ఈత సరదా ప్రాణం తీసింది.. స్కూల్ కి వెళ్లి ఉంటే బతికే వాడేమో..!!

రోజాలాగే పాఠశాలకు బయల్దేరారు. అయితే స్కూల్ కు డుమ్మా కొట్టి సరదాగా ఈత కొట్టేందుకు నీటిలో దిగారు. లోతు ఎక్కువగా ఉండటంతో ఓ బాలుడు నీటిలో మునిగిపోయాడు. ఈ విషయాన్ని...

ఈత సరదా ప్రాణం తీసింది.. స్కూల్ కి వెళ్లి ఉంటే బతికే వాడేమో..!!
medico death
Follow us
Ganesh Mudavath

|

Updated on: Feb 20, 2022 | 1:47 PM

రోజాలాగే పాఠశాలకు బయల్దేరారు. అయితే స్కూల్ కు డుమ్మా కొట్టి సరదాగా ఈత కొట్టేందుకు నీటిలో దిగారు. లోతు ఎక్కువగా ఉండటంతో ఓ బాలుడు నీటిలో మునిగిపోయాడు. ఈ విషయాన్ని తోటి స్నేహితులు బాలుడి తల్లికి చెప్పాడు. వారు వచ్చి చూసే సరికే బాలుడు మృతి చెందాడు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. విశాఖపట్నం జిల్లా చంద్రంపాలెం ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న తాళ్లపాక సంతోష్‌.. తన ఐదుగురు స్నేహితులతో కలిసి పాఠశాలకు వెళ్తున్నామని చెప్పి బయటకు వెళ్లారు. అయితే స్కూల్ కు వెళ్లకుండా.. స్థానికంగా ఉన్న గంభీరం జలాశయం వద్దకు వెళ్లారు. సరదాగా ఈత కొట్టేందుకు నీటిలో దిగారు. లోతు ఎక్కువగా ఉండటం, నీటి ఉద్ధృతి వేగంగా ప్రవహిస్తుండటంతో సంతోష్ నీటిలో మునిగిపోయాడు. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన తోటి స్నేహితులు పరుగున ఇంటికి వెళ్లి, విషయాన్ని సంతోష్ తల్లికి చెప్పారు. వారు వచ్చి చూడగానే సంతోష్ మృతి చెందాడు.

ఈ ఘటనపై సంతోష్ తల్లి నూకరత్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకుని, పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం బాలుడి మృతదేహాన్ని భీమిలి శవాగారానికి తరలించారు. సంతోష్‌కు తండ్రి లేరు. తల్లి, సోదరి ఉన్నారు. ఊహించని ఈ దుర్ఘటనలో అల్లారుముద్దుగా చూసుకుంటున్న కుమారుడు చనిపోవడంతో ఆ తల్లి రోదించిన తీరు కంటతడి పెట్టించింది.

Also Read

Viral Video: పెళ్లి వేడుకలో షాకింగ్ సీన్.. వరుడిపై కోపంతో వధువు ఏం చేసిందంటే..? వీడియో వైరల్..

Health Tips: మీకు ఎసిడిటీ సమస్య ఉందా..? ఈ చిట్కాలతో అద్భుతమైన ప్రయోజనం..!

మంచులో చిక్కుకున్న భారీ అనకొండ !! దగ్గరకెళ్ళి చూస్తే.. అంతా షాక్‌ !! వీడియో