CM KCR : ముంబై చేరుకున్న సీఎం కేసీఆర్.. మరికాసేపట్లో ఉద్దవ్ థాకరేతో కీలక భేటీ..
CM KCR Mumbai Tour: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై యుద్ధం (Anti-BJP front) లో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఇవాళ మొదటి అడుగు వేయనున్నారు
CM KCR Mumbai Tour: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై యుద్ధం (Anti-BJP front) లో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఇవాళ మొదటి అడుగు వేయనున్నారు. ఇప్పటికే ముంబై చేరుకున్న ఆయన మరి కాసేపట్లో శివసేన అధినేత, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేతో సమావేశం కానున్నారు. ఈ భేటీ ముగిశాక ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను కూడా కేసీఆర్ కలవనున్నారు. ముఖ్యమంత్రి వెంట ఎమ్మెల్సీ కవిత, ఎంపీలు సంతోష్, రంజిత్ రెడ్డి, బి.బి. పాటిల్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, శ్రవణ్ కుమార్ ఉన్నారు. ముంబై పర్యటనలో భాగంగా కేంద్రంలోని బీజేపీ (BJP) పై పోరాటం కొనసాగించేందుకు థాకరే, పవార్‌తో చర్చలు జరపనున్నారు కేసీఆర్. అదేవిధంగా గవర్నర్ల దూకుడు వ్యవహారంపై కూడాఈ భేటీలో చర్చించనున్నారు. సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా ముంబైలో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దేశ్ కీ నేత అంటూ నినాదాలతో ..కేసీఆర్‌కు మద్దతిచ్చే ప్రాంతీయ పార్టీల అధినేతలు, సీఎంల ఫోటోలతో భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు.
కాగా.. గత కొన్ని రోజుల నుంచి సీఎం కేసీఆర్ కేంద్రంలోని బీజేపీని, ప్రధాని మోడీని లక్ష్యంగా చేసుకోని విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడు సీఎంలతో, మాజీ ప్రధాని దేవెగౌడతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈక్రమంలో ముంబై పర్యటన ముగిసిన తర్వాత కేసీఆర్ కర్ణాటక వెళ్లనున్నారని సమాచారం. అక్కడ మాజీ ప్రధాని దేవెగౌడతో భేటీ కానున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా ఢిల్లీలో మమతా బెనర్జీ నిర్వహించనున్న సమావేశానికి కూడా కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
Also Read:Twins Village: దేశంలోనే అత్యధిక సంఖ్యలో కవలలు పుట్టే గ్రామం.. ఇక్కడ 400 జతల కవల పిల్లలున్నారు
Sitara Gattamaneni: సీతూ పాప స్టెప్పులకు మహేష్ ఫిదా.. కళావతి పాటకు అదరగొట్టిన సితార..