Black Box: బ్లాక్ బాక్స్ అంటే ఏమిటి.. విమానాల్లో దానిని ఎందుకు అమరుస్తారు.. దీని ఆసక్తికర వివరాలు మీకోసం..
Black Box: ఏదైనా విమాన ప్రమాదం లేదా హెలికాప్టక్ క్రాష్ లాంటివి సంభవించినప్పుడు మనం సాధారణంగా విని పేరు బ్లాక్ బాక్స్. అసలు ప్రమాదం ఎందుకు జరిగింది లేదా ప్రమాద సంయంలో ఏం జరిగింది అనేది తెలుసుకోవడానికి..
Black Box: ఏదైనా విమాన ప్రమాదం లేదా హెలికాప్టక్ క్రాష్ లాంటివి సంభవించినప్పుడు మనం సాధారణంగా విని పేరు బ్లాక్ బాక్స్. అసలు ప్రమాదం ఎందుకు జరిగింది లేదా ప్రమాద సంయంలో ఏం జరిగింది అనేది తెలుసుకోవడానికి నిపుణులు ప్రమాద ప్రాంతంలో ముందుగా వెతికే వస్తువు బ్లాక్ బాక్స్. ఎందుకంటే ప్రమాదానికి ముందు జరిగిన సంభాషణ, విమాననానికి సంబంధించిన చాలా వివరాలు అందులోనే నిక్షిప్తిమై ఉంటాయి. అసలు ప్రమాదానికి గల కారణాలను కనుకొనడానికి ముందుగా దీనిని పరీశీలించక తప్పదు. అందుకే దీనికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. దీనిని తయారు చేయటం నుంచి విమానంలో ఎక్కడ పెట్టాలి అనే దాని వరకూ చాలా జాగ్రత్త పాటిస్తారు. ఇంతకీ ఈ బ్లాక్ బాక్స్ కు సంబంధించిన ఆసక్తికర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
విమానాలు, హెలికాప్టర్లు, చాపర్లు వంటి వాటిలో ఈ బ్లాక్ బాక్స్ అనే పదాన్ని మనం ఎక్కువగా వింటూ ఉంటాము. దీనిని విమానం బ్లాక్ బాక్స్ లేదా ఫ్లైట్ డేటా రికార్డర్ అని పిలుస్తుంటారు. ఇది విమానం ప్రయాణ సమయంలో దాని అన్ని కార్యకలాపాలను రికార్డు చేసే అంత్యంత కీలకమైన పరికరం. భద్రతా కోణంలో ఈ పెట్టెను సాధారణంగా విమానం వెనుక భాగంలో ఉంచూతారు. ఈ పెట్టెను ప్రత్యేకంగా టైటానియం మెటల్‌తో తయారు చేస్తారు. పైగా టైటానియంతో చేసిన బాక్స్ లోనే అమర్చి విమానంలో ఉంచుతారు. దీనిని ఎలా తయారు చేస్తారంటే.. ఎంత ఎత్తునుంచీ పడినా లేదా సముద్రాల్లో పడినా ఇందులోని సమాచారానికి ఎటువంటి నష్టం వాటిల్లదు. దీనికి విద్యుత్ కనెక్షన్ లేకపోయినప్పటికీ సుమారు 30 రోజుల పాటు పని చేస్తుంది. దీనిని దృఢమైన మెటల్ తో తయారు చేయడం వల్ల 11000 ° C ఉష్ణోగ్రతను సైతం తట్టుకోగలదు.
ఈ పెట్టె ఎక్కడైనా పడినప్పుడు.. దాదాపు 30 రోజుల పాటు బీప్ సౌండ్‌తో పాటు తరంగాలను విడుదల చేస్తూనే ఉంటుంది. దీని నుంచి వచ్చే శబ్ధాన్ని పరిశోధకులు దాదాపు 2-3 కిలోమీటర్ల దూరం నుంచి గుర్తించగలరు. బ్లాక్ బాక్స్‌కు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇది సముద్రంలో 14000 అడుగుల లోతు నుంచి కూడా తరంగాలను విడుదల చేయగలదు.
ఇవీ చదవండి..
Multibagger Stock: రూ. లక్షను.. రూ. 65 లక్షలు చేసిన మల్టీ బ్యాగర్ స్టాక్.. బ్రోకరేజ్ సంస్థలు టార్గెట్ ఎంత ఇచ్చాయంటే..Dadasaheb Phalke Awards: వైభవంగా ‘దాదాసాహెబ్’ అవార్డు ఫంక్షన్.. సత్తా చాటిన ‘పుష్ప’.. విజేతల పూర్తి లిస్ట్