Brahmamudi, November 30th Episode: సుభాష్‌కు డివోర్స్ పంపించిన అపర్ణ.. రుద్రాణికి స్వప్న వార్నింగ్!
వంట చేసి తీసుకొచ్చినందుకు కావ్యకు డబ్బులు ఇచ్చి అవమానిస్తాడు రాజ్. దీంతో కావ్య సీరియస్ అవుతుంది. ఇక నుంచి నువ్వు రాకుండా ఇంట్లో వంట మనిషిని పెట్టినట్టు రాజ్ చెప్తాడు. అయినా మా కోసం వస్తుందని ఇందిరా దేవి అంటుంది..
ఈ రోజు బ్రహ్ముముడి ఎపిసోడ్‌లో.. కావ్య భోజనం తీసుకొచ్చి పెట్టడంతో రాజ్ డబ్బులు ఇస్తాడు. దీంతో కావ్య సీరియస్ అవుతుంది. ఎలా కనిపిస్తున్నాను నేను.. మీ తల తిక్క నిర్ణయాల వల్ల మీ అమ్మే దూరమై మా ఇంటికి వచ్చి ఉంటుంది. ఈ ఇంటికి నీకూ ఏ సంబంధం లేనప్పుడు నువ్వు భోజనం తీసుకొస్తే.. ఊరికే తీసుకు రావాలా అని రాజ్ అంటే.. మీ కోసం తీసుకు రాలేదు. నేనేమీ పని మనిషిని కాదు.. డబ్బావాలాను కాదు.. పేద రాసి పెద్దమ్మనూ కాదు. వాళ్లు నా అమ్మమ్మ, తాతయ్యలు కాబట్టే అన్నం తీసుకొచ్చానని కావ్య అంటుంది. ఏ పక్క నుంచి నీకు వాళ్లు వరుస అయ్యారని రాజ్ అడిగితే.. మా పక్క నుంచే.. నా కొడుక్కి ఓ అడ్డగాడిద పుట్టాడు. వాడికి నిలువునా అహంకారం పెరిగి భార్యను వదిలేసినా.. మా కోసం సేవలు చేస్తూనే ఉందని ఇందిరా దేవి అంటుంది. మా బంధుత్వం గురించి అడిగే ప్రశ్న మాకు లేదు. ప్రతీది డబ్బుతో కొనలేరని కావ్య అంటుంది.
కావ్యని అవమానించే హక్కు లేదు..
కావ్య మా మనవరాలు కాదనడానికి ఎవరికీ హక్కు లేదు. ఏంటి నువ్వు నిలబెట్టి అవమానిస్తున్నావ్? అని సీతారామయ్య అడుగుతాడు. ఆ తర్వాత సుభాష్ కూడా కావ్యకు సపోర్ట్ చేస్తాడు. అప్పుడే రుద్రాణి ఎంటర్ అయి.. దీని వల్ల మా వదిన ఆస్పత్రి పాలయ్యింది. అయినా ఆ విషయం పట్టించుకోవడం లేదని రుద్రాణి అంటుంది. ఈ నాటకాలన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టడానికి ఓ కొత్త పాత్రను ప్రవేశ పెడుతున్నా.. ఇంట్లో వంట చేయడం కోసం.. ఓ చెఫ్‌ని మాట్లాడాను. కమ్మగా వంటి పెడుతుంది.. అందరికీ బాగా చూసుకుంటుందని రాజ్ అంటాడు. దీంతో రాహుల్ మాట్లాడుతూ.. ఏంటి నాక్కూడానా.. తన పేరు ఏంటని అడుగుతాడు. స్టెల్లా అని రాజ్ చెబుతాడు. పేరు రిచ్‌గా ఉందని రాహుల్ అంటే.. స్వప్న కోపంగా చూస్తుంది. జీతం ఎంత అని రుద్రాణి అడిగితే.. నెలకు లక్ష రూపాయలు అని చెబుతాడు.
వంట మనిషిని పెట్టిన రాజ్..
ఇక నుంచి ఈ కళావతి తీసుకొచ్చే వంట తినాల్సిన పని లేదని రాజ్ అంటే.. మీరందరూ ఆరోగ్య భీమా చేసుకోండి.. ఎందుకైనా మంచిదని కావ్య అంటుంది. వీడి మాటలు పట్టించుకోకు.. మళ్లీ రేపు వంటలు చేసి తీసుకు రా.. ఆ స్టెల్లా ఏంటో.. దాని తిప్పులు ఏంటో చూస్తానని ఇందిరా దేవి అంటుంది. మరోవైపు అప్పూ, కళ్యాణ్‌లు ఇద్దరూ తింటూ ఉంటారు. అప్పూ పొలమారితే కళ్యాణ్ నీళ్లు పట్టిస్తాడు. నన్ను నమ్మి వచ్చినందుకు నీకు చాలా థాంక్స్ అని కళ్యాణ్ చెబుతాడు. ప్రేమ ఒకటి ఉంటే సరిపోదు.. నమ్మకం ఉండాలి. నీలో ఆ నమ్మకం నాకు బాగా కనిపించింది. నువ్వు అనామికతో మాట్లాడిన మాటలు.. నీపై నాకు ప్రేమను మరింత పెంచాయి. నిన్ను ప్రేమించినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. నన్ను బాగా నమ్మినందుకు చాలా థాంక్స్ అని చెబుతాడు కళ్యాణ్. ఇది జీవితం కూచి మనకు నచ్చినట్టు ఉండదు.. మనమే తీర్చి దిద్దుకోవాలి. నువ్వు అనుకున్నది జరగాలని నేను అనుకున్నా.. అందుకే కష్టాలను కూడా ఇష్టంగా స్వీకరించామని అప్పూ అంటుంది.
కావ్యని ఇంటికి రానివ్వకుండా రుద్రాణి ప్లాన్..
మరోవైపు కావ్యని ఎప్పటికీ ఈ ఇంటికి రాకుండా చేయాలని రుద్రాణి, రాహుల్‌లు ప్లాన్ చేస్తారు. ఎప్పుడూ ఏదో వంక పెట్టుకుని ఈ ఇంటికి వస్తూనే ఉంది. ఎక్కడ నుంచి తరిమేసినా మళ్లీ వస్తుంది.. అది ఇంటికి రావడానికి కుదరదు. పని మనిషి వచ్చిన తర్వాత కూడా రాదని గ్యారెంటీ ఏంటి? అని రుద్రాణి అంటే.. కరెక్ట్‌గా చెప్పారు. మీ బాధ ఏంటో నాకు బాగా తెలుసు. మా చెల్లి ఇంటికి వస్తే.. ఆస్తి పంపకాలు జరగకుండా చేస్తుంది. అందుకే కదా.. కావ్య రాకూడదు అనుకుంటున్నారని స్వప్న అంటుంది. మేము రాకూడదనే అనుకుంటున్నాం.. కానీ రాజ్ అస్సలు రానివ్వడం లేదు కదా.. ఇప్పుడు ఏం చేస్తావ్? అని రుద్రాణి అడిగితే.. మా కావ్య మొండిది అనుకున్నది సాధించకుండా ఉండదని స్వప్న అనేసి వెళ్తుంది.
నీ కోసమే భోజనం తీసుకొచ్చింది..
మరోవైపు ఇందిరా దేవి, సీతారామయ్యలు భోజనం చేస్తూ ఉంటారు. మరోవైపు ఆకలితో అలమటిస్తూ ఉంటాడు. రాజ్ కావ్య నీకు కూడా వంట చేసింది.. అర్థ ఆకలితో అలా ఉండకూడదని అంటుంది. నేను ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నా తినని అంటాడు. ఆ తర్వాత పిజ్జా తింటూ ఉంటే వేడిగా లేదని పారేస్తాడు. ఇక ఎవరూ చూడకుండా కిందకు వెళ్లి ఎవరూ చూడకుండా గబగబా భోజనం చేస్తూ ఉంటాడు. ఇంతలో పొలమారుతాడు. అప్పుడే ఇందిరా దేవి, సీతారామయ్యలు వస్తారు. బాగా ఆకలి వేసింది అందుకే అని రాజ్ అంటే.. తినమని ఇందిరా దేవి అంటుంది. మళ్లీ ఈ విషయం తెలిస్తే నేను చులకన అయిపోతాను వద్దని రాజ్ అంటాడు. మేము చెప్పములే.. నీకు ఎందుకు రా ఈ కర్మ.. కావ్యని భార్యగా ఒప్పుకుని ఇంటికి తీసుకొస్తే.. దర్జాగా తినవచ్చు. మీ కోసమే భోజనం తీసుకొచ్చిందని ఇందిరా దేవి అంటుంది.
వీడు ఇలా తయారయ్యాడేంటి..
దాని నాటకాలు మీరు నమ్ముతారు కానీ నేను నమ్మను. ఒకప్పుడు మీ మాట విని మీ గౌరవం కోసం తాళి కట్టాను. కానీ ఆ తర్వాత ఇలా చేయను. రేపు ఆ చెఫ్ వస్తే కడుపు నిండా తినవచ్చని రాజ్ వెళ్లిపోతాడు. ఏంటి బావా వీడు ఇలా తయారయ్యాడని ఇందిరా దేవి అంటుంది. ఇక తెల్లవారుతుంది. కావ్య వచ్చి అందరికీ అన్నీ చేసి పెడుతుంది. అందరూ నవ్వుతూ మాట్లాడుకుంటారు రాజ్ దొంగచాటుగా అది చూస్తూ ఉంటాడు. రాజ్‌ని చూసిన రాజ్.. కిందకు రమ్మని పిలుస్తారు. పొద్దున్నే దిగబడాలా.. అని రాజ్ అంటే.. అమ్మమ్మ, తాతయ్యలకు ఏం కావాలో చూసుకోవడానికి అని కావ్య అంటుంది. అయినా నీ వల్ల మీ అమ్మ వెళ్లిపోయింది. ఇప్పుడు మా కోసం వచ్చిన కావ్యని అవమానిస్తే ఊరుకునేది లేదని సుభాష్ అంటాడు. ఇంతలో కారులో నుంచి స్టెల్లా స్టైలుగా దిగుతుంది. స్టెల్లాను చూసిన ఇంట్లో వాళ్లు షాక్ అవుతారు. ఇక ఇక్కడితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్‌లో అపర్ణ, సుభాష్‌కు డివోర్స్ పంపిస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..