Chandrahass: నా సినిమా నచ్చకుంటే డబ్బులు వాపస్ ఇస్తా.. చంద్రహాస్ షాకింగ్ కామెంట్స్
ప్రభాకర్ చాలా సీరియల్స్ లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. అలాగే పలు సినిమాల్లోనూ నటించారు ప్రభాకర్. ఇప్పుడు ఆయన కొడుకు చంద్రహాస్ ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. అతను ముందు సోషల్ మీడియాలో యాటిట్యూడ్ స్టార్ గా పాపులర్ అయ్యాడు.
చంద్రహాస్.. ఈ పేరు చెప్తే పెద్దగా గుర్తుపట్టకపోవొచ్చు కానీ యాటిట్యూడ్ స్టార్ అంటే టక్కున గుర్తుపట్టేస్తారు. ప్రముఖ టెలివిజన్ నటుడు ప్రభాకర్ కొడుకు చంద్రహాస్. ప్రభాకర్ చాలా సీరియల్స్ లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. అలాగే పలు సినిమాల్లోనూ నటించారు ప్రభాకర్. ఇప్పుడు ఆయన కొడుకు చంద్రహాస్ ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. అతను ముందు సోషల్ మీడియాలో యాటిట్యూడ్ స్టార్ గా పాపులర్ అయ్యాడు. ఇక ఇప్పుడు చంద్రహాస్ రామ్ నగర్ బన్నీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ను మలయజ, ప్రభాకర్ లు నిర్మించారు. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. శ్రీనివాస్ మహత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
ఇది కూడా చదవండి : Devara : దేవరలో నటించిన ఈమె గుర్తుందా.? బయట చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే
రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని తెరకెక్కించారు. ఇక ఈ మూవీ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అక్టోబర్ 4న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ కు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గెస్ట్ గా హాజరయ్యారు. ఇక ఈ సినిమా గురించి చంద్రహాస్ చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి :బాబోయ్..! భరణి సినిమా హీరోయిన్ ఎంత మారిపోయింది.. కుర్రహీరోయిన్స్ కూడా కుళ్ళుకోవాల్సిందే
అలాగే చంద్రహాస్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఒకవేళ తన రామ్ నగర్ బన్నీ సినిమా ఎవరికైనా నచ్చకుంటే.. తనకు ఇన్ స్టా గ్రామ్‌లో మెసేజ్ చేయాలనీ చెప్పాడు. సినిమా నచ్చకపోతే.. బుక్ చేసుకున్న టికెట్స్, థియేటర్స్‌లో ఫోటో దిగి, అలాగే సినిమాకు వెళ్లినట్టు ఫ్రూఫ్స్ ను తనకు ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేయాలని చెప్పాడు. తన సినిమా వల్ల ఎవరికైన టైం వేస్ట్ అయ్యిందని చెప్తే ఖచ్చితంగా డబ్బులు మొత్తం రిటన్ చేస్తా అని చెప్పాడు. టికెట్ అయిన ఖర్చును గూగుల్ పే చేస్తానంటూ చెప్పుకొచ్చాడు చంద్రహాస్. మరి ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.
ఇది కూడా చదవండి : నాన్న స్టార్ హీరో, అమ్మ సీనియర్ హీరోయిన్.. కానీ ఈ అక్కాచెల్లెళ్లకు మాత్రం ఒక్క హిట్ లేదు
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి