- Telugu News Photo Gallery Cinema photos These are the Top Movies including Pan India ones releasing on Pongal and Sankranti 2023 telugu cinema news
Sankranti 2023: సంక్రాంతికి బాక్సాఫీస్ మెగా వార్.. వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..
ఈ ఏడాది భారీ ప్రాజెక్ట్స్ బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేశాయి. ఆర్ఆర్ఆర్, కాంతార, కేజీఎఫ్ 2 చిత్రాలు రికార్డ్ బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు సంక్రాంతికి వరుస సినిమాలు క్యూ కట్టాయి. అవెంటో తెలుసుకుందామా.
Updated on: Dec 16, 2022 | 2:04 PM

ఈ ఏడాది భారీ ప్రాజెక్ట్స్ బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేశాయి. ఆర్ఆర్ఆర్, కాంతార, కేజీఎఫ్ 2 చిత్రాలు రికార్డ్ బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు సంక్రాంతికి వరుస సినిమాలు క్యూ కట్టాయి. అవెంటో తెలుసుకుందామా.

Varisu

వీరసింహ రెడ్డి.. నందమూరి నటసింహం బాలకృష్ణ ..గోపించంద్ మలినేనే కాంబోలో వస్తోన్న చిత్రం వీరసింహా రెడ్డి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెమెన్, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో శృతి హాసన్, వరలక్ష్మి శరత్‌కుమార్, హనీ రోజ్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా జనవరి 12న విడుదల కానుంది.

వాల్తేరు వీరయ్య.. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ సినిమా జనవరి 13న విడుదల కానుంది. ఇందులో శ్రుతి హసన్ నటిస్తోంది.

తునివు.. తమిళ్ స్టార్ హీరో అజిత్ కుమార్..డైరెక్టర్ హెచ్. వినోద్ కాంబోలో రాబోతున్న ఈ చిత్రం.. జనవరి 12న విడుదల కానుంది. బే వ్యూ ప్రాజెక్ట్స్ ఎల్‌ఎల్‌పి, జీ స్టూడియోస్ బ్యానర్‌పై బోనీ కపూర్ నిర్మిస్తున్నారు.