Cricket News: సచిన్, రోహిత్ సరసన మరొక ప్లేయర్.. అరంగేట్రంతోనే అద్భుతాలు..
Cricket News: సచిన్, రోహిత్ సరసన మరొక ప్లేయర్ చేరిపోయాడు. అరంగేట్రంతోనే అద్భుతాలు సృష్టిస్తున్నాడు. అతడు ఎవరో కాదు భారత్‌కి అండర్ 19 వరల్డ్ కప్ అందించిన
Cricket News: సచిన్, రోహిత్ సరసన మరొక ప్లేయర్ చేరిపోయాడు. అరంగేట్రంతోనే అద్భుతాలు సృష్టిస్తున్నాడు. అతడు ఎవరో కాదు భారత్‌కి అండర్ 19 వరల్డ్ కప్ అందించిన యశ్‌ధుల్. ఫస్ట్‌క్లాస్ కెరీర్‌ను సెంచరీతో ఘనంగా ప్రారంభించాడు. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన రంజీ టోర్ని రెండేళ్ల తర్వాత ప్రారంభమైంది. అయితే అరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీ చేసిన క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, కెప్టెన్ రోహిత్ శర్మ సరసన యశ్‌ధుల్ చోటు సంపాదించడం విశేషం.
బరస్పరాలోని ఏసీఏ మైదానంలో ఢిల్లీ, తమిళనాడు జట్ల మధ్య మొదటి మ్యాచ్ ఆరంభం అయింది. టాస్ గెలిచిన తమిళనాడు ఫీల్డింగ్ ఎంచుకోవడంతో ఢిల్లీ బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనింగ్‌కు దిగిన ఢిల్లీ బ్యాటర్ యశ్ ధుల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. మొదటి రోజు లంచ్ తర్వాత 136 బంతుల్లో సెంచరీ చేశాడు. మొత్తంగా 150 బంతులు ఎదుర్కొన్న యశ్ ధుల్.. 113 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. అతడి ఇన్నింగ్స్‌లో 18 ఫోర్లు ఉన్నాయి. 57 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన యశ్ ధుల్.. 136 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. 97 పరుగుల వద్ద యశ్ ఔట్ అయినా అది నో బాల్ కావడంతో బతికిపోయాడు.
టీమిండియాకు సారథ్యం వహించిన చివరి ఐదుగురు అండర్-19 కెప్టెన్లలో నలుగురు ఫస్ట్-క్లాస్ అరంగేట్రంలోనే సెంచరీ చేయడం విశేషం. రంజీ ట్రోఫీ అరంగేట్ర మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోను సెంచరీలు సాధించిన మూడో ఆటగాడిగా యష్‌ధుల్ నిలిచాడు. అంతకు ముందు గుజరాత్ బ్యాటర్ నారీ కాంట్రాక్టర్ ఈ ఫీట్ సాధించిన మొదటి వ్యక్తి కాగా, మహారాష్ట్ర బ్యాటర్ విరాగ్ అవతే రెండో ఆటగాడిగా ఉన్నాడు. మొత్తానికి యశ్‌ధుల్ తన ఫామ్‌ని రంజీలలో కొనసాగిస్తున్నాడు.
FIFTY on First-Class debut! ? ?
Yash Dhull – India’s #U19CWC-winning captain – begins his #RanjiTrophy journey in style. ? ? @Paytm #DELvTN
Follow the match ▶️ https://t.co/ZIohzqOWKi pic.twitter.com/mrbYBHNrBL
— BCCI Domestic (@BCCIdomestic) February 17, 2022