Governor Protocol: మేడారంలో ప్రొటోకాల్‌ ఉల్లంఘన.. గవర్నర్‌కు స్వాగతం, వీడ్కోలు పలికేందుకు రాని అధికారులు..

మేడారంలో ప్రొటోకాల్‌ ఉల్లంఘన వివాదాన్ని రేపుతోంది. నిన్న మేడారంలో సమ్మక్క సారలమ్మ దర్శనానికి వెళ్లారు గవర్నర్‌ తమిళిసై. గవర్నర్‌కు స్వాగతం, వీడ్కోలు పలికేందుకు ములుగు కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య, ఎస్పీ సంగ్రామ్‌ సింగ్‌ పాటిల్‌ రాలేదు.

Governor Protocol: మేడారంలో ప్రొటోకాల్‌ ఉల్లంఘన.. గవర్నర్‌కు స్వాగతం, వీడ్కోలు పలికేందుకు రాని అధికారులు..
Protocol
Follow us
Sanjay Kasula

|

Updated on: Feb 20, 2022 | 1:49 PM

మేడారంలో (Medaram jatara) ప్రొటోకాల్‌ (Protocol) ఉల్లంఘన వివాదాన్ని రేపుతోంది. నిన్న మేడారంలో సమ్మక్క సారలమ్మ దర్శనానికి వెళ్లారు గవర్నర్‌ తమిళిసై. గవర్నర్‌కు స్వాగతం, వీడ్కోలు పలికేందుకు ములుగు కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య, ఎస్పీ సంగ్రామ్‌ సింగ్‌ పాటిల్‌ రాలేదు. గవర్నర్‌ ఉన్నంత సేపు అధికారులు కనిపించలేదు. మంత్రులు కూడా ఆమె పర్యటనలో కనిపించలేదు. గిరిజన ప్రాంత అభివృద్దిపై గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలు ఉంటాయి. అయినా కలెక్టర్‌, ఎస్సీ పట్టించుకోలేదు. దీంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గవర్నర్ తమిళిసై. ప్రోటోకాల్ పాటించని అధికారులపై కఠిన చర్యలు తీసుకునేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్.రాష్ట్ర తొలి పౌరురాలికి ఇంత అవమానమా.. గవర్నర్ కు ఇచ్చే మర్యాద ఇదేనా..? మహిళ అని చూడకుండా అవమానిస్తారా..? అంటూ మండిపడ్డారు. కోట్లాదిమంది ప్రజలు సందర్శించే మేడారం జాతరకు వెళ్లకుండా గిరిజనులను సీఎం కేసీఆర్ అవమానించారని మండిపడ్డారు బండి సంజయ్. తక్షణమే రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రోటోకాల్ పాటించని అధికారులపై కఠిన చర్యలు తీసుకునేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు బండి సంజయ్.

తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలను గౌరవించకపోగా.. గవర్నర్ వెళ్తే రిసీవ్ చేసుకోలేని కుసంస్కారానికి నిదర్శనమన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క కూడా ఈ ఘటనను తప్పుబట్టారు. మహిళా గవర్నర్‌ను అవమానించారు. మంత్రులు, అధికారులు గవర్నర్‌కు స్వాగతం పలుకకపోవడం దురదుష్టకరమన్నారు.

అయితే, హెలికాప్టర్‌లో కాకుండా వరంగల్ మీదుగా రోడ్డు మార్గాన ములుగు జిల్లాకు చేరుకున్న గవర్నర్ తమిళిసైకి స్థానిక ఎమ్మెల్యే సీతక్క స్వాగతం పలికారు.. కానీ, మంత్రులు లేకపోవడంతో ప్రొటోకాల్‌ రగడ మొదలైంది. వన దేవతలు సమ్మక్క సారలమ్మలను అతి పెద్ద గిరిజన జాతర మేడారంలో దర్శించుకుని.. మొక్కులు చెల్లించుకోవడం సంతోషంగా ఉందన్నారు.. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తికి ఈ అతి గొప్ప ఆదివాసీ జాతర ఆదర్శంగా నిలుస్తుందని వెల్లడించారు.. తెలంగాణ ప్రజలంతా ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని వనదేవతలను కోరుకున్నట్టు తెలిపారు.

ఇవి కూడా చదవండి: UP-Punjab Election 2022 Voting Live: ఉత్తర ప్రదేశ్, పంజాబ్‌ల్లో జరుగుతున్న ఎన్నికల పోలింగ్ అప్‌డేట్ కోసం ఇక్కడ చూడండి..

LAW: తండ్రి ఆస్తిపై కుమార్తెకు హక్కు ఉంటుందా.. లా ఏం చెబుతుంది..