AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Flipkart Delivery: ఫ్లిప్‌కార్ట్‌ మరింత వేగం.. కేవలం 45 నిమిషాల్లోనే డెలివరీ సేవలు..!

Flipkart Delivery: కరోనా మహమ్మారితో ఆన్‌లైన్‌ సేవలు పెరిగిపోయాయి. ఈ మధ్య కాలంలో కొత్త కొత్త ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. నిత్యవసర వస్తువులు సైతం..

Flipkart Delivery: ఫ్లిప్‌కార్ట్‌ మరింత వేగం.. కేవలం 45 నిమిషాల్లోనే డెలివరీ సేవలు..!
Subhash Goud
|

Updated on: Feb 20, 2022 | 10:52 AM

Share

Flipkart Delivery: కరోనా మహమ్మారితో ఆన్‌లైన్‌ సేవలు పెరిగిపోయాయి. ఈ మధ్య కాలంలో కొత్త కొత్త ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. నిత్యవసర వస్తువులు సైతం ఆన్‌లైన్‌లోనే బుక్‌ చేసుకుని తెప్పించుకోవచ్చు. ఇక ఈ-కామర్స్‌ కంపెనీలు సైతం ఆన్‌లైన్‌ గ్రాసరీ (Ggrocery) సేవలను ప్రారంభించాయి. ఈ సేవలను ఫ్లిప్‌కార్ట్‌ కూడా ప్రారంభించింది. Blinkit, Zepto, Swiggy’s Instamart, RIL, Dunzo వంటి కంపెనీలు కేవలం 15 నుంచి 20 నిమిషాల్లోనే డెలవరీ అందిస్తుండగా, ఫ్లిప్‌ కార్టు మాత్రం 10 నుంచి 20 నిమిషాల డెలివరీ సర్వీసు అందించడం కష్టమని అభిప్రాయపడింది. ఆర్డర్‌ చేసిన కేవలం 45 నిమిషాల్లోనే డెలివరీ చేస్తామని ప్లిప్‌కార్ట్‌ (Flipkart) తెలిపింది. ఈ సేవలు కొన్ని నగరాల్లో ప్రారంభించింది. ఫ్రెష్‌ వెజిటబుల్స్‌, ప్రూట్స్‌ డెలివరీ సేవలను మరింతగా విస్తరించేందుకు చర్యలు చేపడుతోంది ఫ్లిప్‌కార్ట్‌.

నాణ్యమైన సేవలకు ప్రాధాన్యత:

వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించే లక్ష్యంతో ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఇక ఫ్లిప్‌కార్ట్‌ నిర్ణయంతో 90 నిమిషాల డెలివరీ సర్వీసులు ఇప్పుడు 45 నిమిషాల్లోనే అందించనున్నట్లు వెల్లడించింది. ఇంతకంటే తక్కువ సమయంలో డెలివరీ చేయడం సాధ్యం కాదని, బిజినెస్‌ మోడల్‌ 30 నుంచి 45 నిమిషాల డెలివరీ సేవలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపింది. వచ్చే నెల నుంచి ఈ సర్వీసులు మరింతగా విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపింది. ఇక హైదరాబాద్‌తో పాటు బెంగళూరులో ఫ్రెష్‌ వెజిటబుల్స్‌ సేవలు అందుబాటులో ఉండగా, రానున్న రోజుల్లో ఫ్రూట్‌ డోర్‌ డెలివరీ సర్వీసులు కూడా ప్రారంభిస్తామని కంపెనీ తెలిపింది.

ఇవి కూడా చదవండి:

Charging Stations: ఎలక్ట్రిక్‌ చార్జింగ్‌ స్టేషన్‌లకు పెరిగిన డిమాండ్‌.. హైదరాబాద్‌ సహా 8 నగరాల్లో రెట్టింపు కానున్న స్టేషన్లు

Harley Davidson: హార్లే డేవిడ్సన్‌ నుంచి అద్భుతమైన ఎలక్ట్రిక్‌ బైక్‌.. యారో ఆర్కిటెక్చర్‌ టెక్నాలజీతో..