Upasana Ram Charan: ప్రెగ్నెన్సీ అనౌన్స్ తర్వాత తొలిసారి ఫోటోస్ షేర్ చేసిన ఉపాసన.. అమ్మను కాబోతున్నాను.. ఆశీర్వాదాలు అంటూ..
తాజాగా సోషల్ మీడియాలో తన లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేశారు ఉపాసన. ఇటీవల ఆమె పుట్టినింటికి వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే తన తల్లతోపాటు.. అపోలో హాస్పిటల్ ప్రతినిధులతో కలిసి దిగిన ఫోటోను ఇన్ స్టా వేదికగా షేర్ చేసింది.

మెగా ఫ్యామిలీలోకి వారసుడు రాబోతున్న సంగతి తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడనే శుభవార్తను మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. దీంతో చరణ్ దంపతులకు బంధుమిత్రులు.. సెలబ్రెటీలు.. అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా సోషల్ మీడియాలో తన లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేశారు ఉపాసన. ఇటీవల ఆమె పుట్టినింటికి వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే తన తల్లతోపాటు.. అపోలో హాస్పిటల్ ప్రతినిధులతో కలిసి దిగిన ఫోటోను ఇన్ స్టా వేదికగా షేర్ చేసింది.
తన అత్తమ్మ సురేఖను మిస్ అవుతున్నట్లు తెలిపింది. నా జీవితంలో అత్యంత ముఖ్యమైన మహిళల ఆశీర్వాదాలతో మాతృత్వంలోకి అడుగుపెట్టబోతున్నాను. కానీ ఇక్కడ అత్తమ్మను మిస్ అవుతున్నాను రాని రాసుకొచ్చింది. ఇక ఈ ఫోటోలో ఉపాసన తల్లి శోభనా కామినేనితో పాటు హాస్పిటల్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతా రెడ్డి, అపోలో హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్ పర్సన్ ప్రీతారెడ్డి అలాగే ఆమె స్నేహితురాలు సునీతా రెడ్డి ఉన్నారు.
ఇక ప్రస్తుతం రామ్ చరణ్.. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఆర్సీ 15 సినిమా చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుండగా.. హీరోయిన్ అంజలి కీలకపాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ తర్వాత ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నారు.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




