Avatar2: అదరగొట్టిన అవతార్2 .. తొలి రోజే రికార్డు స్థాయి కలెక్షన్స్.. తెలుగు రాష్ట్రాల్లో ఎంత వసూల్ చేసిందంటే..
అవతార్ సినిమా తరువాత భారీ అంచనాలు క్రియేట్ చేసిన అవతార్ 2 డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా విడుదలకు ముందే బుకింగ్స్ తో రికార్డులు క్రియేట్ చేసింది
ఇన్ని రోజులు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన భారీ సినిమా అవతార్2 ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అవతార్ సినిమా తరువాత భారీ అంచనాలు క్రియేట్ చేసిన అవతార్ 2 డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా విడుదలకు ముందే బుకింగ్స్ తో రికార్డులు క్రియేట్ చేసింది. ఇదిలా ఉంటే అవతార్ 2 సినిమా విడుదలకు ముందే పలు వెబ్ సైట్స్ లో దర్శనం ఇచ్చింది. పైరసీ అయినా కూడా ఈ సినిమాకు భారీ ఓపినింగ్స్ వచ్చాయి. ఇక తొలిరోజే రికార్డులను క్రియేట్ చేసింది అవతార్ 2. జేమ్స్ కామెరూన్ అవతార్ 2తో మరో ప్రపంచానికి తీసుకెళ్లాడు. విజువల్ వండర్ గా ఈ సినిమాను తెరకెక్కించాడు జేమ్స్ కామెరూన్. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ అవతార్ 2 సంచలనాలు సృష్టిస్తుంది. ఇక అవతార్ 2 సినిమా మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే..
అవతార్ 2 మూవీ తొలిరోజు 3800కు పైగా స్క్రీన్స్‌లో 17000 షోస్ ప్రదర్శించబడింది. ఈ సినిమా ఇండియా వ్యాప్తంగా మొత్తం ఆరు భాషల్లో విడుదలైంది. ఇంగ్లీష్‌తో పాటు హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అయ్యింది అవతార్ 2. ఇక ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అడ్వాన్స్‌డ్ బుకింగ్స్ ద్వారా దాదాపు రూ.. 20 కోట్లు కలెక్ట్ చేసింది.
ఇక తెలుగు రాష్ట్రాల్లో అవతార్ 2 మంచి ఓపినింగ్స్ రాబట్టింది. మొదటిరోజు రూ.10 కోట్ల నెట్ కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే ఇండియా వైడ్‌గా అవతార్2 కలెక్షన్స్ 35 నుంచి 40 కోట్ల వరకు ఉండవచ్చని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. సంక్రాంతి వరకు పెద్ద సినిమాలు లేకపోవడంతో మరికొన్ని రోజులు అవతార్ కలెక్షన్స్ కు డోకాలేదు అని తెలుస్తోంది.