జైలుకెళ్లినా మారని తీరు.. మరోసారి దొంగతనం చేస్తూ.. పోలీసులకు చిక్కి..

చదువు మధ్యలో ఆపేసి, జల్సాలకు అలవాటు పడ్డాడు. అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలనే కోరికతో దొంగగా మారాడు. తాళం వేసి ఉన్న ఇళ్లల్లో చోరీలు చేశాడు. వచ్చిన డబ్బులతో హాస్టళ్లు..

జైలుకెళ్లినా మారని తీరు.. మరోసారి దొంగతనం చేస్తూ.. పోలీసులకు చిక్కి..
Chittoor man Arrested
Follow us
Ganesh Mudavath

|

Updated on: Feb 20, 2022 | 9:35 AM

చదువు మధ్యలో ఆపేసి, జల్సాలకు అలవాటు పడ్డాడు. అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలనే కోరికతో దొంగగా మారాడు. తాళం వేసి ఉన్న ఇళ్లల్లో చోరీలు చేశాడు. వచ్చిన డబ్బులతో హాస్టళ్లు, ఇతర రాష్ట్రాల్లోని హోటళ్లలో ఉంటూ జల్సాలు చేసేవాడు. దొంగతనం కేసులో గతంలో జైలు కు వెళ్లినా ప్రవర్తనలో మార్పు రాలేదు. అక్కడ పరిచయమైన ఓ వ్యక్తితో కలిసి.. జైలు నుంచి బయటకు వచ్చాక మళ్లీ దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో పోలీసులకు అనుమానం వచ్చి తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాలో ఇద్దరూ పోలీసులకు చిక్కారు. వారిని విచారించగా తామే చోరీలు చేశామని ఒప్పుకున్నారు. వారి వద్ద నుంచి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఉమ్మడి మెదక్(Medak) జిల్లా తూప్రాన్(Toopran) లో జరిగిన ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఐడీఏ బొల్లారానికి చెందిన శ్రీకాంత్‌.. చదువు మధ్యలో ఆపేశాడు. జల్సాలకు అలవాటుపడి దొంగతనాలు చేయడాన్ని అలవాటుగా చేసుకున్నాడు. 2010 నుంచి ఉమ్మడి మెదక్‌ జిల్లాతోపాటు హైదరాబాద్‌లో ని పలు ఇళ్లల్లో దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. 2019 డిసెంబరులో మనోహరాబాద్‌లో చేసిన చోరీ కేసులో పోలీసులకు పట్టుబడి రిమాండ్ కు వెళ్లాడు. అక్కడ నర్సాపూర్‌ మండలం వడ్డెరపల్లికి చెందిన బాలరాజుతో పరిచయం ఏర్పడింది. జైలు నుంచి విడుదలైన తర్వాత వీరిద్దరు కలిసి చోరీలు చేయడం ప్రారంభించారు. గతేడాది సెప్టెంబరు నుంచి ఈ ఏడాది జనవరి వరకు తూప్రాన్‌లో 7 ఇళ్లలో దొంగతనం చేశారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో తూప్రాన్‌ బస్టాండ్‌ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న శ్రీకాంత్‌, బాలరాజును అదుపులోకి తీసుకుని విచారించారు. తామే ఈ దొంగతనాలకు పాల్పడినట్లు అంగీకరించారు. వారి వద్ద నుంచి బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.

చోరీ చేసిన బంగారాన్ని తక్కువ ధరకు విక్రయించి.. శ్రీకాంత్ విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇతని తీరులో మార్పు రాకపోవడంతో కుటుంబసభ్యులు కూడా అతన్ని ఇంటికి రానివ్వడం లేదు. దీంతో జైలు నుంచి బయటికొచ్చిన తర్వాత హాస్టళ్లు, ఇతర రాష్ట్రాల్లోని హోటళ్లలో ఉంటూ జల్సాలు చేసేవాడు. ఈ క్రమంలో శ్రీకాంత్ తన కుటుంబం నుంచి దూరంగా ఉంటున్నా.. జైలు నుంచి ఎవరు బెయిల్‌పై తీసుకొస్తున్నారనేది చర్చనీయాంశంగా మారింది. గతంలో మనోహరాబాద్‌లో జరిగిన చోరీ కేసు విచారణలో శ్రీకాంత్ గొంతు కోసుకోవడం గమనార్హం.

ఇవీచదవండి.

Viral Video: జింకను చుట్టుముట్టిన సింహాలు !! కట్ చేస్తే సీన్ సితారే !! వీడియో

Viral video: అతడికి ఎంత ధైర్యం.. హై స్పీడ్​లో తిరుగుతున్న ఫ్యాన్​ను ఏ చేశాడంటే..

News Watch: తగ్గేదేలే – కేసీఆర్… మరిన్ని వార్తా కథనాల సమాహారం కోసం వీక్షించండి న్యూస్ వాచ్