AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Capsicum: క్యాప్సికమ్ తింటున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి..

చాలా మంది క్యాప్సికమ్ తినడానికి ఇష్టపడరు. కానీ అది చేసే మేలు తెలిస్తే తినకుండా ఉండలేరు...

Capsicum: క్యాప్సికమ్ తింటున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి..
Srinivas Chekkilla
|

Updated on: Feb 21, 2022 | 6:45 AM

Share

చాలా మంది క్యాప్సికమ్ తినడానికి ఇష్టపడరు. కానీ అది చేసే మేలు తెలిస్తే తినకుండా ఉండలేరు. క్యాప్సికమ్‌లో విటమిన్ ‘ఎ,సి’ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది పచ్చిమిర్చిలా ఘాటుగా కాకుండా, తక్కువ కారంతో రుచిగా ఉంటాయి. వీటిని డైట్‌లో భాగం చేసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. క్యాప్సికమ్‌లో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యానికి అత్యవసరం. క్యాప్సికమ్‌లోని ల్యూటిన్ అనే కెరోటెనాయిడ్ కంటిచూపు మందగించకుండా చూస్తుంది. క్యాప్సికమ్‌లో సీ విటమిన్ కూడా సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్త నాళాలు, చర్మం, ఎముకల దృఢత్వానికి అవసరమైన కొల్లాజెన్ ఉత్పత్తిలో తోడ్పడుతుంది.

ఆకుపచ్చ, పసుపు క్యాప్సికమ్‌లో కన్నా ఎరుపు క్యాప్సికమ్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, వాపు తగ్గించే గుణాలు ఎక్కువ. ఇవి ప్రొస్టేట్, గర్భాశయ, బ్లాడర్, క్లోమ గ్రంథి క్యాన్సర్‌ను నివారిస్తాయి. క్యాప్సికమ్‌లోని ఫినోలిక్స్, ప్లేవోనాయిడ్స్ శరీరంలో ఎలర్జీని తగ్గిస్తాయి. క్యాప్సికమ్‌లోని క్యాప్‌సైనిన్ అనే ఆల్కలాయిడ్ జీవక్రియను ప్రేరేపిస్తుంది. ఇది కొవ్వు కణాల వృద్ధిని అరికడుతుంది. శరీరంలో ఎక్కువ క్యాలరీలు కరిగిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి క్యాప్సికమ్ మంచి డైట్. క్యాప్సికమ్ జుట్టును బలంగా చేస్తుంది.

తలకు రక్తప్రసరణ పెరిగి వెంట్రుకలు పెరగడంలో సాయపడుతుంది. ఎండిన క్యాప్సికమ్‌ను నీళ్లలో వేసి 4-5నిమిషాలు వేడిచేయాలి. చల్లారాక తలకు పట్టించి 12-15 నిమిషాల పాటు ఉండనివ్వాలి. ఎరుపు రంగు క్యాప్సికమ్‌లో లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆకుపచ్చ క్యాప్సికమ్‌లో కొవ్వును తగ్గించే ఫైబర్ ఉంటుంది. వీటిలోని విటమిన్ బి6, ఫోలిక్ ఆమ్లాలు గుండె సంబంధ వ్యాధులకు కారణమయ్యే హోమోసిస్టిన్ అమినో ఆమ్లం ఉత్పత్తిని నియంత్రిస్తుంది.

గమనిక :– అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

హైదరాబాద్‌లో పట్టపగలే దారుణం.. లాయర్‌ను నరికి చంపిన దుండగులు!
హైదరాబాద్‌లో పట్టపగలే దారుణం.. లాయర్‌ను నరికి చంపిన దుండగులు!
క్వైట్ క్విటింగ్ 2.0.. యూనిఫాంలో ఉన్న బర్న్ అవుట్!
క్వైట్ క్విటింగ్ 2.0.. యూనిఫాంలో ఉన్న బర్న్ అవుట్!
సముద్ర తీరంలో ఉచిత వసతి.. పిల్లుల ప్రేమికులకు ఇది ఒక స్వర్గం!
సముద్ర తీరంలో ఉచిత వసతి.. పిల్లుల ప్రేమికులకు ఇది ఒక స్వర్గం!
అడవిలోనే గంజాయి ఫ్యాక్టరీ.. పోలీసులకే షాకిచ్చిన లిక్విడ్ గ్యాంగ్
అడవిలోనే గంజాయి ఫ్యాక్టరీ.. పోలీసులకే షాకిచ్చిన లిక్విడ్ గ్యాంగ్
ఆయుష్మాన్‌ కార్డ్‌తో ఎన్నిసార్లు రూ.5 లక్షల వైద్యం పొందవచ్చు?
ఆయుష్మాన్‌ కార్డ్‌తో ఎన్నిసార్లు రూ.5 లక్షల వైద్యం పొందవచ్చు?
ఊబకాయంపై వార్ ప్రకటించాల్సిన టైం వచ్చేసింది!
ఊబకాయంపై వార్ ప్రకటించాల్సిన టైం వచ్చేసింది!
ఆ సినిమా బాగుందని అన్నారు.. కానీ ఇంటర్వెల్‏కే దండం పెట్టి వచ్చేసా
ఆ సినిమా బాగుందని అన్నారు.. కానీ ఇంటర్వెల్‏కే దండం పెట్టి వచ్చేసా
జామకాయ పచ్చడి ఇలా చేసి తింటే.. నాన్ వెజ్ కూరలు కూడా సరిపోవు!
జామకాయ పచ్చడి ఇలా చేసి తింటే.. నాన్ వెజ్ కూరలు కూడా సరిపోవు!
260 మందిని బలిగొన్న దుర్ఘటన మరవకముందే.. పెద్ద తప్పు!
260 మందిని బలిగొన్న దుర్ఘటన మరవకముందే.. పెద్ద తప్పు!
పండగలాంటి వార్త..! శివరాత్రి మరుసటి రోజు హాలీడే.. ఉత్తర్వులు జారీ
పండగలాంటి వార్త..! శివరాత్రి మరుసటి రోజు హాలీడే.. ఉత్తర్వులు జారీ