AP Movie Ticket Issues: టాలీవుడ్‌కు గుడ్ న్యూస్ చెప్పనున్న ఏపీ సర్కార్.. ప్రేక్షకులకు, చిత్రపరిశ్రమకు ఆమోదయోగ్యంగా నిర్ణయం!
AP Movie Ticket Issues: ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh )లో సినిమా టికెట్ రేట్ల పెంపుకు ముహూర్తం ఖరారైంది. రేపు లేదా ఎల్లుండి రేట్లపై జీవో జారీ చేయనుంది సర్కార్. ప్రేక్షకులతో పాటు చిత్ర పరిశ్రమకు ఇబ్బంది..
AP Movie Ticket Issues: ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh )లో సినిమా టికెట్ రేట్ల పెంపుకు ముహూర్తం ఖరారైంది. రేపు లేదా ఎల్లుండి రేట్లపై జీవో జారీ చేయనుంది సర్కార్. ప్రేక్షకులతో పాటు చిత్ర పరిశ్రమకు ఇబ్బంది లేకుండా ధరలు ఖరారు చేసినట్లు సమాచారం. కనీస ధర 40, గరిష్ట ధర 140గా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఏపీలో సినిమా టిక్కెట్ పంచాయతీకి తెరపడనుంది. కొంతకాలంగా నెలకొన్న రేట్ల వివాదానికి సీఎం జగన్ చెక్ పెట్టనున్నారు. సినిమా హాళ్లలో టికెట్ రేట్లు నిర్ణయిస్తూ గతంలో విడుదల చేసిన జీవో 35 తో వివాదం మొదలైంది..ఆ తర్వాత థియేటర్ యజమానులు కోర్టుకు వెళ్లడం.. ప్రభుత్వం కొత్తగా కమిటీని కూడా నియమించింది.ఓ వైపు కమిటీ చర్చలు జరుగుతుండగా… ప్రభుత్వం కొంతమంది సినీ ప్రముఖులతోనూ చర్చలు జరిపింది. మొత్తంగా ఈ నెల 17న కమిటీ చివరి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రేట్లు, థియేటర్ల కేటగిరీ, ఐదు షోలు వంటి అంశాలపై దాదాపు నిర్ణయం తీసుకున్నారు. డ్రాఫ్ట్ నివేదికను సీఎం జగన్ కు పంపింది కమిటీ.
కమిటీ నివేదికపై తుది నిర్ణయం తీసుకోనున్నారు సీఎం. తాజాగా ఇచ్చిన నివేదిక ప్రకారం రేట్లు పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కమిటీ. పంచాయతీలు, నగర పంచాయతీలను ఒకే కేటగిరీగా తీసుకొస్తున్నట్లు సమాచారం. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లుగా మొత్తం మూడు కేటగిరీలో నాన్ ఏసీ, ఎయిర్ కూల్, ఏసీ థియేటర్లగా రేట్లు నిర్దారించారు. కనిష్ట ధర నాన్ ఏసీ థియేటర్లలో 40 రూపాయలు, ఏసీ థియేటర్లలో 70 రూపాయలుగా నిర్దారించినట్లు తెలిసింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఏసీ, మల్టీప్లెక్స్‌లకు సైతం ప్రత్యేక ధరలను సూచించినట్లు తెలుస్తుంది. ఇక చిన్న సినిమాలకు ఐదో షోకు అనుమతి,75 కోట్ల బడ్జెట్ దాటిన సినిమాలకు రేట్లు పెంచుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిసింది.
తుది మార్పులు చేర్పులు కోసం సీఎం కు చేరింది నివేదిక. సీఎం ఆమోదిస్తే సోమ లేదా మంగళవారాల్లో జీవో జారీ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ నెల 25 నుంచి భీమ్లా నాయక్‌తో పాటు మరిన్ని పెద్ద సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి.ఈలోగానే జీవో ఇచ్చేలా ప్రభుత్వం ముందుకెళ్తున్నట్లు తెలిసింది.
Also Read: