AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Insurance Tax: ఇన్సూరెన్స్ పాలసీలకు పన్ను ఉంటుందా.. ఉంటే ఎంత ఉంటుంది..

ఈ రోజుల్లో జీవిత బీమా పాలసీ ఉండటం అనేది అత్యవసరంగా మారింది. గతంలో ఇన్సూరెన్స్ పై పెద్దగా చర్చ ఉండేది కాదు...

Insurance Tax: ఇన్సూరెన్స్ పాలసీలకు పన్ను ఉంటుందా.. ఉంటే ఎంత ఉంటుంది..
Srinivas Chekkilla
|

Updated on: Feb 20, 2022 | 6:30 AM

Share

ఈ రోజుల్లో జీవిత బీమా పాలసీ ఉండటం అనేది అత్యవసరంగా మారింది. గతంలో ఇన్సూరెన్స్ పై పెద్దగా చర్చ ఉండేది కాదు. కానీ కరోనా మహమ్మారి రాకతో చాలా మంది కొత్తగా ఆరోగ్య బీమా పాలసీలు పొందేందుకు మెుగ్గుచూపుతున్నారు. ఒక వేళ మీ కుటుంబంలో సంపాదించే వ్యక్తి మీరు ఒక్కరే అయితే ఇక బీమా పాలసీ తీసుకునే విషయంలో అసలు ఆలస్యం చేయకండి. ఇన్సూరెన్స్ అనే అంశంపై మాట్లాడాలంటే ముందుగా తెలుసుకోవలసిన విషయాలు ఏమిటంటే మీరు చెల్లించే ప్రిమియం, మెచ్యూరిటీ సమయంలో మెుత్తంపై ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నుల విషయం గురించే.

ఒకవేళ మీరు కనుక బీమా చేయించుకుంటే.. ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 80c కింద మీరు మీ భార్య అదేవిధంగా పిల్లల బీమా పథకాలపై చెల్లించిన ప్రీమియంలపై పన్ను మినహాయింపును పొందవచ్చు. మీరు వ్యక్తిగతంగానైనా లేదా ఉమ్మడి కుటుంబంగా ఉన్నా రాయితీని పొందవచ్చు. కానీ.. పాలసీ కవరేజ్ మెుత్తం చెల్లించే ప్రిమియం కంటే 10 శాతం ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే మీరు మినహాయింపునకు అర్హులవుతారు. అది కూడా ఏప్రిల్ 1, 2012 తరువాత పాలసీని కొని ఉండాలి.

ఏప్రిల్ 1, 2012కు ముందు పాలసీ కొన్నట్లయితే కవరేజ్ ప్రీమియం కంటే అయిదు రెట్లు ఉన్నట్లయితేనే మినహీయింపును పొందగలరు. దీనికి తోడు ఏప్రిల్ 1, 2013 తరువాత తీసుకున్న పాలసీల్లో అంగవైకల్యాలు ఉన్న వారికి సైతం సెక్షన్- 80U కింద ప్రిమియం రాయితీ వర్తింపు లభిస్తోంది. ఇది సెక్షన్ 80DDB కింద అనుమతించిన వ్యాధుల జాబితాలో ఉంది. పైన చెప్పిన రెండు సందర్భాల్లోనూ మీరు చెల్లించే ప్రీమియంలు బీమా ప్రీమియం మొత్తంలో 15 శాతం కంటే ఎక్కువ లేకపోతే.. మీరు సెక్షన్ 80c కింద పన్ను మినహాయింపునకు అర్హులవుతారు.

జీవిత బీమా మెచ్యూరిటీ సమయంలో వచ్చే సొమ్ము మెుత్తం ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్- 10D కింద పన్ను మినహాయింపు వస్తుంది. కానీ దీనికి ఒక షరతు ఉంది. అదేమిటంటే.. ఏప్రిల్ 1, 2012 తర్వాత జారీ చేయబడిన బీమా పాలసీల విషయంలో ప్రిమియం.. బీమా మొత్తంలో 10 శాతం కంటే ఎక్కువగా ఉండకూడదు. దీనితో పాటు ఆ తేదీకి ముందు జారీ చేసిన పాలసీల విషయంలో ప్రిమియం 20 శాతం కంటే ఎక్కువ ఉండకూడదు.

ఇది కాకుండా ఏప్రిల్ 1, 2013 తర్వాత జారీ చేయబడిన పాలసీలు తప్పనిసరిగా సెక్షన్- 80U క్రింద జాబితా ఉన్న అంగవైకల్యాలు, సెక్షన్ 80DDB జాబితాలోని వ్యాధులను కూడా కవర్ చేయాలి. ఈ రెండు సందర్భాల్లో మీరు చెల్లించే ప్రిమియం బీమా చేయబడిన మొత్తంలో 15 శాతం కంటే ఎక్కువ లేకపోతే.. మీరు సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపుకు అర్హులవుతారు.

కీమాన్ బీమా పాలసీ కింద.. మీరు పనిచేసే సంస్థ యాజమాన్యం మీ తరఫున జీవిత బీమా పాలసీకి ప్రిమియం చెల్లిస్తుంది. ఈ సందర్భంలో ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్- 10D కింద మీ సంస్థ చెల్లించిన ప్రిమియం మెుత్తాన్ని మీరు పన్ను రాయితీగా పొందడం కుదరదు. పాలసీదారుడు మరణించిన సందర్భంలో వచ్చే బీమా సొమ్మును అతని నామినీలు తీసుకోవచ్చు. ఈ సొమ్ముకు పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. కీమాన్ బీమా పాలసీకి ఇది వర్తించదు. సెక్షన్- 10D కింద.. బీమా మెుత్తం లక్ష రూపాయలకంటే ఎక్కువగా ఉంటే అప్పుడూ బీమా కంపెనీ.. సదరు మెుత్తానికి ఒక్క శాతం టీడీఎస్ వసూలు చేస్తుంది. బీమా చేయబడిన మొత్తం లక్ష రూపాయలకంటే తక్కువగా ఉంటే.. అప్పుడు TDS విధించరు. అయినా కానీ, బీమా చేసిన మొత్తం పన్ను పరిధిలోకి వస్తుంది.

Read Also.. Aadhaar Card: ఆధార్ కార్డ్‌లో ఫొటో తప్పు పడిందా.. ఆన్‌లైన్‌లో మార్చలేరు.. ఇలా చేయాల్సిందే..?