ని కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. ఈ సమావేశానికి మెగాస్టార్ చిరంజీవి, మా అధ్యక్షుడు మంచు విష్ణు, మోహన్ బాబు, తమ్మారెడ్డి భరద్వాజ, మురళీ మోహన్ తదితర ప్రముఖులు హాజరుకానున్నట్లు సమాచారం. ఇటీవల ఏపీ ప్రభుత్వం టాలీవుడ్ సమస్యలపై సానుకూలంగా స్పందించడం, ప్రతిపాదనలు, టికెట్ ధరలపై నెలాఖరులో ఉత్తర్వలు వెలువడనున్న నేపథ్యంలో రేపటి మీటింగ్ ప్రాధాన్యత సంతరించుకుంది.
Ashu Reddy: అషూ అందమైన ఫోటోలు పెడితే.. నెటిజన్లు ఆమె కారు చలాన్లు పట్టేశారు… ఎంతంటే..?