AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salman Khan: మరో సౌతిండియన్ స్టార్ డైరెక్టర్‌తో సల్మాన్.. ఆ టాలీవుడ్ హీరోతో కలిసి మల్టీ స్టారర్

భారీ హిట్ కోసం చూస్తున్న సల్మాన్ ఖాన్ ఇప్పటికే ఒక దక్షిణాది దర్శకుడితో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు కండల వీరుడు. ఈ సినిమాకు కూడా సౌతిండియన్ డైరెక్టరే తెరకెక్కిస్తుండడం విశేషం.

Salman Khan: మరో సౌతిండియన్ స్టార్ డైరెక్టర్‌తో  సల్మాన్.. ఆ టాలీవుడ్ హీరోతో కలిసి మల్టీ స్టారర్
Salman Khan
Basha Shek
|

Updated on: Dec 01, 2024 | 6:22 AM

Share

వరుసగా పరాజయాలను చవిచూసిన షారుఖ్ ఖాన్ 2023లో ఏకంగా మూడు బ్లాక్ బస్టర్ సినిమాలను అందించాడు. తద్వారా మునిగిపోతున్న బాలీవుడ్‌కు మళ్లీ జీవం పోశాడు. అయితే షారుఖ్‌ మినహా మిగిలిన ఇద్దరు ఖాన్‌లకు మాత్రం విజయం ఎండమావిగానే మిగిలిపోయింది. అమీర్ ఖాన్ నటించిన ‘లాల్ సింగ్ ఛద్దా’ పరాజయం పాలైంది. అలాగే సల్మాన్ ఖాన్ సినిమాలు కూడా యావరేజ్ హిట్స్ అయ్యాయి. ఇప్పుడు మళ్లీ విజయం సాధించేందుకు సల్మాన్ ఖాన్ ఇప్పటికే ఓ తమిళ దర్శకుడితో చేతులు కలిపాడు. ఆ సినిమా తర్వాత తమిళ దర్శకుడితో మరో సినిమా చేయనున్నాడు. సల్మాన్ ఖాన్ ప్రస్తుతం సికిందర్ సినిమాలో నటిస్తున్నాడు. ‘గజిని’, ‘తుపాకి’, ‘కత్తి’, ‘దర్బార్’ లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన ఏఆర్ మురుగదాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో కన్నడ భామ రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే సల్మాన్ ఖాన్ మరో తమిళ దర్శకుడితో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు.

గతేడాది షారుక్‌కి భారీ హిట్‌ అందించిన దర్శకుడు అట్లీ దర్శకత్వంలో సల్మాన్‌ ఖాన్ నటిస్తున్నాడు. షారుఖ్ ఖాన్ కోసం ‘జవాన్’ దర్శకత్వం వహించిన అట్లీ ఇప్పుడు సల్మాన్ ఖాన్ కోసం ఒక విభిన్నమైన యాక్షన్ కథను సిద్ధం చేసాడు. సినిమా కథలో పునర్జన్మ కథ కూడా ఉంటుందని తెలుస్తోంది. సినిమాలో యాక్షన్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇప్పటికే ఈ సినిమా కథ సల్మాన్‌కి నచ్చడంతో ‘సికిందర్’ సినిమా పూర్తయిన తర్వాత అట్లీతో సినిమా స్టార్ట్ చేయనున్నారు. పునర్జన్మ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ మూడు విభిన్నమైన షేడ్స్‌లో కనిపించనున్నాడు. అలాగే ఈ సినిమా కథ మూడు డిఫరెంట్ టైమ్ పీరియడ్స్ లో జరగనుందని, దీని కోసం భారీ సెట్స్ నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. సల్మాన్‌ఖాన్‌తో పాటు మరో కథానాయకుడు కూడా ఈ సినిమాలో నటిస్తాడని, ఆ పాత్ర కోసం టాలీవుడ్ హీరోని తీసుకోవాలని ప్లాన్‌ చేశారు. ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మించనున్న ఈ చిత్రానికి తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించనున్నారు. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభం కానుంది.

ఇవి కూడా చదవండి

హైదరాబాద్ లో సల్మాన్ మూవీ షూటింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి
అరుదైన గౌరవం.. ఆర్థిక శాస్త్రంలో ఇద్దరికి నోబెల్‌ బహుమతి
అరుదైన గౌరవం.. ఆర్థిక శాస్త్రంలో ఇద్దరికి నోబెల్‌ బహుమతి