Bigg Boss 8 Telugu: ఎలిమినేట్ అయినా తల్లి కోరిక నెరవేర్చిన టేస్టీ తేజ.. 8 వారాలకు ఎన్ని లక్షలు సంపాదించాడంటే?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 తుది అంకానికి చేరుకుంది. 13 వారాలుగా కొనసాగుతోన్న ఈ సెలబ్రిటీ గేమ్ షోలో ప్రస్తుతం ఫినాలే టు టాస్క్ జరుగుతోంది. అయితే ఈ వారంలో అనూహ్యంగా టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యాడు. అది కూడా ఒక రోజు ముందుగానే.

Bigg Boss 8 Telugu: ఎలిమినేట్ అయినా తల్లి కోరిక నెరవేర్చిన టేస్టీ తేజ.. 8 వారాలకు ఎన్ని లక్షలు సంపాదించాడంటే?
Tasty Teja
Follow us
Basha Shek

|

Updated on: Dec 01, 2024 | 8:16 AM

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఆసక్తికరంగా సాగుతోంది. సెప్టెంబర్ 1న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటికే 13 వారం ఎండింగ్ లోకి వచ్చేసింది. దీంతో టాప్- 5 లో ఎవరు నిలుస్తారో? టైటిల్ రేసులో ఎవరు వస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇక 13వ వారం హౌస్ లో కంటెస్టెంట్ల మధ్య ‘టికెట్ టు ఫినాలే’ టాస్క్ ను నిర్వహించారు. జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ ఈ అవకాశాన్ని బాగా సద్వినియోగం చేసుకున్నాడు. తద్వారా ఎనిమిదో సీజన్ టాప్-5 మొదటి కంటెస్టెంట్ గా నిలిచారు.ఈ కారణంగా నామినేషన్స్ లో ఉన్నప్పటికీ ఎలిమినేషన్ ప్రక్రియ నుంచి తప్పించుకున్నాడు అవినాష్. ఇక 13 వ వారంలో డబుల్ ఎలిమినేషన్ ప్రక్రియ జరిగింది. మెగా చీప్ రోహిణి తప్ప మిగతా 8 మంది కంటెస్టెంట్ అందరూ నామినేషన్ లో నిలిచారు. ఇక వీరికి ఆన్ లైన్ ఓటింగ్ ప్రక్రియ కూడా పూర్తయింది. నిఖిల్, గౌతమ్, నబిల్, ప్రేరణలు టాప్ 4 లో నిలవగా.. విష్ణు ప్రియ ఆ తర్వాతి స్థానంలో నిలిచింది. తక్కువ ఓట్లు పడిన పృథ్వీ, ముక్కు అవినాష్, టేస్టీ తేజ డేంజర్ జోన్ లో నిలిచారు.

అయితే అవినాష్ టికెట్ టు ఫినాలే టాస్క్ ఫస్ట్ విజేతగా నిలిచి ఎలిమినేషన్ నుంచి సేఫ్ అయ్యాడు. దీంతో టేస్టీ తేజ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రాక తప్పలేదు. కాగా బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లో పాల్గొన్నందుకు టెస్టీ తేజ ఎంత పారితోషికం తీసుకున్నారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చాడు టేస్టీ తేజ. సుమారు 8 వారాల పాటు హౌస్ లో ఉన్నాడు. ఇందుకు గాను వారానికి రూ. 4 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. అంటే రెండు నెలల్లో సుమారు రూ.30 లక్షల పారితోషికం తీసుకున్నాడన్నమాట.

ఇవి కూడా చదవండి

మద్దతు ఇచ్చిన వారందరికీ థ్యాంక్స్..

View this post on Instagram

A post shared by Tasty Teja (@tastyteja)

టేస్టీ తేజ అంతముందుకు ఏడో సీజన్ లో కూడా పాల్గొన్నాడు. ఏకంగా 9 వారాలపాటు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నాడు. ఆ సమయంలో అతను దాదాపు 13 లక్షల 50వేల రూపాయలను రెమ్యునరేషన్ గా తీసుకున్నట్లు సమాచారం. ఈ లెక్కన చూస్తే బిగ్ బాస్ 7 లో కంటే బిగ్ బాస్ 8 లోనే బాగా సంపాదించాడు టేస్టీ తేజ.

బిగ్ బాస్ హౌస్ లో టేస్టీ తేజ..

View this post on Instagram

A post shared by Tasty Teja (@tastyteja)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.