IND vs WI 3rd T20 Highlights: మూడో టీ20లో భారత్ ఘన విజయం.. రాణించిన సూర్యకుమార్ యాదవ్..
India vs West Indies 3rd T20 Highlights: భారత్, వెస్టిండిస్‌ల మధ్య జరిగిన మూడో టీ20లో రోహిత్ సేన ఘనవిజయం సాధించింది. దీంతో విండీస్ టీంను రెండోసారి వైట్ వాష్ చేసింది.
IND vs WI 3rd T20 Highlights: కోల్‌కత్తాలో వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. 17 పరుగులు తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లకు ఐదు వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ 31 బంతుల్లో 65 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఇందులో ఏడు సిక్స్‌లు, ఒక ఫోర్ ఉంది. అనంరతం ఛేజింగ్ చేసిన వెస్టిండీస్ టీం నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 167 పరుగులు మాత్రమే చేసింది. దీంతో వరుసగా మూడో టీ20లోనూ ఓటమి తప్పలేదు.
భారత్, వెస్టిండిస్‌ల మధ్య మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. భారత్, వెస్టిండిస్‌ల మధ్య మూడో టీ20 మ్యాచ్‌లో విజయంపై టీమిండియా నమ్మకంతో ఉంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన రెండు మ్యాచ్‌ల్లో ఇప్పటికే విజయం సాధించిన టీమిండియా.. సిరీస్‌ను వైట్ వాష్ చేసేందుకు సిద్ధమైంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరగనున్న ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు సిద్ధమయ్యాయి.
ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే రోహిత్ శర్మ కెప్టెన్‌గా వరుసగా మూడో సిరీస్ వైట్‌వాష్ అవుతుంది. రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించిన న్యూజిలాండ్ మ్యాచ్‌లో 3-0తో టీ 20 సిరీస్, ఇటీవల వెస్టిండిస్‌తో 3-0తో వన్డే సిరీస్‌ను వైట్‌వాష్ చేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా జరగనున్న టీ20లో గెలిస్తే ఈ సిరీస్‌ను కూడా వైట్‌వాస్ చేసి హ్యాట్రిక్‌తో అరుదైన రికార్డును సొంతం చేసుకోవాలని చూస్తున్నాడు రోహిత్.
ఇదిలా ఉంటే ఫైనల్ మ్యాచ్‌లో పలు మార్పలు చేర్పులు చేయనున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్‌ను తుది జట్టులోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కోహ్లీ, పంత్ విశ్రాంతి తీసుకోవడంతో.. రోహిత్, రుతురాజ్‌లు ఓపెనర్లు దిగే అవకాశాలు ఉన్నాయి. కోహ్లీ స్థానంలో శ్రేయాస్ ఆడనుండగా.. ఇషాన్ కిషన్ వికెట్ కీపర్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. బౌలింగ్ విభాగంలో సిరాజ్, అవేశ్ ఖాన్‌ను ఛాన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
LIVE Cricket Score & Updates
-
భారత్ విజయం
కోల్‌కత్తాలో వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. 17 పరుగులు తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 3- తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లకు ఐదు వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. సూర్యాకుమార్ యాదవ్ 31 బంతుల్లో 65 పరుగులే చేశాడు. ఇందులో ఏడు సిక్స్‌లు, ఒక ఫోర్ ఉంది.
-
తొమ్మిదో వికెట్ కోల్పోయిన వెస్టిండీస్
వెస్టిండీస్ 9వ వికెట్ కోల్పోయింది. తొమ్మిదో వికెట్ డ్రక్స్ వెనుదిరిగాడు.
-
-
ఎనిమిదో వికెట్ కోల్పోయిన వెస్టిండీస్
కోల్‌కత్తాలో జరుగుతున్న మూడ టీ20లో వెస్టిండీస్ 8వ వికెట్ కోల్పోయింది. షేఫర్డ్ హర్షల్ పటేల్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు.
-
ఏడో వికెట్ కోల్పోయిన వెస్టిండీస్
వెస్టిండీస్ ఏడో వికెట్ కోల్పోయింది. ఏడో వికెట్‌గా నికోలస్ పూరన్ పెవిలియన్ చేరాడు. అతను 47 బంతుల్లో 61 పరుగులు చేశాడు.
-
ఆరో వికెట్ కోల్పయిన వెస్టిండీస్.. చెసి ఔట్..
మూడో టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్ ఓటమి దిశగా పయణిస్తుంది. ఆ జట్టు ఇప్పటికే ఆరు వికెట్లు కోల్పోయింది. హర్షల్ పటేల్ బౌలింగ్‌లో చెస్ ఔటయ్యాడు.
-
-
ఐదో వికెట్ కోల్పోయిన వెస్టిండీస్..
కోల్‌కత్తాలో భారత్‌తో జరుగుతున్న మూడో ట్వీ్20లో వెస్టిండీస్ ఐదో వికెట్ కోల్పోయింది. హోల్డర్.. వెంకటేశ్ అయ్యర్ బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
-
నాలుగో వికెట్ కోల్పోయిన వెస్టిండీస్
కోల్‌కత్తాలో జరుగుతున్న మూడో వన్డేలో వెస్టిండీస్ నాలుగో వికెట్ కోల్పోయింది. రవి బిష్టోయ్ బౌలింగ్‌లో పొలార్డ్.. వెంకటేశ్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
-
మూడో వికెట్ కోల్పోయిన వెస్టిండిస్..
వెస్టిండిస్ మూడో వికెట్ కోల్పోయింది. 14 బంతుల్లో 25 పరగులు చేసి దూకుడుగా ఆడుతోన్న రోమన్ పావెల్ అవుట్ అయ్యాడు. హర్షల్ పటేల్ బౌలింగ్‌లో థాకూర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు.
-
రెండో వికెట్ కోల్పోయిన వెస్టిండిస్.. ఈసారి ఎవరంటే..
టీమిండియా ఇచ్చిన 185 లక్ష్యాన్ని చేధించే క్రమంలో వెస్టిండిస్ తడబడుతోంది. కేవలం 26 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. షై హోప్ పెవిలియన్ బాట పట్టాడు. చాహర్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చి అవటయ్యాడు.
-
వెస్టిండిస్‌కు ఆదిలోనే గట్టి దెబ్బ..
వెస్టిండిస్‌కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. తొలి ఓవర్‌లోనే వికెట్ కోల్పోయింది. కైల్ మేయర్స్.. దీపక్ చాహర్ బౌలింగ్‌లో, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
-
టీమిండియా భారీ స్కోర్..
మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోర్ సాదించింది. వెస్టిండిస్ ముందు 185 పరుగుల భారీ లక్ష్యాన్ని ముందుంచింది. సూర్యకుమార్ అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టు స్కోరు దూసుకుపోయింది. కేవలం 31 బంతుల్లో 65 పరుగులు సాధించాడు. ఇషాన్ కిషన్ (34), వెంకటేష్ అయ్యార్ (35) పరుగులు సాధించాడు. సూర్యకుమార్, వెంకటేష్ అయ్యర్‌ల భాగస్వామ్యం టీమిండియా జట్టు స్కోరు దూసుకుపోయేలా చేసింది. మరి ఈ లక్ష్యాన్ని వెస్టిండిస్ చేధిస్తుందో లేదో చూడాలి.
-
హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న సూర్య కుమార్..
సూర్య కుమార్ యాదవ్ దంచి కొడుతున్నాడు. కేవలం 27 బంతుల్లోనే 52 పరుగులు సాధించాడు. వీటిలో ఒక ఫోర్, 5 సిక్స్‌లు ఉండడం విశేషం.
-
50 పరుగుల భాగస్వామ్యం పూర్తి..
టీమిండియా స్కోర్ దూసుకుపోతోంది. వెంకటేష్ అయ్యర్, సూర్యకుమార్ దంచి కొడుతున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరి భాగస్వామ్యం 50 పరుగుల దాటేసింది. కేవలం 29 బంతుల్లో 51 పరుగులు సాధించారు. ప్రస్తుతం సూర్యకుమార్ (45), వెంకటేష్ (26) పరుగులతో కొనసాగుతున్నారు.
-
దంచి కొడుతోన్న టీమిండియా బ్యాట్స్‌మెన్..
టీమిండియా స్కోర్ దూసుకుపోతోంది. సుర్యకుమార్ యాదవ్ దంచి కొడుతున్నాడు. కేవలం 21 పరుగుల్లో 36, వెంకటేశ్ అయ్యార్ 12 బంతుల్లో 20 పరుగులతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం టీమిండియా స్కోర్ 4 వికెట్ల నష్టానికి 135 పరుగుల వద్ద కొనసాగుతోంది.
-
మరో బిగ్ వికెట్ కోల్పోయిన టీమిండియా..
టీమిండియా మరో బిగ్ వికెట్ కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. డొమినిక్ డ్రెక్స్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన రోహిత్ (07) బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం టీమిండియా 14 ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 94 పరగుల వద్ద కొనసాగుతోంది.
-
మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా..
దూకుడుగా ఆడుతోన్న ఇషాన్ కిషన్‌ను రోస్టన్ ఛేజ్ పెవిలియన్ బాట పట్టించాడు. 31 బంతుల్లో 34 పరుగులతో దూసుకుపోతున్న ఇషాన్, రోస్టన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. టీమిండియా ప్రస్తుతం మూడు వికెట్ల నష్టానికి 66 పరగుల వద్ద కొనసాగుతోంది.
-
రెండో వికెట్ గాన్..
టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. దూకుడుగా ఆడుతూ జట్టు స్కోర్‌ను పరుగులు పెట్టించిన శ్రేయస్ అయ్యర్ 25 పరుగుల వద్ద అవుటయ్యాడు. వాల్ష్ బౌలింగ్‌లో హోల్డర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. ప్రస్తుతం టీమిండియా 9 ఓవర్లు ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 64 పరుగుల వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం ఇషాన్ కిషాన్ (33), రోహిత్ శర్మ (0) పరుగుల వద్ద కొనసాగుతున్నారు
-
50 మార్కు దాటేసిన టీమిండియా..
మూడో టీ 20 ఆరంభంలోనే రుతురాజ్ గ్వైక్వాడ్ రూపంలో తొలి వికెట్ కోల్పోయినా ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ జట్టు స్కోరును పరుగుల పెట్టిస్తున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా 50 పరుగుల మార్కును దాటేసింది. ఒక్క వికెట్ నష్టానికి 7 ఓవర్లలో టీమిండియా 51 పరుగులు సాధించింది.
-
తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా..
టీమిండియాకు ఆదిలోన ఎదురు దెబ్బ తగిలింది. రుతురాజ్ గ్వైక్వాడ్ వెనుతిరిగాడు. హోల్డర్ బౌలింగ్‌లో షాట్‌కు ప్రయత్నించిన రుతురాజ్, కైల్ మేయర్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. భారత్ స్కోర్ ప్రస్తుతం మూడు ఓవర్లు ముగిసే సమయానికి 1 వికెట్ నష్టంతో 15 పరుగుల వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం క్రీజులో ఇషాన్ కిషన్ (05), శ్రేయస్ అయ్యర్ (04) పరుగులతో కొనసాగుతున్నారు.
-
వెస్టిండిస్ ప్లేయర్లు..
కీరన్ పొలార్డ్ (కెప్టెన్), షై హోప్, కైల్ మేయర్స్, నికోలస్ పూరన్, రోమన్ పొవెల్, జేసన్ హోల్డర్, డొమినిక్ డ్రెక్స్, రొమారియో షెఫర్డ్, రోస్టన్ ఛేజ్, ఫాబియన్ అలెన్, వాల్ష్.
-
టీమిండియా జట్టు..
రోహిత్ శర్మ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, వెంకటేశ్ అయ్యర్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, హర్షల్ పటేల్, రవి బిష్ణోయ్, అవేశ్‌ఖాన్.
-
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండిస్..
టీమిండియా, వెస్టిండీస్‌ల మధ్య మూడో టీ20 మ్యాచ్‌లో భాగంగా వెస్టిండిస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది.
Published On - Feb 20,2022 6:38 PM