AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Desi Ghee: శీతాకాలంలో వేధించే ఈ ఆరోగ్య సమస్యలకి నెయ్యితో చికిత్స.. అవేంటంటే..?

Desi Ghee: నెయ్యి తినడంపై చాలా సందేహాలున్నాయి. కొంతమంది నెయ్యి తీసుకుంటే బరువు పెరుగుతారని భయపడుతారు. ఆయుర్వేదం ప్రకారం ఇందులో నిజం లేదు.

Desi Ghee: శీతాకాలంలో వేధించే ఈ ఆరోగ్య సమస్యలకి నెయ్యితో చికిత్స.. అవేంటంటే..?
Desi Ghee
uppula Raju
|

Updated on: Feb 20, 2022 | 3:52 PM

Share

Desi Ghee: నెయ్యి తినడంపై చాలా సందేహాలున్నాయి. కొంతమంది నెయ్యి తీసుకుంటే బరువు పెరుగుతారని భయపడుతారు. ఆయుర్వేదం ప్రకారం ఇందులో నిజం లేదు. నెయ్యిలో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. ఇవి ఆరోగ్య సమస్యలని పరిష్కరించడంలో సహాయపడుతాయి. నెయ్యిలో హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. అవి దేహంలో పేరుకున్న చెడు కొవ్వును హ‌రించి వేస్తాయి. నెయ్యిలో అమినో యాసిడ్స్ ఉంటాయి. అవి ఫ్యాట్ సెల్స్‌ను క్షీణింప‌చేస్తాయి. మార్కెట్‌లో రెండు ర‌కాల నెయ్యిలు అందుబాటులో దొరుకుతాయి. ఒక‌టి ఆవు నెయ్యి. రెండోది గేదె నెయ్యి. ఇందులో ఆవు నెయ్యి మాత్రమే ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు.

నెయ్యితో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. వింటర్‌ సీజన్‌లో విభిన్న రకాల వైరస్‌లను అడ్డుకుని ఫ్లూ, దగ్గు, జలుబుల నుంచి రక్షిస్తుంది. నెయ్యిలో ఉండే మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్‌ను లివ‌ర్ త్వర‌గా గ్రహిస్తుంది. త‌ర్వగా బ‌ర్న్ చేసి శ‌క్తిగా మారుస్తుంది. రోజువారీ ఆహారంలో తీసుకునే కార్బొహైడ్రేట్లతో పోలిస్తే నెయ్యి మంచిదంటారు. ఆయుర్వేదం ప్రకారం.. దేహంలోని అంతర్గత ఉష్ణాన్ని క్రమబద్ధీకరిస్తుంది. అందుకే దీనిని చలికాలపు వంటకాలలో ఎక్కువగా వాడుతారు.

సంక్రాతి పండుగకి చేసే పిండివంటలు గారెలు, బూరెలు, అరిసెల తయారీలో నెయ్యిని వాడుతారు. దేహంలో కండ‌రాల మ‌ధ్య క‌నెక్షన్ టిష్యూలుంటాయి. నెయ్యి తినేవారిలో ఈ టిష్యూ మృదువుగా ఉండి దేహం క‌ద‌లిక‌లు సులువుగా ఉంటాయి. యోగ చేసేవాళ్లు క‌చ్చితంగా నెయ్యి తింటారు. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ నెయ్యిలో ఎక్కువగా ఉంటాయి. తద్వారా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరం కొవ్వును గ్రహించడంలో నెయ్యి సహకరిస్తుంది. బరువు తగ్గడానికి ప్రయత్నించేవారు ప్రతిరోజు నెయ్యి తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.

Hyderabad: నగరంలో ఇకపై ఆ ఆటోలకి అనుమతి లేదు.. కారణం ఏంటో తెలుసా..?

Bheemla Nayak : బుక్ మై షో కు షాక్ ఇచ్చిన భీమ్లానాయక్ డిస్టిబ్యూటర్స్.. కారణం ఇదే.

Pomegranate peel: తొక్కే కదా అని తీసిపారేయకండి.. దానితో లెక్కలేనన్ని ప్రయోజనాలు