AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Childhood Photo: ఏఎన్ఆర్ ఎత్తుకున్న ఈ చిన్నారి నాగార్జున అనుకుంటే పప్పులో కాలేసినట్టే.. ఎవరో గుర్తుపట్టారా.?

ఇండస్ట్రీలో తనకంటూ ఒక  చరిత్ర సృష్టించారు ఏఎన్ఆర్. నందమూరి తారక రామారావు తర్వాత ఇండస్ట్రీలో స్టార్ గా ఎదిగి టాలీవుడ్ కు మూలస్థంభంగా నిలిచారు.

Childhood Photo: ఏఎన్ఆర్ ఎత్తుకున్న ఈ చిన్నారి నాగార్జున అనుకుంటే పప్పులో కాలేసినట్టే.. ఎవరో గుర్తుపట్టారా.?
Anr
Rajeev Rayala
|

Updated on: Dec 17, 2022 | 6:53 AM

Share

సినిమా ఇండస్ట్రీలో లెజెండ్స్ పేర్లు చెప్పమంటే అక్కినేని నాగేశ్వరరావు పేరు ఖచ్చితంగా చెప్పాలి. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా.. అనుకోకుండా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన వారిలో నాగేశ్వరరావు ఒకరు. ఇండస్ట్రీలో తనకంటూ ఒక  చరిత్ర సృష్టించారు ఏఎన్ఆర్. నందమూరి తారక రామారావు తర్వాత ఇండస్ట్రీలో స్టార్ గా ఎదిగి టాలీవుడ్ కు మూలస్థంభంగా నిలిచారు. 1944 లో ఘంటసాల బలరామయ్య తెరకెక్కించిన “సీతారామ జననం” సినిమాతో నటుడిగా పరిచయం అయ్యారు అక్కినేని. ఇక అన్ని భాషల్లో కలిపి 256 సినిమాలకు పైగా నటించారు. ఇక నాగేశ్వరరావు నటించిన చివరి సినిమా మనం. ఇలా అయన గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అయితే పై ఫొటోలో ఏఎన్ఆర్ ఎత్తుకున్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..? కింగ్ నాగార్జున అనుకుంటే పప్పులో కాలేసినట్టే..

ఏఎన్ఆర్ ఎత్తుకున్న ఆ చిన్నారి ఇప్పుడు టాలీవుడ్ లో క్రేజీ హీరోగా కంటిన్యూ అవుతున్నాడు. ఇంతకూ ఆ హీరో ఎవరో గుర్తుపట్టారా.. అతడు ఎవరో కాదు అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోగా వచ్చిన సుశాంత్. ఈ కుర్ర హీరో  కరెంట్ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నాడు.

ప్రస్తుతం వరుస సినిమాలతో పాటు సెకండ్ హీరోగాను మెప్పిస్తున్నాడు సుశాంత్. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అల వైకుంఠపురములో సినిమాలో సెకండ్ హీరోగా నటించాడు సుశాంత్. అలాగే ఇప్పుడు రవితేజ హీరోగా వస్తోన్న రావణాసుర సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. అలాగే సోలో హీరోగానూ కొన్ని ప్రాజెక్ట్స్ ను పట్టాలెక్కిస్తున్నాడు సుశాంత్.

ఇవి కూడా చదవండి
Sushanth

Sushanth