AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Avatar 2: లీకైనా తగ్గేదే లే.. అవతార్ 2కి షాకింగ్ ఓపెనింగ్స్.. అక్కడ మాత్రం ఎదురుదెబ్బే..

భారత్‌లోని థియేటర్లలో 'అవతార్ 2' విడుదలకు ముందే సినిమా ప్రింట్ ఆన్ లైన్‌లో లీక్ అయ్యింది. పైరసీ ప్రింట్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొట్టింది. . ఫ్రీగా సినిమా అందుబాటులో ఉండటంతో కొందరు డౌన్ లోడ్ చేసుకుంటున్నారు. ఐతే ఈ తరహా సినిమాలు థియేటర్లలో చూస్తేనే మజా అనుకున్నారు సినీ ప్రియులు. అందుకే నెట్టింట సినిమా లీకైన షాకింగ్ బుకింగ్ నమోదయినట్లుగా తెలుస్తోంది.

Avatar 2: లీకైనా తగ్గేదే లే.. అవతార్ 2కి షాకింగ్ ఓపెనింగ్స్.. అక్కడ మాత్రం ఎదురుదెబ్బే..
Avatar 2
Rajitha Chanti
| Edited By: Ravi Kiran|

Updated on: Dec 16, 2022 | 12:06 PM

Share

సీని ప్రియుల కళ్లముందుకు వచ్చేసింది అవతార్ 2. దాదాపు 13 ఏళ్ల తర్వాత లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన ఈసినిమా డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‏గా విడుదలైంది. తెలుగుతోపాటు.. హిందీ, కన్నడ, మలయాళం, తమిళంలోనూ ఈ సినిమా రిలీజ్ అయ్యింది. అయితే విడుదలకు కొద్ది గంటల ముందే ఈ సినిమాకు షాక్ తగిలిన సంగతి తెలిసిందే. భారత్‌లోని థియేటర్లలో ‘అవతార్ 2’ విడుదలకు ముందే సినిమా ప్రింట్ ఆన్ లైన్‌లో లీక్ అయ్యింది. పైరసీ ప్రింట్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొట్టింది. . ఫ్రీగా సినిమా అందుబాటులో ఉండటంతో కొందరు డౌన్ లోడ్ చేసుకుంటున్నారు. ఐతే ఈ తరహా సినిమాలు థియేటర్లలో చూస్తేనే మజా అనుకున్నారు సినీ ప్రియులు. అందుకే నెట్టింట సినిమా లీకైన షాకింగ్ బుకింగ్ నమోదయినట్లుగా తెలుస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా 160 భాషల్లో విడుదలైన ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది. అలాగే.. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హైదరాబాద్ సినీ లవర్స్ కోసం ఓ థియేటర్ల స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. లార్జ్‌ స్క్రీన్‌ స్క్రీనింగ్‌లో స్పెషల్‌ 3డీ గ్లాసెస్‌ సౌకర్యంతో అవతార్‌ 2 చూసేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు ప్రసాద్‌ ఐమాక్స్‌ ప్రకటించింది. ఇవి ప్రత్యేకంగా రూపొందించబడిన డాల్బీ విజన్ 3డి గ్లాసెస్‌. సరికొత్త అనుభూతితో సినిమా చూసిన భావనను డాల్బీ విజన్ 3డి గ్లాసెస్‌ అందిస్తాయి. అలాగే.. ఉదయం నుంచే పాజిటివ్ టాక్ అందుకుంటున్న అవతార్ 2 చిత్రానికి చెన్నైలో మాత్రం ఎదురుదెబ్బ తగిలింది.

చెన్నైలోని పలు థియేటర్లలలో అవతార్ 2 విడుదల ఆగిపోయినట్లుగా తెలుస్తోంది. చెన్నైలోని థియేటర్ల యజమానులు సోషల్ మీడియా ద్వారా అవతార్: ది వే ఆఫ్ వాటర్ చిత్రాన్ని పంపిణీ చేస్తున్న డిస్నీ స్టూడియోస్‌తో తమకు అనుకూలమైన ఒప్పందం రాకపోవడంతో సంబంధిత ప్రాపర్టీలలో విడుదల చేయడం లేదని వెల్లడించారు. చెన్నైలోని వెట్రి థియేటర్స్, AGS సినిమాస్, GK సినిమాస్ థియేటర్లలో అవతార్ 2 సినిమా విడుదల కాలేదు. దీంతో ముందుగానే టికెట్స్ బుక్ చేసుకున్న సినీ ప్రియులు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.