Pushpa 2: పుష్ప 3 కూడా వస్తుందా? ఆసక్తికర సమాధానం చెప్పిన రష్మిక

అభిమానుల భారీ అంచనాల మధ్య 'పుష్ప 2' చిత్రం డిసెంబర్ 05న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే ‘పుష్ప 3’పై కూడా పుకార్లు వస్తున్నాయి. దీనిపై చిత్ర బృందం ఎలాంటి సమాచారం ఇవ్వకపోయినా ఇటీవల రష్మిక మందన్న హింట్ ఇచ్చి ఈ విషయంపై ఆసక్తిని రేకెత్తించింది.

Pushpa 2: పుష్ప 3 కూడా వస్తుందా? ఆసక్తికర సమాధానం చెప్పిన రష్మిక
Rashmika Mandanna
Follow us
Basha Shek

|

Updated on: Dec 01, 2024 | 7:54 AM

నేషనల్ క్రష్ రష్మిక మందన్నకు ‘పుష్ప ‘ సినిమా చాలా ప్రత్యేకం. ‘పుష్ప’ సినిమాతోనే ఆమె పాన్ ఇండియా ఫేమ్ సంపాదించింది. ఆ తర్వాత బాలీవుడ్ లో వరుస అవకాశాలు దక్కించుకుంది. ఇప్పుడు ‘పుష్ప 2’ సినిమా రాబోతోంది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ‘పుష్ప 2’ డిసెంబర్ 5న విడుదల కానుంది. దీంతో చిత్ర బృందం ప్రమోషన్లలో బిజీ బిజీగా ఉంటోంది. హీరో, హీరోయిన్లు అల్లు అర్జున్ , రష్మిక మందన్నా కూడా సినిమా ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. కాగా పుష్ప 2 సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే కాస్త ఎమోషనల్ అయింది రష్మిక. ఇదే సందర్భంగా మరో ఆసక్తికరమైన విషయాన్ని పంచుకుంది. ‘పుష్ప 3’ సినిమా కూడా రావచ్చని హింట్ ఇచ్చింది. కాగా గత ఐదేళ్లుగా రష్మిక మందన్న ‘పుష్ప’, ‘పుష్ప 2’ సినిమాల షూటింగ్‌లో పాల్గొంటోంది. దీంతో ఈ టీమ్‌తో మంచి అనుబంధాన్ని పెంచుకుందీ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే షూటింగ్ అయిపోయిందంటే చాలా బాధగా ఉందంటూ భావోద్వేగానికి లోనైంది. అదే సమయంలో ‘పుష్ప 3’ గురించి హింట్ కూడా ఇచ్చింది. ‘అఫ్ కోర్స్ ఇంకా చాలా పనులు చేయాల్సి ఉంది. బహుశా పార్ట్ 3 కూడా ఉంటుందని రష్మిక మందన్న అన్నారు. ఇది విని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి మూడో భాగం గురించి అల్లు అర్జున్ ఏమీ చెప్పలేదు. నిర్మాణ సంస్థ ‘మైత్రి మూవీ మేకర్స్’ ఏం చెబుతుందనే దానిపై అభిమానుల్లో కూడా ఆసక్తి నెలకొంది.

పుష్ప’ సినిమా సూపర్ హిట్ కావడంతో ‘పుష్ప 2’ సినిమాపై అంచనాలు పెరిగాయి. అందుకే సీక్వెల్‌ను భారీ బడ్జెట్‌తో రూపొందించారు. ఈ కథను కొనసాగించగలిగితే పార్ట్ 3 తప్పకుండా వస్తుంది. ఇప్పుడు ‘పుష్ప 2’ సినిమా కథను దర్శకుడు సుకుమార్ ఎలా ముగించాడో తెలిస్తే ముందుకు వెళ్లే మార్గం తేలిపోతుంది. దీనిపై ఫుల్ క్లారిటీ రావాలంటే డిసెంబర్ 5 వరకు ఆగాల్సిందే.

ఇవి కూడా చదవండి

కాగా ఇప్పటికే పట్నా, చెన్నై, కొచ్చి, ముంబైలో పుష్ప 2 ప్రమోషన్స్ ఈవెంట్స్ నిర్వహించాగా అభిమానుల నుంచి ఊహించని స్పందన వస్తోంది. ఇక ఆదివారం (డిసెంబర్ 01) హైదరాబాద్ లో జరగాల్సిన పుష్ప 2 ఈవెంట్ సోమవారం (డిసెంబర్ 02) కు వాయిదా పడింది. హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో పుష్ప 2 ప్రమోషన్ ఈవెంట్ నిర్వహించనున్నారు.

.మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.