Bigg Boss 6 Telugu: నా కొడుకు తండ్రి ప్రేమకు నోచుకోలేదు.. నాన్న దుబాయ్‌లో ఉన్నాడని అబద్దం చెప్పాం.. ఎమోషనల్ అయిన రేవంత్ తల్లి

విన్నర్ అయ్యే అర్హత రేవంత్ కు ఉందని తెలుస్తోంది. అతను ఈ సీజన్ విన్నర్ అవ్వడం ఖాయం అని అంటున్నారు ప్రేక్షకులు. రేవంత్ కు ఓటింగ్ విషయంలో తిరుగు లేదు.

Bigg Boss 6 Telugu: నా కొడుకు తండ్రి ప్రేమకు నోచుకోలేదు.. నాన్న దుబాయ్‌లో ఉన్నాడని అబద్దం చెప్పాం.. ఎమోషనల్ అయిన రేవంత్ తల్లి
Revanth
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 16, 2022 | 8:36 PM

బిగ్ బాస్ సీజన్ 6 చివరి అంకానికి వచ్చేసింది. మరికొద్ది రోజుల్లో సీజన్ 6 కంప్లీట్ కానుంది. దాంతో హౌస్ లో టాప్ 5లో ఎవరుంటారు.? విన్నర్ ఎవరవుతారు .? అనే ఆసక్తి నెలకొంది. అయితే ప్రస్తుతం హౌస్ లో ఆరుగురు సభ్యులు ఉన్నారు. రేవంత్, శ్రీహాన్, శ్రీ సత్య, ఆదిరెడ్డి, రోహిత్, కీర్తి. వీరిలో ఈ వారం మిడ్ లో ఒకరు ఎలిమినేట్ అవ్వనున్నారు. అయితే ఈ ఆరుగురిలో శ్రీ సత్య ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందని తెలుస్తోంది. అలాగే  విన్నర్ అయ్యే అర్హత రేవంత్ కు ఉందని తెలుస్తోంది. అతను ఈ సీజన్ విన్నర్ అవ్వడం ఖాయం అని అంటున్నారు ప్రేక్షకులు. రేవంత్ కు ఓటింగ్ విషయంలో తిరుగు లేదు. ఎన్ని సార్లు నామినేషన్స్ లో ఉన్న అతడు సేఫ్ అవుతూనే ఉన్నాడు. ఇక విన్నర్ కూడా అతడే అని ఫిక్స్ అయిపోయారు ప్రేక్షకులు.

ఇక రేవంత్ వ్యక్తిగత జీవితం గురించి ఆయన తల్లి సీతా సుబ్బలక్ష్మి తాజాగా  ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. రేవంత్ కు తండ్రి లేరు అన్న విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని హౌస్ లో కూడా చెప్పి బాధపడ్డాడు రేవంత్. ఇక ఆయన తల్లి సీతా సుబ్బలక్ష్మి ఫ్యామిలీ టైం లో హౌస్ లోకి వచ్చారు. తాజాగా ఆమె మాట్లాడుతూ.. రేవంత్ కడుపులో ఉండగానే తండ్రి  చనిపోయాడు. రేవంత్ కు కనీసం తండ్రి ఎలా ఉంటాడో కూడా తెలియదు అని ఎమోషనల్ అయ్యారు. రేవంత్ పుట్టిన తర్వాత నాన్న లేడు చనిపోయాడు అని చెప్తే అది మనసులో పెట్టుకొని కృంగిపోతాడు అని చెప్పలేదు.

ఇవి కూడా చదవండి

పెద్దయ్యాకా నాన్న ఎక్కడ అని అడిగితే దుబాయ్ లో ఉన్నారని అబద్దం చెప్పాం.. మా అన్నయ్యలు అలా చెప్పారు. రేవంత్ ఇప్పటికి తండ్రిని తలచుకొని బాధపడుతూ ఉంటాడు. రేవంత్ నాన్న ప్రేమకు నోచుకొలేదు.. కనీసం నాన్న ఎలా ఉంటాడో చూడలేదు అంటూ భావోద్వేగానికి గురయ్యారు. నా బిడ్డలే నాకు వరం.. మా ఆయన వెళ్లిపోతూ నాకు రత్నాల్లాంటి బిడ్డల్ని ఇచ్చారని ఇప్పటికీ సంతోషపడతా.. రేవంత్ కు కొంచం కోపం ఎక్కువే.. కానీ అతని కోపం పాలపొంగులాంటిది అని అన్నారు సీతా సుబ్బలక్ష్మి .