AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: మీకు ఎసిడిటీ సమస్య ఉందా..? ఈ చిట్కాలతో అద్భుతమైన ప్రయోజనం..!

Health Tips: ఇప్పుడున్న జీవనశైలి కారణంగా మనిషికి అనారోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి. సమయానికి భోజనం చేయకపోవడం, సరైన నిద్ర లేకపోవడం, టెన్షన్‌, ఒత్తిడి..

Health Tips: మీకు ఎసిడిటీ సమస్య ఉందా..? ఈ చిట్కాలతో అద్భుతమైన ప్రయోజనం..!
Subhash Goud
|

Updated on: Feb 20, 2022 | 11:34 AM

Share

Health Tips: ఇప్పుడున్న జీవనశైలి కారణంగా మనిషికి అనారోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి. సమయానికి భోజనం చేయకపోవడం, సరైన నిద్ర లేకపోవడం, టెన్షన్‌, ఒత్తిడి కారణాల వల్ల ఏదో ఒక సమస్య వచ్చిపడుతోంది. ఇక చాలా మందికి ఎసిడిటీ (Acidity) సమస్య ఉంటుంది. తినే ఆహార (Food) అలవాట్లు, రకరకాల ఆహార పదార్థాలు తినడం, సమయానికి భోజనం చేయకపోవడం ఇలా రకరకాల కారణాల వల్ల ఈ సమస్య వస్తుంటుంది. చాలా మంది ఏదైనా కాస్త తినగానే తేన్పులు, ఆవలింతలు వంటివి వస్తుంటాయి. ఎక్కువగా తినడం, సమయం కాని సమయంలో తినడం, భోజనాల మధ్య ఎక్కువ గ్యాప్​ పాటించడం వల్ల ఈ సమస్య తీవ్రమవుతుంది.అయితే కొన్ని సాధారణ జీవనశైలి మార్పులతో ఎసిడిటీని నివారించవచ్చు. ఎసిడిటీ నివారణకు అనేక చిట్కాల (Tips)ను వెల్లడిస్తున్నారు ఆయుర్వేద నిపుణులు.

ఎసిడిటీ రాకుండా పాటించాల్సిన చిట్కాలు ఇవే..

► సమయానికి భోజనం చేయడం ఉత్తమం.

► ఎక్కువగా కారం, పులుపు, ఉప్పు, పులియబెట్టిన, వేయించిన, ఫాస్ట్ ఫుడ్ తినడాన్ని మానుకోండి.

► ఏ ఆహారమైనా సరే సమతుల్యంగా తినండి. అతిగా తింటే కూడా ప్రమాదమే.

► రోజూ క్రమ పద్ధతిలో సమయం ప్రకారం తినడం అలవాటు చేసుకోండి.

► పుల్లని పండ్లకు సాధ్యమైనంత దూరంగా ఉండటం మంచిది.

► ధూమపానం, ఆల్కహాల్, టీ, కాఫీ, ఆస్పిరిన్ వంటి తరచూ తీసుకోవడం మానుకోండి.

► రాత్రి పడుకునే సమయంలో తినకండి. పడుకోవడానికి కనీసం గంట ముందు డిన్నర్ చేయడం అలవాటు చేసుకోండి.

► మాంసాహారం ఎక్కువగా తినకపోవడమే మంచిది.

► భోజనం చేసిన వెంటనే, పడుకోవడం మానుకోండి. ఇది మీ పొట్ట భాగంలో ఆహారం మిగిలిపోయేలా చేస్తుంది. ఇది వల్ల ఎసిడిటి సమస్య ఎదురవుతుంది.

ఇప్పటికే ఎసిడిటీతో బాధపడుతుంటే?

ఇప్పటికే ఎసిడిటీతో బాధపడుతున్న వారు కొన్ని సులభమైన ఇంటి నివారణ చిట్కాలను పాటించినట్లయితే మంచి ప్రయోజనం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

► ప్రతి రోజూ కొన్ని కొత్తిమీర వాటర్​ తాగండి.

► ఖాళీ కడుపుతో కొన్ని నానబెట్టిన ఎండుద్రాక్షలను తినండి.

► భోజనం తర్వాత అర టీస్పూన్ సోంపు గింజలను నమలండి.

► మధ్యాహ్నం సమయంలో కొబ్బరి నీళ్లు లేదా షర్బత్ రసం తాగండి.

► తగినంత విశ్రాంతి తీసుకోండి. సాధ్యమైనంత ఎక్కువగా నీరు తాగండి. మంచి నిద్ర, యోగా, ప్రాణాయామం, ధ్యానం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి.

► నిద్రవేళలో 1 టీస్పూన్ ఆవు నెయ్యితో గోరువెచ్చని పాలు తీసుకోండి. ఇది మీ నిద్రలేమి, మలబద్ధకానికి చెక్ పెట్టేందుకు ఉపయోగపడుతుంది.

► రోజ్ వాటర్, పుదీనా నీరు తాగండి, ఇది మీ జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది.

(గమనిక: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వైద్య నిపుణుల వివరాల ప్రకారం అందించబడుతుంది. ఏదైనా సందేహాలుంటే ముందుగా వైద్యులను సంప్రదించండి)

ఇవి కూడా చదవండి:

Kidney Stones: మూత్రపిండాలలో రాళ్లతో బాధపడేవారు ఈ ఆహారాలకు దూరంగా ఉండండి..!

Health Tips: గోధుమ లేదా మల్టీగ్రెయిన్ చపాతీ.. బరువు తగ్గడానికి ఏది మంచిది?