PF డబ్బులు అకౌంట్లోనే స్ట్రక్ అయిపోయాయా..? అయితే ఎలా విత్ డ్రా చేసుకోవాలో తెలుసా..
పీఎఫ్.. అకౌంట్ గురించి వివిధ రంగాల్లో పనిచేసేవారికి చెప్పాల్సిన పనిలేదు. ఉద్యోగులు.. ప్రతి నెల తమ నెలవారీ జీతంలో నుంచి కొంతభాగం పీఎఫ్ అకౌంట్కు
పీఎఫ్.. అకౌంట్ గురించి వివిధ రంగాల్లో పనిచేసేవారికి చెప్పాల్సిన పనిలేదు. ఉద్యోగులు.. ప్రతి నెల తమ నెలవారీ జీతంలో నుంచి కొంతభాగం పీఎఫ్ అకౌంట్కు బదిలీ చేయబడుతుంది. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్.. ఖాతాలో ఉద్యోగులకు ప్రతి నెల కొంత నగదు జమ అవుతుంటుంది. అయితే తమ తమ పీఎఫ్ ఖాతాలలో ఎంత అమౌంట్ ఉందనేది ఇప్పుడు ఉద్యోగులు సులభంగా తెలుసుకోవచ్చు. అలాగే ఆ నగదు విత్ డ్రా చేసుకోవడం కూడా ఇప్పుడు సులభమే. అయితే కొన్ని సందర్భాల్లో పీఎఫ్ నగదు విత్ డ్రా చేసుకోవడానికి వీలు కాదు… ఖాతాలోనే డబ్బులు స్ట్రక్ అయిపోతుంటాయి. అంటే.. ఉద్యోగాలు మారినప్పుడు లేదా.. కొత్త ఆకౌంట్ జత చేయనప్పుడు ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి. దీంతో ఉద్యోగులకు ఇది పెద్ద తలనొప్పిగా మారిపోతుంది. స్ట్రక్ అయిన డబ్బులను విత్ డ్రా చేసుకునేందుకు ప్రయత్నించి మధ్యలోనే వదిలేస్తుంటారు.
ఇక మరికొందరికి పాత కంపెనీలోని పీఎఫ్ అకౌంట్ నంబర్ గుర్తుండదు. అలాగే సమయంలో కొత్త యూఏఎన్ నంబరుకు మీ పాత పీఎఫ్ అకౌంట్ ను ఎలా లింక్ చేసుకోవాలి.. పీఎఫ్ ఖాతాలో స్ట్రక్ అయిన నగదును ఎలా విత్ డ్రా చేసుకోవాలో ఒకసారి తెలుసుకుందామా.
మీ పీఎఫ్ ఖాతాలలో నగదు దాదాపు 36 నెలలు క్రెడిట్ కాకపోయినా.. ఆ కాలంలో ఎలాంటి విత్ డ్రా అప్లికేషన్ రాకపోయినా.. ఆ అకౌంట్ ఇన్ఆపరేటివ్ అయిపోతుంది. దీంతో మీ నగదు విత్ డ్రా చేసుకోవడం కష్టమవుతుంది. ఇలాంటి ఖాతాల కోసం ఈపీఎఫ్ఓ హెల్ప్ డెస్క్ ప్రారంభించింది. దీంతో డెస్క్ ఇన్ఆపరేటివ్ గా మారిన ఖాతాల నుంచి పీఎఫ్ నంబర్ గుర్తులేని అకౌంట్ల నుంచి నగదు ఎలా విత్ డ్రా చేసుకోవాలనే విషయంలో సహయపడుతుంది. ఇందుకోసం యూజర్లు ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్ సైట్ ఓపెన్ చేసి అందులో అవర్ సర్వీసెస్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఫర్ ఎంప్లాయిస్ ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత సర్వీసెస్ అనే ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఇందులో చివరన ఇన్ఆపరేటివ్ అకౌంట్ హెల్ప్ డెస్క్ ఉంటుంది.. దానిపై క్లిక్ చేయగానే.. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో First time user Click here to Proceed అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
ఒకవేళ మీరు మొదటిసారి ఓపెన్ చేస్తే ఒక మెసేజ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో వెయ్యి పదాలలో చెప్పాలి. ఈ పీఎఫ్ అకౌంట్ ఎంతకాలం నాటిది.. సమస్య ఎంటీ అనేవి చెప్పాలి. ఆ తర్వాత నెక్ట్స్ బటన్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వతా న్యూ విండోలో మీ పీఎఫ్ అకౌంట్ సమాచారన్ని ఎంటర్ చేయాలి. ఇది మీ ఖాతాకు వెళ్లేందుకు సహాయపడుతుంది. ఇందులో మీ వ్యక్తిగత సమాచారం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మీ పేరు, పుట్టినతేదీ, మొబైల్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో ఈపీఎఫ్ఓ హెల్ప్ డెస్క్ మిమ్మల్ని కాంటాక్ట్ అయి.. మీనుంచి మరింత సమాచారాన్న సేకరిస్తుంది. అంతేకాకుండా.. మీ ఫోన్ నంబరుకు ఒక పిన్ కూడా పంపుతుంది. దానిని ఎంటర్ చేస్తే రిక్వెస్ట్ కు సంబంధించిన రిఫరెన్స్ ఐడీతోపాటు.. మీ స్టేటస్ ట్రాక్ చేసుకోవచ్చు. చివరగా సబ్మిట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. మీరు ఈ ప్రాసెస్ మొత్తం మొదటి సారి చేస్తున్నట్లయితే మీకు First time user Click here to Proceed అని సెలక్ట్ చేయాలి. ప్రాసెస్ మొత్తం పూర్తైన తర్వాత Existing User Click here to view status క్లిక్ చేయాలి. ఆ తర్వాత రిఫరెన్స్ నంబర్, మొబల్ నంబర్ ఎంటర్ చేసి.. ఈ పాత అకౌంట్ డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు. ఇలా మీ పాత అకౌంట్ స్టేటస్, నగదు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు.
Also Read: Keerthy Suresh: కీర్తి సురేష్ కొత్త అవతారం.. ఆ హీరోతో కలిసి లాయర్‍గా మారిన మహానటి..
Skin Care: మీ చర్మం తరచూ పొడిబారుతుందా ? అయితే మీకు ఈ వ్యాధులు ఉన్నట్లే.. ఏంటంటే..
AP Crime News: అయ్యో ఇంత ప్రేమనా..? కుక్క చనిపోయిందని యజమాని కూడా..