Avatar 2: ఒక్క సీన్ కోసం 7 నిమిషాలు ఊపిరి తీసుకోలేదట.. అవతార్ 2 కోసం ఎంతగా కష్టపడ్డారంటే..
అవతార్ 2 కోసం భారీగా డబ్బు వెచ్చించారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటి కేట్ విన్స్ లెట్ ఈ చిత్రం షూటింగ్ లో ఓ సీన్ కోసం తాను దాదాపు 7 నిమిషాల 15 సెకన్ల పాటు ఊపిరి తీసుకోలేదని వెల్లడించింది.
దాదాపు 13 ఏళ్ల నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అవతార్ 2 సినిమా శుక్రవారం ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా 52000 స్క్రీన్స్ లో ఈ చిత్రం గ్రాండ్ విడుదలైంది. అయితే సినిమా రిలీజ్ కు ముందే ఈ మూ వీ అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డుల మోత మోగించింది. గతంలో ఏ సినిమాకు లేనంతగా అవతార్ 2కు అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. ఈ క్రమంలోనే ఇండియాలో కేజీఎఫ్ రికార్డును బ్రేక్ చేసింది. అయితే విడుదలకు ముందే ఈ మూవీ సోషల్ మీడియాలో లీక్ అయ్యింది. పలు వెబ్ సైట్లలో ఫుల్ క్లారిటీ మూవీ దర్శనమిచ్చింది. దీంతో ఈ మూవీకి దాదాపు 100 కోట్ల వరకు నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ అవతార్ 2 కోసం భారీగా డబ్బు వెచ్చించారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటి కేట్ విన్స్ లెట్ ఈ చిత్రం షూటింగ్ లో ఓ సీన్ కోసం తాను దాదాపు 7 నిమిషాల 15 సెకన్ల పాటు ఊపిరి తీసుకోలేదని వెల్లడించింది.
దీంతో గతంలో హాలీవుడ్ స్టార్ టామ్ క్రూజ్ రికార్డ్ ను బ్రేక్ చేసింది. మిషన్ ఇంపాజిబుల్ ..రోగ్ నేష్ సెట్ లో టామ్ దాదాపు ఆరు నిమిషాల పాటు ఊపిరి తీసుకోకుండా ఉన్నారు. సాధారణంగా ఓ వ్యక్తి కేవలం రెండు నిమిషాలు మాత్రమే ఉపిరితీసుకోకుండ ఉండగలడు. ఇక నీటి అడుగున షూటింగ్ చేస్తున్నప్పుడు ఎంతో ఒత్తిడి భరించానని.. ఆ సమయంలో తాను చనిపోయానని అనుకుని అరిచానని.. ఇందుకు సంబంధించిన వీడియో తన వద్ద ఉన్నట్లు చెప్పుకొచ్చింది. చివరగా 7 నిమిషాల 15 సెకన్లు ఊపిరి తీసుకోకుండా ఉండడం చూసి తనను తాను నమ్మకలేకపోయానని వెల్లడించింది.
లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన అవతార్ 2 సినిమాలో కేట్.. రోనల్ అనే పాత్రలో కనిపించనుంది. 1997లో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన టైటానిక్ సినిమా తర్వాత మొదటిసారి డైరెక్టర్ జేమ్స్ కామెరూన్, కేట్ షూటింగ్ లో కలుసుకున్నారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.