Tollywood: ముద్దుగుమ్మల మధ్య ముదురుతున్న వివాదం.. నా పవర్ ఏంటో చూపిస్తా అంటూ..

ఇప్పుడు ఈ భామల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అసలు విషయం ఏంటంటే.. ఇటీవల సమంత నటించిన యశోద సినిమాలో ఓ రోల్ చేసింది కల్పిక. ఈ సినిమాతో కల్పికకు మంచి ఫేమ్ వచ్చింది

Tollywood: ముద్దుగుమ్మల మధ్య ముదురుతున్న వివాదం.. నా పవర్ ఏంటో చూపిస్తా అంటూ..
Dhanya Balakrishna, Kalpika Ganesh
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 17, 2022 | 9:50 AM

టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా కల్పిక గణేష్, ధన్య బాలకృష్ణ మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా హీరోయిన్స్ ఫ్రెండ్ క్యారెక్టర్స్ లో ఈ ఇద్దరు ఆకట్టుకున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ భామల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అసలు విషయం ఏంటంటే.. ఇటీవల సమంత నటించిన యశోద సినిమాలో ఓ రోల్ చేసింది కల్పిక. ఈ సినిమాతో కల్పికకు మంచి ఫేమ్ వచ్చింది. దాంతో ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయ్యింది. ఇటీవల సమంతకు ఉన్న వ్యాధి తోనే తాను బాధపడుతున్నా అని తెలిపి వార్తల్లో నిలిచింది. అలాగే తన యూట్యూబ్ ఛానల్ లో వరసగా వీడియోలు చేస్తూ హంగామా చేస్తోంది. ఈ క్రమంలోనే ధన్య బాలకృష్ణ గురించి ఓ వీడియోలో మాట్లాడింది కల్పిక గణేష్. ఆ వ్యాఖ్యలు కాస్త వైరల్ గా మారాయి.

కల్పిక మాట్లాడుతూ.. ధన్య బాలకృష్ణకు పెళ్లయిందని ఆమె ఓ డైరెక్టర్ ను పెళ్లి చేసుకుందని చెప్పుకొచ్చింది. ధన్య బాలకృష్ణ తమిళ్ డైరెక్టర్ బాలాజీ మోహన్‌‌  ను పెళ్లాడిందని .. ఈ ఇద్దరు రిలేషన్ లో ఉన్నారని తెలిపింది. డైరెక్టర్ బాలాజీ మోహన్‌‌  ధనుష్ నటించిన మారి, మారి 2 సినిమాలతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. మొదటి భార్య నుంచి బాలాజీ మోహన్ విడాకులు తీసుకున్న తర్వాత ఈ ఏడాది జనవరిలో అతడ్ని ధన్య సీక్రెట్‌గా పెళ్లి చేసుకుంది చెప్పుకొచ్చింది కల్పిక.

ఇవి కూడా చదవండి

అలాగే పెళ్లితర్వాత  ధన్య ఎక్కడ కనిపించలేదని.. సినిమాల్లోనూ ఎక్కువగా నటించడం లేదని అంది. ఎక్కడా సినిమా ప్రమోషన్స్‌లో కనిపించడం లేదని.. ఆమె ఇబ్బందుల్లో ఉందేమో?అని ఆ వీడియోలో చెప్పుకొచ్చింది. అయితే కల్పిక చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఇది జరిగిన కొద్దిరోజులకు ఆ వీడియో డిలీట్ అయ్యింది. దాంతో కల్పిక మండి పడింది. తనకు తెలియకుండా ఆ వీడియోను ధన్య డిలీట్ చేసిందని ఫెర్ అయ్యింది. ధన్య బాలకృష్ణకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ‘‘నన్ను అనవసరంగా గొడవలోకి లాగుతున్నావు. ఇక కోర్టులో చూసుకుందాం.. నీ విషయాలు చెప్పేసరికి నన్ను ఫస్ట్ బ్లాక్‌ చేశావు. ఇప్పుడు అన్‌బ్లాక్‌ చేసి కాల్స్ చేస్తున్నావు. ఏంటి నువ్వు భయపడ్డావా? లేదా నన్ను భయపెట్టాలని అనుకుంటున్నావా? నీ పవర్‌ చూపించి వీడియోను యూట్యూబ్‌లో లేకుండా చేశావు కదా..? ఇక నా పవర్‌ ఏంటో చూపిస్తా.. అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యింది కల్పిక. ఇక తన వీడియోను తనకు తెలియకుండా డిలీట్ చేయడం వెనక ధన్య బాలకృష్ణకు ఓ కోలీవుడ్ డైరెక్టర్ సాయం చేశాడని అంటుంది కల్పిక. మరి ఈ  వివాదం ఎక్కడివరకు వెళ్తుందో చూడాలి.