Health Tips: ఆ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే వీటికి దూరంగా ఉండండి.. అవేంటంటే..
మన జీవనశైలి మన ఆరోగ్యంపై ప్రభావం చూస్తోంది. ఈ మద్యకాలంలోచాలామందిని వేధిస్తున్న సమస్య మలబద్ధకం (Constipation).. దీనికి ప్రధాన కారణం-
మన జీవనశైలి మన ఆరోగ్యంపై ప్రభావం చూస్తోంది. ఈ మద్యకాలంలోచాలామందిని వేధిస్తున్న సమస్య మలబద్ధకం (Constipation).. దీనికి ప్రధాన కారణం- మారిన జీవన విధానం, సమయానికి ఆహారం, నీరు తీసుకోకుండా పోవడం. ఒకవేళ తీసుకున్నా హడావుడిగా ముగించడం.. నిత్యం చిరాకు, కోపం.. వీటితో పాటు తీవ్ర మానసిక ఒత్తిడి ఫలితంగా మలబద్ధకం ఏర్పాడుతోంది. ప్రధాన సమస్యగా తీవ్ర రూపం దాల్చుతుంది. మలబద్ధకమే కదా అని చాలా లైట్ తీసుకుంటే అది పెద్ద సమస్యగా మారే ఛాన్స్ ఉంది. మనకు వచ్చే చాలా రకాల రోగాలకు ‘మలబద్ధకమే’ మూల కారణం అని వైద్యులు అంటున్నారు. మలబద్ధకంతో జీర్ణాశయ సమస్యలు.. హైపర్ టెన్షన్, పైల్స్, ఫిషర్స్, తలనొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. నిత్యం మన జీవనశైలిలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం చాలా అరుదు. కానీ మన జీవనశైలే మనమేంటో డిసైడ్ చేస్తుంది. సరైన జీవనశైలి లేకపోవడం కారణంగా మనిషికి అనేక శారీరక, మానసిక సమస్యలు మొదలవుతున్నాయి. కానీ మలబద్దకాన్ని చాలా సరళమైన పద్దతిలో వదిలించుకోవచ్చని వైద్య నిపుణులు అంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో మీరు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మలబద్ధకం సమస్య మొదలైందంటేనే మనం తీసుకునే ఆహార పద్దతిని మార్చాల్సి ఉంటుంది. ఆహారంలో ఎలాంటివి తినకూడదో తెలుసుకుందాం.
పాల ఉత్పత్తులు: రెండు కారణాల వల్ల పాల ఉత్పత్తులు సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. మొదటిది.. అధిక కొవ్వును కలిగి ఉండటం.. రెండవది, మలబద్ధక సమస్య ఉన్నటువంటి వ్యక్తులకు పాలలో ఉండే లాక్టోస్ మరింత అసహనంను కలిగిస్తాయి. ఇలాంటగి సమస్యతో ఇబ్బంది పడుతున్నవారు పాల ఉత్పత్తులకు దూరంగా ఉండటం మేలని వైద్యులు అంటున్నారు.
వేయించిన ఆహారాలు: ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం మలబద్ధకం సమస్యను నియంత్రించడానికి అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే.. “ఆహారం పట్ల శ్రద్ధ వహించడం”. వేయించిన ఆహారాలకు దూంగా ఉండటం చాలా ముఖ్యం. వేయించిన ఆహారంలో అధిక మొత్తంలో కొవ్వు ఉంటుంది.. ఇది మలబద్ధకాన్ని మరింత ప్రోత్సహిస్తుంది. అదే సమయంలో వాటిని జీర్ణం చేసుకోవడం చాలా కష్టంగా మారుతుంది.
కెఫిన్ పానీయాలు: కాఫీ వంటి కెఫిన్ పానీయాలు మీ విరేచనాలను పెంచుతాయి. ఇది కాకుండా, కాఫీ, సోడా, ఎనర్జీ డ్రింక్‌లలో కెఫిన్ ఉంటుంది. ఇది మలబద్దక సమస్యను మరింత పెంచుతుంది. కెఫిన్ ఉన్నటువంటి పానియాలను తీసుకోవడం వల్ల కడుపులో గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇలాంటి సమస్య ఉన్నప్పుడు ప్రతి రోజు కనీసం 3 లీటర్ల నీరు తీసుకోవాలి. అంతే కాకుండా ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.
ప్రాసెస్ చేసిన ఆహారాలు: ప్రాసెస్ చేసిన ఆహారంలో అధికంగా ప్రిజర్వేటివ్‌లు ఉంటాయి. ఇది మలబద్దకం సమస్యను మరింత పెంచుతుంది. కొవ్వు ఎక్కువగా ఉండే ప్రాసెస్ చేసిన ఆహారాలు చాలా ఉన్నాయి, వాటి కారణంగా గ్యాస్ సమస్య మరింత అధికంగా మారుతుంది. అటువంటి పరిస్థితిలో మలబద్ధకంతో బాధపడుతున్న వ్యక్తులు ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి.
చాక్లెట్: చాక్లెట్‌లో చక్కెర పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మలబద్ధకం లేదా గ్యాస్ సమస్యను మరింత పెంచుతుంది. ఇది కాకుండా, చాక్లెట్‌లో కెఫిన్ కూడా ఉంటుంది. ఇది మీ మలబద్దకాన్ని ప్రోత్సహిస్తుంది. మీ అసౌకర్యాన్ని కూడా అధికం చేస్తుంది. అయితే వీటితోపాటు ఏదైౌనా అనారోగ్య సమస్యలున్నప్పుడు మనం వినియోగించే కొన్ని మందుల వల్ల కూడా మలబద్ధకం రావచ్చు.. కాబట్టి వాటి వాడకానికి దూరంగా ఉండాలి.
ఇవి కూడా చదవండి: UP-Punjab Election 2022 Voting Live: ఉత్తర ప్రదేశ్, పంజాబ్‌ల్లో జరుగుతున్న ఎన్నికల పోలింగ్ అప్‌డేట్ కోసం ఇక్కడ చూడండి..
LAW: తండ్రి ఆస్తిపై కుమార్తెకు హక్కు ఉంటుందా.. లా ఏం చెబుతుంది..