AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: ఆయనో ప్రతిభావంతుడు.. వినయానికి బ్రాండ్ అంబాసిడర్ కూడా: ప్రభాస్‌ని పొగడ్తలతో ముంచేసిన బిగ్ బీ

పాన్ ఇండియాగా విడుదల కానున్న ఈ సైన్స్ ఫిక్షన్ పేరు ఇంకా నిర్ణయించలేదు. ప్రస్తుతానికి ‘ప్రాజెక్ట్‌ కే’ (Project k)గా పిలుస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్..

Prabhas: ఆయనో ప్రతిభావంతుడు.. వినయానికి బ్రాండ్ అంబాసిడర్ కూడా: ప్రభాస్‌ని పొగడ్తలతో ముంచేసిన బిగ్ బీ
Prabhas Amitabh
Venkata Chari
|

Updated on: Feb 20, 2022 | 12:21 AM

Share

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్(Amitabh bachchan), సౌత్ ప్రముఖ నటుడు ప్రభాస్(Prabhas) కలిసి ఓ సినిమాలో కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైంది. పాన్ ఇండియాగా విడుదల కానున్న ఈ సైన్స్ ఫిక్షన్ పేరు ఇంకా నిర్ణయించలేదు. ప్రస్తుతానికి ‘ప్రాజెక్ట్‌ కే’ (Project k)గా పిలుస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ మొదటి రోజు శనివారం మొదలైంది. ఈ మేరకు అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియా ద్వారా ప్రభాస్‌తో తన అనుభవాన్ని పంచుకున్నారు. ప్రభాస్‌ని ఓ ప్రతిభావంతుడు, వినయంతో నడుచుకుంటున్నాడని అభివర్ణించారు. అదే సమయంలో, లెజెండ్ అమితాబ్ బచ్చన్‌తో కలిసి పనిచేయడం నాకు ఒక కల లాంటిదని ప్రభాస్ రాశాడు. తొలి రోజు షూట్ అయ్యాక.. అమితాబ్, ప్రభాస్ ఒకరినొకరు ప్రశంసించుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

“మొదటి రోజు…మొదటి షాట్… బహుబలి ప్రభాస్‌తో మొదటి చిత్రం… ప్రతిభ, వినమ్రత కలిసి ఉన్న గొప్ప కళాకారుడు.. ఎప్పుడు నేర్చుకునేందుకు సిద్ధంగా ఉంటాడు!!” అంటూ అమితాబ్ బచ్చన్ రాసుకొచ్చాడు. ప్రభాస్ కూడా బిగ్ బి త్రోబాక్ ఫోటోను షేర్ చేస్తూ, “ఇది నాకల. నేటికి నిజమైంది. లెజెండరీ అమితాబ్ బచ్చన్ సర్‌తో సినిమా మొదటి షాట్!” అని రాసుకొచ్చాడు.

అత్యంత భారీ చిత్రాల్లో ఒకటిగా రానుంది..

మీడియా కథనాల ప్రకారం, భారతదేశంలో అత్యంత భారీ బడ్జెట్‌ చిత్రాలలో ఇది ఒకటి నిలవనున్నట్లు తేలనుంది. గతేడాది డిసెంబర్‌లో తొలి షెడ్యూల్‌ చిత్రీకరించారు. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అమితాబ్, ప్రభాస్‌లతో పాటు దీపికా పదుకొణె కూడా కనిపించనుంది. దీపిక హైదరాబాద్‌లో ప్రభాస్‌తో తన పార్ట్‌ను షూట్ పూర్తి చేసింది. దీపికా, అమితాబ్ లుక్ ఎలా ఉండబోతుందనేది ఇంకా వెల్లడి కాలేదు.

View this post on Instagram

A post shared by Prabhas (@actorprabhas)

Also Read: Richa Chadha: రోడ్డున పోయే వారందరినీ కౌగిలించుకున్న రిచా.. అసలు విషయమేమిటంటే..

Farhan weds Shibani: యువ నటితో ఏడడుగులు నడిచిన ఫర్హాన్‌.. పెళ్లి వేడుకలో సందడి చేసిన బాలీవుడ్‌ సెలబ్రిటీలు..