ET Teaser: ”నాతో ఉన్నవాళ్లు ఎప్పుడు భయపడకూడదు”.. ఆకట్టుకుంటున్న సూర్య ఈటి టీజర్..

వర్సటైల్ యాక్టర్ సూర్య సినిమాలు తెలుగులోనూ మంచి విజయాలను సాధించిన విషయం తెలిసిందే. సూర్య నటించిన ప్రతి సినిమా తెలుగులోనూ డబ్ అవుతూవుంటాయి.

ET Teaser: ''నాతో ఉన్నవాళ్లు ఎప్పుడు భయపడకూడదు''.. ఆకట్టుకుంటున్న సూర్య ఈటి టీజర్..
Suriya
Follow us

|

Updated on: Feb 20, 2022 | 3:05 PM

ET Teaser: వర్సటైల్ యాక్టర్ సూర్య సినిమాలు తెలుగులోనూ మంచి విజయాలను సాధించిన విషయం తెలిసిందే. సూర్య నటించిన ప్రతి సినిమా తెలుగులోనూ డబ్ అవుతూ ఇక్కడి ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటున్నాయి. చాలా కాలంగా సరైన హిట్ లేక సతమతమైన సూర్య ఓటీటీ వేదికగా రెండు భారీ విజయాలను అందుకున్నాడు. ఈ సుధకొంగరు దర్శకత్వంలో తెరకెక్కిన ఆకాశం నీ హద్దురా సినిమా ఓటీటీ వేదికగా విడుదలై అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఆ సినిమా తర్వాత సూర్య హీరోగా నటించిన జై భీమ్ సినిమా కూడా ఓటీటీలోనే రిలీజ్ అయ్యింది. ఈ మూవీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ రెండు సినిమాల విజయం తో సూర్య తిరిగిఫామ్ లోకి వచ్చారు. ఇప్పుడు ఇదే ఉత్సాహంతో.. ఆయన ఈటి అనే సినిమా చేస్తున్నారు.  సూర్య హీరోగా పాండురాజ్ డైరెక్ట్ చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ఈటి. డిఫరెంట్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో విడుదలకానుంది. మార్చి 10న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా ఈటీ తెలుగు టీజర్ ను రానా దగ్గుబాటి రిలీజ్ చేశారు.

ఒక్క నిమిషం ఏడు సెకండ్ల నిడివిగల ఈ టీజర్ మొత్తం యాక్షన్ సన్నివేశాలతో నింపేశారు. హీరోయిన్, విలన్ లను ఒక్కో ఫ్రేమ్ లో టీజర్ లో చూపించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సూర్య మాస్ అవతార్ ను ఎలివేట్ చేశారు. ఓవరాల్ గా టీజర్ తో అంచనాలు పెంచేశారు మేకర్స్. . డి ఇమాన్ సంగీతం, ఆర్ రత్నవేలు సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి మేజర్ హైలెట్స్ అని చెప్పొచ్చు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తోన్న ఈ సినిమాలో సూర్య జోడీగా ప్రియాంక అరుళ్ మోహన్ కనిపించనుంది. వినయ్ రాయ్ విలన్ గా కనిపించనున్నారు. అలాగే సత్యరాజ్, రాజ్ కిరణ్, శరణ్య కీలక పాత్రలలో కనిపించనున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sitara Ghattamaneni: సీతూ పాప స్టెప్పులకు మహేష్ ఫిదా.. కళావతి పాటకు అదరగొట్టిన సితార..

Viral Photo: చారడేసి కళ్లు.. బూరె బుగ్గల ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టండి.. బుల్లితెరపై ఈ చిన్నదానిదే హవా..

Shaakuntalam: ఎట్టకేలకు సమంత ఫస్ట్ లుక్ రిలీజ్!!.. శాకుంతలం సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్..

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..