RGV: అవతార్2ను సినిమా అనడం నేరం ఎందుకంటే.. ఆర్జీవీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
ప్రపంచవ్యాప్తంగా సినీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన అవతార్ 2 రానే వచ్చేసింది. 2009లో వచ్చిన అవతార్‌కు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమా మొదటి షో నుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ప్రపంచంలోని ఎన్నో భాషల్లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి..
ప్రపంచవ్యాప్తంగా సినీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన అవతార్ 2 రానే వచ్చేసింది. 2009లో వచ్చిన అవతార్‌కు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమా మొదటి షో నుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ప్రపంచంలోని ఎన్నో భాషల్లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లింది. వెండి తెరపై విజువల్ వండర్‌గా తెరకెక్కిన అవతార్2 చూసిన వారు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సామాన్య ప్రేక్షకుల నుంచి మొదలు సెలబ్రిటీల వరకు సోషల్ మీడియా వేదికగా సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ కూడా అవతార్ చిత్రాన్ని వీక్షించినట్లు తెలిపారు. ప్రతీ విషయాన్ని తనదైన కోణంలో చూసే వర్మ అవతార్ చిత్రం విషయంలోనూ ఆసక్తికర ట్వీట్ చేశారు. అవతార్ చిత్రం రివ్యూను ఒక్క మాటలో చెప్పేశారు. వర్మ ట్వీట్ చేస్తూ.. ‘ఇప్పుడే అవతార్2లో స్నానం చేసి వచ్చాను. దీనిని సినిమా అనడం నేరంతో సమానం. ఎందుకంటే అద్భుతమైన విజువల్స్‌తో అబ్బురపరిచే యాక్షన్‌తో జీవితకాలానికి సరిపోయే అనుభూతిని అందించింది అవతార్. మరోలోకంలో విహరించినట్లు ఉంది’ అని రాసుకొచ్చారు.
ఇదిలా ఉంటే జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో వచ్చిన అవతార్ తొలి పార్ట్ ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విడుదలైన అన్ని చోట్ల సరికొత్త రికార్డులు సృష్టించిందీ సినిమా. ఇక అవతార్ తొలి పార్ట్ పండారా గ్రహం నేపథ్యంలో తెరకెక్కిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు వచ్చిన సీక్వెల్‌ను సముద్ర గర్భం బ్యాడ్రాప్‌లో తెరకెక్కించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..