AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Garlic: వెల్లుల్లి తినడంతో ఆ వ్యాధి అదుపులో ఉంటుంది.. వెల్లడించిన అధ్యయనాలు..

మనం నిత్యం అనేక రకాల వంటకాల్లో ‘వెల్లుల్లి(Garlic)’ని ఎక్కువగా ఉపయోగిస్తుంటాం....

Garlic: వెల్లుల్లి తినడంతో ఆ వ్యాధి అదుపులో ఉంటుంది.. వెల్లడించిన అధ్యయనాలు..
Srinivas Chekkilla
|

Updated on: Feb 21, 2022 | 6:15 AM

Share

మనం నిత్యం అనేక రకాల వంటకాల్లో ‘వెల్లుల్లి(Garlic)’ని ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. ఇది ఆహార పదార్థాలకు చక్కని రుచిని ఇస్తుంది, దీంతోపాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. సాధారణ వెల్లుల్లి కన్నా మొలకెత్తిన వెల్లుల్లిపాయల్లోనే చాలా పోషకాలు ఉంటాయని పరిశోధనలో వెల్లడైంది. వెల్లుల్లి మధుమేహం కోసం పనిచేసే పోషకంగా సంప్రదాయ వైద్యంలో బాగా ప్రాచుర్యం పొందింది. మధుమేహ(sugar) వ్యాధిగ్రస్తులలో ఇటీవలి క్లినికల్ అధ్యయనాలు చక్కెర స్థాయిలను తగ్గించడంలో వెల్లుల్లి చాలా ప్రభావవంతమైనదని తెలుపుతున్నాయి.

సూక్ష్మ విషక్రిమినాశినిగా (యాంటీమైక్రోబయాల్ గా) వెల్లుల్లి యొక్క ప్రభావాన్ని పరీక్షించడానికి అనేక అధ్యయనాలు చేయబడ్డాయి. ఈ అధ్యయనాలు చాలా వరకు వెల్లుల్లిలో శక్తివంతమైన యాంటీమైక్రోబయల్ సమ్మేళనాలు ఉన్నాయని సూచిస్తున్నాయి. కనుక వెల్లుల్లి బ్యాక్టీరియా, ఫంగల్ మరియు వైరల్ కారకాలవల్ల దాపురించే అంటురోగాలకు వ్యతిరేకంగా పోరాడి మనకు ఆరోగ్యం చేకూరుస్తుంది.

మొలకెత్తిన వెల్లుల్లిపాయల్లో సాధారణం కన్నా ఓ మోస్తరు ఎక్కువగానే యాంటీ యాక్సిడెంట్లు ఉంటాయి. ఈ కారణంగా వయస్సు మీద పడడం వల్ల వచ్చే ముడతలు పోతాయి. విటమిన్ సీ వెల్లుల్లిలో ఎక్కువగా ఉంటుంది. దీంతో నోటికి సంబంధించిన వ్యాధులన్నీ కూడా తగ్గిపోతాయి. మొలకెత్తిన వెల్లుల్లిపాయల్ని తింటే రక్త నాళాల్లో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది. రక్త సరఫరా మెరుగు పడి గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. జీర్ణకోశ వ్యాధులకు వెల్లుల్లి చక్కటి ఔషధం.

గమనిక :– అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

Read Also.. Health News: ఆ ట్యాబ్లెట్లు అధికంగా మింగుతున్నారా.. అధ్యయనంలో షాకింగ్‌ నిజాలు..?