AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank FD: ఆ బ్యాంకు సీనియర్‌ సిటిజన్లకు గుడ్‌న్యూస్‌.. గోల్డెన్‌ ఇయర్స్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ స్కీమ్‌ గడువు పొడిగింపు

Bank FD: ప్రైవేటు రంగ దిగ్గజం ఐసీఐసీఐ (ICICI) బ్యాంక్ సీనియర్ సిటిజన్లు (Senior Citizen) ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టేందుకు గడువును పొడిగించింది...

Bank FD: ఆ బ్యాంకు సీనియర్‌ సిటిజన్లకు గుడ్‌న్యూస్‌.. గోల్డెన్‌ ఇయర్స్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ స్కీమ్‌ గడువు పొడిగింపు
Subhash Goud
|

Updated on: Feb 20, 2022 | 11:07 AM

Share

Bank FD: ప్రైవేటు రంగ దిగ్గజం ఐసీఐసీఐ (ICICI) బ్యాంక్ సీనియర్ సిటిజన్లు (Senior Citizen) ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టేందుకు గడువును పొడిగించింది. బ్యాంక్ గోల్డెన్ ఇయర్స్ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌(Fixed Deposit) గడువును 8 ఏప్రిల్ 2022 వరకు పొడిగించింది. ‘గోల్డెన్ ఇయర్స్ FD’లో పెట్టుబడి పెట్టడం అనేది అధిక, సురక్షితమైన, ద్రవ్యోల్బణాన్ని అధిగమించే రాబడిని పొందాలనుకునే సీనియర్ సిటిజన్‌లకు అనువైనది. గోల్డెన్ ఇయర్స్ FD పథకం కింద బ్యాంకు వృద్ధులకు 0.25 శాతం అదనపు వడ్డీని సంవత్సరానికి 0.50 శాతం అదనంగా ఇస్తుంది.

కరోనా మహమ్మారి సమయంలో వడ్డీ రేట్ల తగ్గుదల ప్రారంభమైంది. తర్వాత చాలా బ్యాంకులు సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక FD పథకాలను ప్రారంభించాయి. ఒక సీనియర్ సిటిజన్ ఈ పథకాలలో నిర్ణీత కాలానికి ముందు 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పెట్టుబడి పెడితే, వారు మరింత వడ్డీని పొందే అవకాశం ఉంటుంది.

ICICI బ్యాంక్ గోల్డెన్ ఇయర్స్ FD

గోల్డెన్ ఇయర్ ఎఫ్‌డి పథకంలో సీనియర్ సిటిజన్‌లు తమకు తాముగా కనిష్టంగా 5 సంవత్సరాలు, గరిష్టంగా 10 సంవత్సరాల వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్లను పొందవచ్చు. ఈ పథకంలో రూ.2 కోట్ల వరకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయవచ్చు. బ్యాంక్ గోల్డెన్ ఇయర్ FD పథకం కింద పొందే అదనపు వడ్డీ ప్రయోజనం కొత్త ఖాతాలను తెరవడం, డిపాజిట్లను పునరుద్ధరించడం రెండింటిపై అందుబాటులో ఉంటుంది. ఈ పథకంలో ఎఫ్‌డి పొందితే వారు సంవత్సరానికి 6.30 శాతం వడ్డీని పొందుతారు. ఈ పథకం 8 ఏప్రిల్ 2022 వరకు అందుబాటులో ఉంటుంది.

ఎంత వడ్డీ పొందుతారు

ICICI బ్యాంక్ ఇప్పుడు 5 సంవత్సరాల 1 రోజు నుండి 10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై ప్రజలకు 5.60 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఈ స్కీమ్‌లో FD ద్వారా సంవత్సరానికి 6.35 శాతం వడ్డీని పొందుతారు. గోల్డెన్ ఇయర్స్ ఎఫ్‌డి స్కీమ్‌లో ఉన్న డిపాజిట్‌ను ముందుగానే విత్‌డ్రా చేస్తే లేదా 5 సంవత్సరాల 1 రోజు లేదా తర్వాత మూసివేయబడినట్లయితే పెనాల్టీ రేటు 1.25 శాతం ఉంటుందని సీనియర్ సిటిజన్‌లు తెలుసుకోవాలి. ఈ పథకం కింద తెరిచిన ఖాతా 5 సంవత్సరాల 1 రోజులోపు విత్‌డ్రా చేయబడినా లేదా మూసివేయబడినా బ్యాంకు ఉపసంహరణ నియమాలు వర్తిస్తాయి.

సీనియర్ సిటిజన్లకు ఎస్‌బీఐ ఊరట..

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ SBI సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక FD పథకం అయిన SBI వీకేర్ గడువును కూడా పొడిగించింది. బ్యాంక్ SBI వీకేర్ స్కీమ్ గడువును 30 సెప్టెంబర్ 2022 వరకు పొడిగించింది.

ఇవి కూడా చదవండి:

Flipkart Delivery: ఫ్లిప్‌కార్ట్‌ మరింత వేగం.. కేవలం 45 నిమిషాల్లోనే డెలివరీ సేవలు..!

Harley Davidson: హార్లే డేవిడ్సన్‌ నుంచి అద్భుతమైన ఎలక్ట్రిక్‌ బైక్‌.. యారో ఆర్కిటెక్చర్‌ టెక్నాలజీతో..