Motorola Frontier: మోటోరోలా నుంచి కొత్త ఫోన్.. 194 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు మరెన్నో అదిరిపోయే ఫీచర్లు.
Motorola Frontier: ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం మోటోరాలో ఇటీవల వరుసగా స్మార్ట్ ఫోన్‌లు విడుదల చేస్తోంది. అత్యాధునిక ఫీచర్లతో కూడిన కొంగొత్త స్మార్ట్ ఫోన్‌లను లాంచ్ చేస్తోంది టెక్ మార్కెట్లో సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మోటోరోలా ఫ్రంటియర్..
Motorola Frontier: ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం మోటోరాలో ఇటీవల వరుసగా స్మార్ట్ ఫోన్‌లు విడుదల చేస్తోంది. అత్యాధునిక ఫీచర్లతో కూడిన కొంగొత్త స్మార్ట్ ఫోన్‌లను లాంచ్ చేస్తోంది టెక్ మార్కెట్లో సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మోటోరోలా ఫ్రంటియర్ (Motorola Frontier) పేరుతో మరో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ ఫోన్ ఫీచర్లకు సంబంధించి మోటోరోలా అధికారికంగా ఎలాంటి ఫీచర్లు ప్రకటించకపోయినప్పటికీ, కొన్ని ఫీచర్లు లీకయ్యాయి. లీక్ అయిన సమాచారం మేరకు ఈ స్మార్ట్ ఫోన్‌లో రానున్న ఫీచర్లు ఇలా ఉన్నాయి..
- మోటోరోలా ఈ ఫోన్‌లో కెమెరాకు అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చింది. ఏకంగా 194 మెగా పిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 60 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించనున్నట్లు సమాచారం.
- ఇక ఇందులో 144 హెట్ట్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.67 అంగుళాల ఫుల్ హెడ్‌డీ+ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు.
- స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 అప్‌గ్రేడెడ్ వెర్షన్ చిప్‌సెట్‌తో కూడిన LPDDR5 12 జీబీ ర్యామ్‌ను అందించనున్నారు.
- 50 వాట్ల వైర్‌లెస్ ఫాస్ట్ చార్జింగ్, 125 వాట్ల వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ ఈ ఫోన్ సొంతం. ఇక బ్యాటరీ విషయానికొస్తే 4500 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ ఇవ్వనున్నారు.
- కనెక్టివిటీ విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో వైఫై 6ఈతో పాటు యూఎస్‌బీ టైప్-సీ, బ్లూటూత్ వీ5.2 కనెక్టివిటీ ఇవ్వనున్నారు.
- ఆండ్రాయిడ్ 12 మైయూక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ స్మార్ట్ ఫోన్ రానుంది.
- ఇక అధునాత ఫీచర్లతో రానున్న ఈ స్మార్ట్ ఫోన్ ధర, అధికారిక ప్రకటన 2022 జూలైలో రానున్నట్లు సమాచారం.
Also Read: East Godavari: బైక్‌ను ఢీకొట్టిన వ్యాన్.. కొడుకుతో సహా దంపతుల దుర్మరణం..
Rajasthan Crime: ఘోర ప్రమాదం.. అదుపు తప్పి నదిలో పడ్డ కారు.. వరుడు సహా తొమ్మిది మంది మృతి
Digital Voter ID Card: డిజిటల్ ఓటర్ ఐడి డౌన్‌లోడ్ ఇలా చేసుకోండి.. వీడియో