మద్యం తాగి వేధిస్తున్నాడని.. భర్త జననాంగాలు కోసి చంపిన భార్య

భార్య, భర్త, కుమార్తెతో ఆనందంగా సాగిపోతున్న వారి కుటుంబంలో మద్యం చిచ్చు రేపింది. మద్యానికి బానిసైన భర్త వేధింపులు తాళలేక ఓ మహిళ కుమిలిపోయింది. భర్తకు సర్దిచెప్పేందుకు...

మద్యం తాగి వేధిస్తున్నాడని.. భర్త జననాంగాలు కోసి చంపిన భార్య
Iran Wife Murder
Follow us

|

Updated on: Feb 20, 2022 | 11:13 AM

భార్య, భర్త, కుమార్తెతో ఆనందంగా సాగిపోతున్న వారి కుటుంబంలో మద్యం చిచ్చు రేపింది. మద్యానికి బానిసైన భర్త వేధింపులు తాళలేక ఓ మహిళ కుమిలిపోయింది. భర్తకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. అంతే కాదు.. వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. ఎంతో ప్రేమగా చూసుకుంటాడనుకున్న భర్త.. ఇలా చిత్రహింసలు పెట్టడాన్ని ఆ ఇల్లాలు తట్టుకోలేకపోయింది. ఓ రోజు భర్త పూటుగా మద్యం తాగి ఇంటికి వచ్చాడు. వచ్చీ రాగానే భార్యతో గొడవ పడ్డాడు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆమె కఠిన నిర్ణయం తీసుకుంది. భర్తను హతమార్చాలని నిర్ణయించుకుంది. భర్త మర్మాంగాన్ని కోసి దారుణంగా హత్య చేసింది. ఘటనను చూసిన కూతురు.. వారి బంధువులకు ఈ విషయం చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. క్షణికావేశంలో చేసిన ఈ ఘటన ఆమెను కటకాలవెనక్కు నెట్టింది. వారి కుమార్తె భవిష్యత్ ను అంధకారంలో పడేసింది. ఈ ఘటన ఉత్తరాఖండ్ లో జరిగింది.

ఉత్తరాఖండ్ పిథౌర్ గఢ్ లోని దిగాస్ కు చెందిన ఓ మహిళ.. తన భర్త జితేంద్ర రామ్, కూతురితో కలిసి నివాసముంటోంది. జితేంద్ర రామ్​మద్యానికి బానిసయ్యాడు. మద్యం మత్తులో కుటుంబసభ్యులను చిత్రహింసలకు గురిచేసేవాడు. ఓ రోజు మద్యం తాగి ఇష్టం వచ్చినట్లు కొట్టడంతో మహిళ తీవ్ర మనోవేదనకు గురైంది. ఆవేశంలో భర్త జితేంద్ర రామ్ జననాంగం కోసి హత్య చేసింది. ఈ ఘటనను చూసి తీవ్ర భయానికి గురైన వారి కుమార్తె.. విషయాన్ని బంధువులకు తెలిపింది. వారు సంఘటనాస్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సదరు మహిళను అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించగా ఆవేశంతో అతడ్ని చంపేసినట్లు పోలీసులు విచారణలో ఒప్పుకుంది.

పోలీసులు నిందితురాలిపై కేసు నమోదు చేశారు. హత్య చేసేందుకు ఉపయోగించిన రేజర్, తాడును స్వాధీనం చేసుకున్నారు. మహిళను మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచిన అనంతరం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తీసుకున్నారు.

Also  Read

Flipkart Delivery: ఫ్లిప్‌కార్ట్‌ మరింత వేగం.. కేవలం 45 నిమిషాల్లోనే డెలివరీ సేవలు..!

Charging Stations: ఎలక్ట్రిక్‌ చార్జింగ్‌ స్టేషన్‌లకు పెరిగిన డిమాండ్‌.. హైదరాబాద్‌ సహా 8 నగరాల్లో రెట్టింపు కానున్న స్టేషన్లు

జైలుకెళ్లినా మారని తీరు.. మరోసారి దొంగతనం చేస్తూ.. పోలీసులకు చిక్కి..