AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kollywood : తమిళనాట తమ్ముళ్ళ తన్నులాట.. దళపతి- అజిత్ ఫ్యాన్ మధ్య వార్

ముఖ్యంగా దళపతి విజయ్ ఫ్యాన్,తల అజిత్ అభిమానులకు మధ్య నిత్యం వార్ జరుగుతూనే ఉంటుంది. తాజాగా మరోసారి తమిళనాట తమ్ముళ్ళ తన్నులాట కలకలం రేపుతోంది.

Kollywood : తమిళనాట తమ్ముళ్ళ తన్నులాట.. దళపతి- అజిత్ ఫ్యాన్ మధ్య వార్
Ajith Vs Vijay
Rajeev Rayala
|

Updated on: Dec 17, 2022 | 10:02 AM

Share

సినిమా ఇండస్ట్రీలో హీరోల అభిమానుల మధ్య వివాదాలు మనం చూస్తూనే ఉంటాం.. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ తన్నుకుంటూ ఉంటారు ఫ్యాన్స్. మనదగ్గరే కాదు తమిళ నాట అభిమానుల మధ్య గొడవలు ఎక్కువాగా జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా దళపతి విజయ్ ఫ్యాన్,తల అజిత్ అభిమానులకు మధ్య నిత్యం వార్ జరుగుతూనే ఉంటుంది. తాజాగా మరోసారి తమిళనాట తమ్ముళ్ళ తన్నులాట కలకలం రేపుతోంది. చెన్నైలో విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ అజిత్ ఫ్యాన్స్ అల్లకల్లోలంగా మారింది. తమిళనాట మరోసారి ఫ్యాన్స్ రగడ రచ్చ రచ్చగా మారింది. వారసుడు సినిమా నిర్మాత …తమ హీరోని తక్కువ చేసి మాట్లాడారంటూ ఫ్యాన్స్‌ మధ్య గొడవ రచ్చ రంబోలాగా మారింది.

అజిత్ కంటే విజయ్ గొప్ప నటుడు అని నిర్మాత దిల్ రాజు అనడం తమిళనాడులో అగ్గిరాజేస్తోంది. దీన్ని మేము సహించబోమని అజిత్ ఫ్యాన్స్ దిల్ రాజు కు అల్టిమేటం ఇచ్చారు. విజయ్ కన్నా మా హీరోనే మంచి నటుడంటూ అజిత్ ఫ్యాన్స్… ఇద్దరు హీరోల ఫ్యాన్స్‌ మధ్య మాటల యుద్ధం మంటలు రేపుతోంది.

ఇవి కూడా చదవండి

అయితే ఇది తమిళనాడులో నిత్య కృత్యమే. నిత్యం అజిత్, విజయ్ ఫ్యాన్స్ మధ్య రగడ రాజుకుంటూనే ఉంటుంది. అయితే తాజాగా పొంగల్ సందర్భంగా విజయ్ వారసుడు, అజిత్ తునివు సినిమాలు విడుదల కానున్న నేపథ్యంలో కాంట్రవర్సీ కాకరేపుతోంది. తాజాగా దిల్ రాజు వ్యాఖ్యల నేపథ్యంలో తమిళనాట అభిమానుల మధ్య అగ్గిరాజుకుంటోంది.

Follow Us
నిజమైన నాగుపాములతో షూటింగ్.. శివుడి పాత్రలో ఎన్టీఆర్ ను చూసి..
నిజమైన నాగుపాములతో షూటింగ్.. శివుడి పాత్రలో ఎన్టీఆర్ ను చూసి..
ఇద్దరు అమ్మాయిల ప్రాణాలు తీసిన పిల్లులు! అసలు ఏం జరిగిందంటే?
ఇద్దరు అమ్మాయిల ప్రాణాలు తీసిన పిల్లులు! అసలు ఏం జరిగిందంటే?
జుట్టు ఒత్తుగా పెరగాలా.. అమ్మమ్మల కాలం నాటి అద్భుతమైన చిట్కా..
జుట్టు ఒత్తుగా పెరగాలా.. అమ్మమ్మల కాలం నాటి అద్భుతమైన చిట్కా..
ఐపీఎల్ 2026లో కుర్రాళ్లకు చుక్కలు చూపించే టాప్-5 సీనియర్లు వీళ్లే
ఐపీఎల్ 2026లో కుర్రాళ్లకు చుక్కలు చూపించే టాప్-5 సీనియర్లు వీళ్లే
బాలయ్య అంతే మరి.. సినిమా అంటే ప్రాణమిస్తాడు..
బాలయ్య అంతే మరి.. సినిమా అంటే ప్రాణమిస్తాడు..
2 నిమిషాల్లో మెహందీ, గోరింటాకు మచ్చలకు గుడ్‌బై చెప్పేయండి
2 నిమిషాల్లో మెహందీ, గోరింటాకు మచ్చలకు గుడ్‌బై చెప్పేయండి
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పండుగే.. కేంద్రం నుంచి కీలక అప్డేట్..
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పండుగే.. కేంద్రం నుంచి కీలక అప్డేట్..
ఉల్లిపాయ‌ పొట్టు ప‌డేస్తున్నారా? అందులోని ఆరోగ్య గుట్టు తెలిస్తే
ఉల్లిపాయ‌ పొట్టు ప‌డేస్తున్నారా? అందులోని ఆరోగ్య గుట్టు తెలిస్తే
SRH Vs RCB కాదు.. బెంగళూరు వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇది..
SRH Vs RCB కాదు.. బెంగళూరు వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇది..
సంవత్సరాలు గడిచిన తగ్గని క్రేజ్.. దెబ్బకు ఆ ముగ్గురు హీరోయిన్లు..
సంవత్సరాలు గడిచిన తగ్గని క్రేజ్.. దెబ్బకు ఆ ముగ్గురు హీరోయిన్లు..