- Telugu News Photo Gallery Do you know these interesting facts about Avatar 2 which was released after 13 years?
Avatar 2: 13 ఏళ్ల తర్వాత విడుదలైన అవతార్ సీక్వెల్ గురించిన ఈ ఆసక్తికర విషయాలు తెలుసా..?
2009లో డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ 'అవతార్' మువీని ప్రపంచానికి పరిచయం చేశాడు. ఈ మువీలో విజువల్ ఎఫెక్ట్‌లను అద్భుతంగా చిత్రించి చూపరులను మరో లోకానికి తీసుకెళ్లాడు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు చేసిన సినిమాల లిస్టులో అవతార్ అగ్రస్థానంలో నిలిచింది..
Updated on: Dec 16, 2022 | 2:03 PM

2009లో డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ 'అవతార్' మువీని ప్రపంచానికి పరిచయం చేశాడు. ఈ మువీలో విజువల్ ఎఫెక్ట్‌లను అద్భుతంగా చిత్రించి చూపరులను మరో లోకానికి తీసుకెళ్లాడు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు చేసిన సినిమాల లిస్టులో అవతార్ అగ్రస్థానంలో నిలిచింది.

13 ఏళ్ల తర్వాత విడుదలైన అవతార్ సీక్వెల్ (అవతార్: ది వే ఆఫ్ వాటర్) విడుదలైంది. ఈ సినిమా మూడు గంటలకు పైగా నిడివితో ఉంటుంది. అవతార్- 2 చిత్రీకరణ గురించి అరుదైన విషయాలు మీకోసం..

అవతార్-2 సినిమాలో చాలా భాగాలను నీటి అడుగున చిత్రీకరించారు. నిజానికి.. ఈ మువీని కాలిఫోర్నియా, అమెరికాలోని వెల్లింగ్‌టన్, న్యూజిలాండ్‌లోని నార్త్ ఐలాండ్‌లో చిత్రీకరించారు. ఐతే 2020లో కరోనా వల్ల లాంగ్ బ్రేక్ పడింది.

అవతార్2 షూటింగ్‌లో అధిక భాగం కాలిఫోర్నియాలోని మాన్‌హట్టన్ బీచ్‌లో తీశారు. ఇది కాలిఫోర్నియాలోని అతిపెద్ద బీచ్‌లలో ఒకటి. ఈ బీచ్‌లో నీటి అడుగున ఎక్కువ భాగం షూటింగ్ జరిగింది.

యావత్ సినీ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ‘అవతార్’ తొలి భాగంలో పండోరా అందాలను అద్బుతంగా ఆవిష్కరించాడు దర్శకుడు కామెరూన్. ఇక దాని సీక్వెల్‌ను నీళ్ల అడుగున అందాలు, భారీ జలచరాలతో తెరకెక్కించాడు.





























