Kidney Stones: మూత్రపిండాలలో రాళ్లతో బాధపడేవారు ఈ ఆహారాలకు దూరంగా ఉండండి..!

Kidney Stones: చాలా మంది కిడ్నీ స్టోన్స్‌తో బాధపడుతుంటారు. అలాంటి వారు కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడంలో జాగ్రత్తలు పాటించాలి. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడిన..

Kidney Stones: మూత్రపిండాలలో రాళ్లతో బాధపడేవారు ఈ ఆహారాలకు దూరంగా ఉండండి..!
Follow us
Subhash Goud

|

Updated on: Feb 20, 2022 | 8:02 AM

Kidney Stones: చాలా మంది కిడ్నీ స్టోన్స్‌తో బాధపడుతుంటారు. అలాంటి వారు కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడంలో జాగ్రత్తలు పాటించాలి. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడిన తర్వాత సరైన చికిత్స తీసుకోకపోతే మూత్రపిండాల పనితీరు మందగించి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. అందుకు మూత్రపిండా (Kidney)ల్లో రాళ్లు ఏర్పడితే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం మంచిది. స్టోన్స్‌ వల్ల మూత్రపిండాల వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యం ఇంకా దెబ్బతింటుంది. అయితే మూత్రపిండాలలో రాళ్లు ఉన్నవారు తప్పకుండా కొన్ని ఆహారాలు తినకూడదు. వైద్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం..

మూత్రపిండాల్లో రాళ్లు కావడానికి కారణాలు:

ఈ సమస్య స్త్రీ, పురుషు, వయోపరిమితి లేకుండా రావచ్చు. రోజూ తగినంత నీళ్ళు తాగకపోవడం, కీళ్ళవ్యాధి, వంశపారంపర్యంగా, స్థూలకాయం ఉండటం, చలికాలం, మద్యపానం వంటి కారణాల వల్ల రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది.

తినకూడని ఆహారాలు:

మూత్రపిండాలలో రాళ్లతో బాధపడేవారు కొన్ని ఆహార నియమాలు పాటించడం మంచిది. మూత్రపిండాలు నడుము భాగంలో వెన్నెముకకు ఇరువైపులా ఉంటాయి. అందువల్ల స్టోన్స్‌ అయిన తర్వాత నొప్పి ఈ ప్రాంతంలో మొదలై పొత్తికడుపు వరకు పాకుతుంది. అలాగే మూత్రవిసర్జన సమయంలో నొప్పి బాగా ఉంటుంది. మూత్రవిసర్జన తరచూ చేయాల్సి వస్తుంటుంది. మూత్రం తక్కువ పరిమాణంలో, మంటగా రావడం, మూత్రం పసుపురంగు లేదా ఎరుపురంగులో రావడం, కడుపులో నొప్పి, వికారం, ఆకలి తగ్గిపోవడం, మలవిసర్జనకు వెళ్ళాల్సి వచ్చినట్లుండటం, తరచుగా వాంతులు కావడం, జ్వరం రావడం వంటి లక్షణాలు ఉంటాయి. అందుకే ఆహారం తీసుకునే విషయంలో కూడా కొన్ని నియమాలు పాటించాలి. రాళ్లు ఉన్న వారు ఎలాంటి ఆహారం తీసుకోకూడదో చూద్దాం.

ఆకు కూరలు:

ఆకు కూరల్లో ఉండే యాంటీఆక్సిడెంట్స్, శరీరంలోని క్యాల్షియంతో కలిపి క్యాల్సియం ఆక్సాలేంట్ క్రిస్టల్స్‌గా ఏర్పడుతాయి. అవే కిడ్నీలో రాళ్ళుగా మారుతాయి. అందుకే మూత్ర పిండాలలో రాళ్ళు ఉన్నప్పుడు ఆకుకూరలు తింటే సమస్య మరింత పెద్దది అవుతుంది. తినకపోవడమే మంచిది.

టమోటాలు:

టమోటా అద్భుతమైన రుచినిస్తాయి. అలాగే న్యూట్రీషియన్స్ కూడా ఎక్కువ. అయితే పొట్టలో ఆక్సాలేట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు టమోటాలు తింటే పరిస్థితి మరింత ఎక్కువ అవుతుంది. అందుకే మూత్రపిండాలలో రాళ్లు ఉన్నవారు దీనికి దూరంగా ఉండటం మంచిది.

సీఫుడ్:

మూత్రపిండాల రాళ్లతో బాధపడేవారు సీఫుడ్స్‌కు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. సీఫుడ్స్‌లో పురినేస్ అనే కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీంరలో ఎక్కువైనప్పుడు, యూరిక్ యాసిడ్ లెవల్స్ పెరిగి కిడ్నీలో రాళ్ళుగా మారే ప్రమాదం ఉంది. అందుకే జాగ్రత్తగా ఉండటం మంచిది.

ఉప్పు:

మూత్రపిండాలలో రాళ్లు ఉన్నవారు ఉప్పును తగ్గించాలి. హై సోడియం కంటెంట్ పరిస్థితిని మరింత అధికం చేస్తుంది. ముఖ్యంగా చిప్స్, ఎండుచేపలు, పికెల్స్, ప్యాకేజ్ సాస్, కెచప్, చట్నీలు, సాల్ట్ బట్టర్, సాల్ట్ నట్స్, చీజ్, క్యాన్డ్ వెజిటేబుల్స్, స్నాక్స్ , పీనట్స్ వంటి ప్యాకేజ్ ఫుడ్ నివారించాలి.

చాక్లెట్స్ :

మూత్రపిండాలలో రాళ్లతో బాధపడేవారు చాక్లెట్స్ తినకూడదని వైద్యులు సూచిస్తుంటారు. సాధ్యమైనంత వరకు చాక్లెట్లకు దూరంగా ఉండటం మంచిది.

టీ:

చాలా మంది ఉదయం లేవగానే టీతోనే రోజు ప్రారంభిస్తారు. టీ లేనిది పొద్దు గడవదు. కానీ మూత్రపిండాలలో రాళ్లు ఉన్నవారు టీ తాగకపోవడం మంచిదని వైద్యులు సలహా ఇస్తున్నారు. దీని కారణంగా రాళ్లు పెద్దవిగా మారే ప్రమాదం ఉందంట.

ఈ సమస్య రాకుండా ఉండాలంటే..

మన జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి రోజు కనీసం 5 నుండి 6 లీటర్ల నీటిని తాగడం అలవాటు చేసుకోవాలి. ఆపిల్, మిరియాలు, చాకొలేట్, కాఫీ, చీజ్, ద్రాక్ష, ఐస్ క్రీమ్స్, విటమిన్ సి వున్నా పండ్లు, పెరుగు, టమోటా,ఉసిరి, దోస, సపోట, జీడిపప్పు, కాలిఫ్లవర్, గుమ్మడి, పుట్టగొడుగులు, వంకాయ, మాంసము, మద్యం, ఉప్పు, లాంటి వాటిని వీలైనంత వరకు తగ్గించడం మంచిదంటున్నారు వైద్య నిపుణులు.

ఇక కొబ్బరినీళ్లు, బార్లీ, పైనాపిల్‌, అరటిపండ్లు, నిమ్మకాయ, క్యారెట్స్, ఉలవలు, కాకర లాంటివి ఎక్కువగా తీసుకోవడం మంచిది. అలాగే ముల్లంగి, వాటి ఆకులు గింజలను కూడా కషాయంగా తీసుకోవచ్చు, ఉలవలను ఉడకబెట్టి కాషాయంగా అయినా లేదా కూరలలో అయినా తీసుకోవచ్చు.

(గమనిక: ఇందులోని అంశాలన్ని వైద్య నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏవైనా సందేహాలుంటే వైద్యులను సంప్రదించాలి.)

ఇవి కూడా చదవండి:

Too Much Sleep: ఎక్కువసేపు నిద్ర పోతున్నారా.. అయితే మీ గుండె జాగ్రత్త.. ఎందుకంటే..

Skin Care: మీ చర్మం తరచూ పొడిబారుతుందా ? అయితే మీకు ఈ వ్యాధులు ఉన్నట్లే.. ఏంటంటే..