AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heart Attack: మొదటిసారే గుండెపోటు తీవ్రంగా ఎందుకు ఉంటుంది..? మరణానికి దారితీసే కారణాలు ఏమిటి..?

Heart Attack: గుండె జబ్బులు ఉన్నవారు ప్రతినిత్యం జాగ్రత్తగా ఉండాలి. గుండెపోటును నివారించేందుకు తగిన నియమాలు పాటించాలి. అందుకు సంబంధించిన ఆహార పదార్థాలు..

Heart Attack: మొదటిసారే గుండెపోటు తీవ్రంగా ఎందుకు ఉంటుంది..? మరణానికి దారితీసే కారణాలు ఏమిటి..?
Subhash Goud
|

Updated on: Feb 20, 2022 | 12:58 PM

Share

Heart Attack: గుండె జబ్బులు ఉన్నవారు ప్రతినిత్యం జాగ్రత్తగా ఉండాలి. గుండెపోటును నివారించేందుకు తగిన నియమాలు పాటించాలి. అందుకు సంబంధించిన ఆహార పదార్థాలు తీసుకోవడంతో పాటు ప్రతి రోజు వ్యాయమం చేస్తుండాలి. గుండెకు మేలు కలిగించే ఫుడ్‌ను తీసుకోవాలి. అయితే గుండెపోటు వచ్చినప్పుడు మూడు సార్లు వస్తుందని భావిస్తుంటారు. కొందరు మూడుసార్లు హార్ట్ స్ట్రోక్‌ (Heat stroke)వస్తే చనిపోతుంటారు.. మరి కొందరేమో మొదటిసారి స్ట్రోక్‌ రాగానే చనిపోతుంటారు. మరి ఇలా ఎందుకు జరుగుతుందనే విషయం చాలా మందిలో వస్తుంటుంది. ఇలా ఎందుకు జరుగుతుందనే అంశంపై వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం..

శరీరంలోని అన్ని కండరాలలాగే గుండె కండరానికి రక్తాన్ని సరఫరా చేసే ముఖ్యమైన రక్తనాళాలు ఉంటాయి. వాటి ద్వారానే గుండెకు ఆక్సిజన్‌, ఇతర పోషకాలు అందుతాయి. ఒక వేళ కొవ్వు పేరుకుపోయినట్లయితే గుండెకు సంబంధించిన కండరంకు సమస్య తలెత్తుతుంటుంది. ఇదే గుండెపోటు రూపంలో వస్తుంటుంది. ఇలాంటి సమయంలో ఆ సమస్యను పరిష్కరించి గుండెకు సరఫరా అయ్యే రక్తం ఎంత త్వరగా సరఫరా అయితే అంత త్వరగా నయం చేసుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్న మాట.

గుండెపోటుకు గురవగానే..

గుండెపోటుకు గురైన వ్యక్తి త్వరగా చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించాలని వైద్యులు సూచిస్తున్నారు. గుండెకు సంబంధించిన రక్తనాళాలన్నీ పూడుకుపోయి ఉండటంతో సమస్య ఏర్పడుతుంది. త్వరగా ఆస్పత్రికి తీసుకువస్తే పూడుకుపోయిన రక్తనాళాన్ని పునరుద్దరించవచ్చు. అప్పుడు మనిషి బతికే అవకాశాలు ఉంటాయి అని వైద్యులు పేర్కొంటున్నారు. ఒక వేళ గుండె కండరం పూర్తిగా చచ్చుబడిపోతే గుండెకే కాకుండా శరీరంలో ఏ అవయవానికి రక్తం సరఫరా కాదు. రక్తనాళాలు పూడుకుపోతున్నకొద్ది పక్కనుండి రక్తనాళాలు వృద్ది చెందుతుంటాయి. వాటినే కొల్లేటరల్స్ అంటారు.

అయితే మొదటిసారిగా పూర్తిగా పూడుకుపోయే పరిస్థితి ఉంటే కొల్లేటరల్స్‌ కూడా వృద్ధి చెందవు కాబట్టి గుండెకు రక్తం సరఫరా చేసే పక్కనాళాలేవి ఉండవు. ఇలాంటి సమయంలోనే మొదటిసారే గుండెపోటు తీవ్రంగా వచ్చిందని చెప్పడం వింటుంటాము. రోగి మరణించేందుకు దారి తీసే ప్రమాదకరమైన స్థితి ఇది అని గుండె వైద్య నిపుణులు చెబుతున్నారు.

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఎప్పుడు నిద్రించాలి?

సరైన నిద్రపోవడం వల్ల శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. దీనిని సిర్కాడియన్ రిథమ్ అంటారు. రోజు ఆలస్యంగా నిద్రపోవడం వల్ల సిర్కాడియన్‌ రిథమ్‌ దిగజారుతుంది. దీనిని మరింతగా మెరుగుపర్చాలంటే రాత్రి 10-11 గంటల మధ్య నిద్రపోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆలస్యంగా నిద్రపోయే మహిళలు ఈ సమయాలను పాటించడం చాలా అవసరమని చెబుతున్నారు. ఆలస్యంగా నిద్రించేవారు ఉదయం వేళ ఆలస్యంగా మేల్కొంటారు. ఫలితంగా వారిలో జీవ గడియారం వేళలు మారుతాయి. ఇది గుండెపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. రాత్రిపూట త్వరగా నిద్రపోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. ఇందుకు సంబంధించి శాస్త్రవేత్తలు పరిశోధన నిర్వహించారు. ఆలస్యంగా నిద్రపోయే వారిలో గుండె జబ్బులు, గుండె పోటు, హార్ట్‌ ఫెయిల్యూర్‌ వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లు గుర్తించారు పరిశోధకులు. రాత్రి 10-11 గంటల మధ్య నిద్రపోయే వారిలో గుండె జబ్బులు తక్కువగా వస్తున్నట్లు గుర్తించారు. ఇక అర్ధరాత్రి తర్వాత నిద్రిపోయే వారిలో 25 శాతం ఎక్కువగా గుండె జబ్బులు వచ్చే అవకాశాలున్నాయ్ని పరిశోధకులు స్పష్టం చేశారు.

మాంసానికి బదులు చేపలు తింటే..

మాంసానికి బదులుగా కేవలం చేపలు మాత్రమే తినేవారు గుండెపోటుకు గురయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని గ్లాస్గో యూనివర్సిటీ ప్రొఫెసర్, అధ్యయన బృంద సభ్యుడు జిల్ పెల్ చెబుతున్నారు. చేపలు ఎక్కువగా తినేవారికి పాలిఅన్‌శాచురేటెడ్ కొవ్వులు శరీరానికి అందుతాయి. ఇవి గుండెజబ్బులను సమర్థంగా ఎదుర్కోగలవని పరిశోధకులు వెల్లడిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Health Tips: మీకు ఎసిడిటీ సమస్య ఉందా..? ఈ చిట్కాలతో అద్భుతమైన ప్రయోజనం..!

Kidney Stones: మూత్రపిండాలలో రాళ్లతో బాధపడేవారు ఈ ఆహారాలకు దూరంగా ఉండండి..!