Kajal Aggarwal: ఇన్‌స్టాగ్రామ్‌లో టాలీవుడ్‌ చందమామ కొత్త రికార్డు.. త్రో బ్యాక్ ఫొటోతో ఫ్యాన్స్ కు థ్యాంక్స్ చెప్పిన కాజల్..

టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) త్వరలో తల్లిగా ప్రమోషన్‌ పొందనుంది. భర్త గౌతమ్‌ కిచ్లూతో కలిసి ఓ బిడ్డను తన జీవితంలోకి ఆహ్వానించేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తోంది.

Kajal Aggarwal: ఇన్‌స్టాగ్రామ్‌లో టాలీవుడ్‌ చందమామ కొత్త రికార్డు..  త్రో బ్యాక్ ఫొటోతో ఫ్యాన్స్ కు థ్యాంక్స్ చెప్పిన కాజల్..
Kajal Aggarwal
Follow us
Basha Shek

|

Updated on: Feb 20, 2022 | 2:42 PM

టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) త్వరలో తల్లిగా ప్రమోషన్‌ పొందనుంది. భర్త గౌతమ్‌ కిచ్లూతో కలిసి ఓ బిడ్డను తన జీవితంలోకి ఆహ్వానించేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తోంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న ఆమె సోషల్‌ మీడియా (SocialMedia) ద్వారా అభిమానులతో టచ్‌లో ఉంటోంది. తన బేబీ బంప్‌ ఫొటోలు, వీడియోలను ఫ్యాన్స్‌ తో షేర్‌ చేసుకుంటోంది. ఇవి నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఇదిలా ఉంటే కాజల్ అగర్వాల్‌ సోషల్ మీడియాలో సరికొత్త రికార్డు ను క్రియేట్ చేసింది. తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ఫాలోవర్స్ సంఖ్య ఏకంగా 21 మిలియన్స్ కు చేరుకుంది. ఈ సందర్భంగా కాజల్ తన ఖాతాలో త్రోబ్యాక్ ఫొటోలు షేర్ చేసింది. ‘నా ఇన్ స్టా ఫ్యామిలీకి 21 మిలియన్స్ ప్రేమని అందించినందుకు ధన్యవాదాలు. మీకు 21 మిలియన్ రెట్ల ప్రేమని అందిస్తున్నాను’ అంటూ రాసుకొచ్చిందీ చందమామ. ఈ ఫొటోలో రెడ్ లెహెంగాపై మ్యాచింగ్ చోళీని ధరించి ఎంతో అందంగా కనిపిస్తోంది కాజల్‌.

కాగా కొద్దిరోజుల క్రితం బాడీ షేమింగ్‌ కారణంగా వార్తల్లో నిలిచింది. తన బేబీబంప్‌ ఫొటోలపై నెగెటివ్‌ కామెంట్లు చేసిన వారికి తగిన శైలిలో సమాధానం చెప్పిందీ అందాల తార. సోషల్ మీడియా వేదికగా ఆమె షేర్‌ చేసిన పోస్ట్ బాడీ బాడీ షేమర్స్ అందరికీ చెంపపెట్టుగా మారింది. కాజల్‌ ఆన్సర్‌కు సమంత, మంచులక్ష్మీ, రాశీఖన్నా, హన్సిక తదితరులు మద్దతుగా నిలిచారు. కాగా మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్ తో కలిసి కాజల్‌ నటించిన ఆచార్య త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అదేవిధంగా మలయాళ సూపర్‌ స్టార్‌ దుల్కర్‌ సల్మాన్ నటించిన ‘హే సినామిక’ కూడా రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ప్రముఖ కొరియోగ్రాఫర్‌ బృందా మాస్టర్‌ తెరకెక్కించిన ఈ సినిమాలో అదితీ రావు హైదరీ మరో హీరోయిన్‌ గా నటిస్తోంది. ప్రస్తుతం ఆమె గర్భంతో ఉండడంతో కొత్త సినిమాలు ఒప్పుకునేందుకు మరింత సమయం పట్టొచ్చు. కాగా టాలీవుడ్‌ లో సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ గా ఉండే తారాల్లో కాజల్‌ కూడా ఒకరు. నిత్యం తన గ్లామరస్‌, ఫ్యాషనబుల్‌ ఫొటోలను అందులో షేర్‌ చేస్తుంటుంది. ఈక్రమంలోనే ఆమె ఫాలోవర్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

Also Read:AP Movie Ticket Issues: టాలీవుడ్‌కు గుడ్ న్యూస్ చెప్పనున్న ఏపీ సర్కార్.. ప్రేక్షకులకు, చిత్రపరిశ్రమకు ఆమోదయోగ్యంగా నిర్ణయం!

టార్గెట్ 2024.. వేడెక్కుతున్న ఢిల్లీ రాజకీయం.. సోనియా ఆధ్వర్యంలో మరో కీలక భేటీ..!

CM KCR : ముంబై చేరుకున్న సీఎం కేసీఆర్‌.. మరికాసేపట్లో ఉద్దవ్‌ థాకరేతో కీలక భేటీ..