AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LAW: తండ్రి ఆస్తిపై కుమార్తెకు హక్కు ఉంటుందా.. లా ఏం చెబుతుంది..

రాములయ్య మరణంతో ఆయన కుటుంబంలో కలతలు మొదలయ్యాయి. తనకున్న..

LAW: తండ్రి ఆస్తిపై కుమార్తెకు హక్కు ఉంటుందా.. లా ఏం చెబుతుంది..
law
Srinivas Chekkilla
|

Updated on: Feb 20, 2022 | 6:00 AM

Share

రాములయ్య మరణంతో ఆయన కుటుంబంలో కలతలు మొదలయ్యాయి. తనకున్న ఆస్తి(property) విషయంలో పంపకాలు చేయకుండా రాములయ్య మరణించడంతో ఆయన పిల్లలు ఒకరితో ఒకరు ఘర్షణ పడటం మొదలైంది. ఆయన ఇద్దరు కొడుకులు(son) ఆస్తిని పంచేసుకున్నారు. ఆయన కుమార్తే(daughter )కు ఎటువంటి ఆస్తి వారు ఇవ్వలేదు. రాములయ్య కుమార్తె వైష్ణవి ఈ విషయంలో తన సోదరులతో ఘర్షణ పడింది.

ఈ కథ ఒక్క రాములయ్యకుటుంబానిదే కాదు. దేశంలో లక్షలాది కుటుంబాల్లో ఇలానే జరుగుతూ ఉంటుంది. పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ ప్రకారం ఆస్తి పంపకాల విషయంలో కోర్టుల్లో 15 డిసెంబర్ 2021 వరకూ నాలుగున్నర కోట్ల కేసులు పెండింగ్​లో ఉన్నాయి. వీటిలో ఎక్కువ శాతం భూమి పంపకాలకు సంబంధించినవే ఉన్నాయి. ఈ కేసులు పరిష్కారం కావడానికి సంవత్సరాల సమయం పడుతుంది. ప్రభుత్వ స్థాయిలో సంస్కరణలు ఉన్నప్పటికీ, దశాబ్దాల తరబడి కూడా స్పష్టమైన చిత్రం లేని ఆస్తుల విభజనపై కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఒక కుమార్తెకు తన తండ్రి ఆస్తిలో ఎంత హక్కు ఉంది?, కుమార్తెకు తన తాత ఆస్తిలో వాటా ఉందా?, పెళ్లి తర్వాత కుమార్తె తన హక్కులను పొందగలదా లేదా? కుమార్తె ప్రయోజనాలను పరిరక్షించడానికి హిందూ వారసత్వ చట్టం 1956, 2005లో సవరించారు. ఈ చట్టం ప్రకారం, పూర్వీకుల ఆస్తిలో కుమార్తెలకు సమాన వాటా ఉంటుంది. కూతురు పెళ్లి అయినా, వితంతువు అయినా, అవివాహితైనా లేదా తన భర్తచే విడిచిపెట్టబడినా, ఆమె పుట్టినప్పటి నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తిలో వాటాను పొందుతుంది.

ఇక్కడ షరతు ఏమిటంటే, ఆమె తండ్రి సెప్టెంబరు 9, 2005 వరకు జీవించి ఉంటేనె కుమార్తె పూర్వీకుల ఆస్తిలో వాటా పొందవచ్చు. సెప్టెంబర్ 9, 2005 కంటే ముందు తండ్రి మరణించినట్లయితే, కుమార్తెకు పూర్వీకుల ఆస్తిలో ఎలాంటి వాటా లభించదు. అయితే, తండ్రి స్వయంగా కొనుగోలు చేసిన ఆస్తిని వీలునామా ప్రకారం విభజిస్తారు. 2020లో సుప్రీంకోర్టు మళ్లీ వ్యవస్థను మార్చింది. ఈ రూల్ ను మారుస్తూ స్పష్టత ఇచ్చింది. సెప్టెంబర్ 9, 2005 కంటే ముందు తండ్రి మరణించినా, కుమార్తెకు కూడా తన పూర్వీకుల ఆస్తిపై కొడుకులకు ఉన్న హక్కునే కలిగి ఉంటుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. తండ్రి తన ఆస్తిని సొంతంగా సంపాదించినట్లయితే, అతను తన ఆస్తిని కుమార్తెకు ఇవ్వాలా వద్దా అనేది తండ్రి కోరిక ప్రకారమే జరుగుతుంది. కానీ వీలునామా రాయకుండానే తండ్రి చనిపోతే, కూతురు కూడా ఆ ఆస్తిలో భాగం పంచుకోవచ్చు.

కుమార్తె హక్కులకు సంబంధించి సుప్రీంకోర్టు ఇటీవల కొత్త వ్యవస్థను రూపొందించింది. దీని ప్రకారం, ఉమ్మడి కుటుంబంలో నివసిస్తున్న వ్యక్తి వీలునామా రాయకుండా మరణిస్తే, అతని కుమారులతో పాటు అతని కుమార్తె కూడా అతని ఆస్తికి అర్హులు. ఆస్తి వాటాలో ఆమె తండ్రి సోదరుడి కుమారుల కంటే కుమార్తెకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. హిందూ వారసత్వ చట్టం, 1956 అమలుకు ముందు ఆస్తి పంపిణీకి కూడా ఇటువంటి ఏర్పాటు వర్తిస్తుంది. సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది అనిల్ కర్న్వాల్ చెబుతున్న దాని ప్రకారం కుమార్తె వివాహిత అయినా, వితంతువు అయినా లేదా ఒకవేళ విడాకులు తీసుకున్నా కూడా వీటిలో దేనితోనూ సంబంధం లేకుండా, పూర్వీకుల ఆస్తిపై పూర్తి హక్కు ఉంటుంది. అలాగే కుమార్తె తండ్రి స్వీయ-ఆర్జిత ఆస్తిలో కూడా వాటాను పొందవచ్చు. కాకపోతే ఈ విషయంలో కుమార్తె తండ్రి తన స్వంత ఇష్టానుసారం దానిని ఇవ్వాలనుకుంటే మాత్రమే అది వీలవుతుంది.

తండ్రి తన ఆస్తి వాటాను కుమార్తెకు ఇవ్వకూడదనుకుంటే, ఆమెకు అందులో భాగం లేదు. వీలునామా రాయడానికి ముందే తండ్రి చనిపోతే, అతని ఆస్తిలో కూతురు వాటా పొందవచ్చు. మనం ముందుగా చెప్పుకున్న కథలో రాములయ్య వీలునామా రాయలేదు. అటువంటి పరిస్థితిలో, వైష్ణవికి చట్టబద్ధంగా ఆస్తిలో వాటా లభిస్తుంది.మీరు సమయానికి ఆస్తి పంపిణీకి సంబంధించిన వీలునామా రాసి ఉండటం మంచిది. అందులో ఎవరికి ఎంత వాటా ఇవ్వాలో స్పష్టంగా పేర్కొనండి. కుటుంబ సంఘర్షణలను నివారించడానికి వీలునామాలో కుమార్తె పేరునూ తప్పనిసరిగా చేర్చండి.

Read Also.. SBI Customers: ఎస్బీఐ ఖాతాదారులకు స్పెషల్ ఆఫర్.. వడ్డీ కోల్పోకుండా బెనిఫిట్స్‌ పొందే అవకాశం..