Ram Charan: ఆ విషయంలో తడబాటు.. రామ్‌చరణ్‌కు అమెరికన్ నటి క్షమాపణలు.. వీడియో వైరల్..
చరణ్ పేరును ఎలా పలకాలో తెలియడం లేదన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది.

హాలీవుడ్ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ ప్రధానోత్సవంలో ఆర్ఆర్ఆర్ చిత్రం సత్తా చాటింది. ఒకటి కాదు..రెండు కాదు.. ఏకంగా నాలుగు కేటగిరీలలో అవార్డ్స్ సొంతం చేసుకుంది. బెస్ట్ యాక్షన్ ఫిలిం, బెస్ట్ స్టంట్స్, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిలిం, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలలో అవార్డ్స్ గెలుపొందగా.. అమెరికాలోని కాలిఫోర్నియాలో జరుగుతున్న వేడుకలలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ రాజమౌళి అవార్డ్స్ అందుకున్నారు. అయితే ఈ వేడుకలలో ఆసక్తికర సంఘటన జరిగింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు అమెరికన్ నటి టిగ్ నొటారో క్షణాపణలు చెప్పారు. చరణ్ పేరును ఎలా పలకాలో తెలియడం లేదన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది.
తాజాగా కాలిఫోర్నియా వేదికగా జరిగిన హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల ప్రధానోత్సవంలో జక్కనతోపాటు రామ్ చరణ్ సందడి చేశారు. టిగ్ నొటారో వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ వేడుకలలో అవార్డ్ ప్రజెంటర్ గా చరణ్ పాల్గొన్నారు. హాలీవుడ్ నటి అంజలి భీమానితో కలిసి బెస్ట్ వాయిస్.. మోషన్ క్యాప్చర్ అవార్డ్ అందించారు. అయితే చెర్రీని స్టేజ్ పైకి పిలిచే క్రమంలో టిగ్ నొటారో కాస్త తడబడ్డారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో విజయాన్ని అందుకున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ సూపర్ స్టార్ రామ్ అంటూ ఆగిపోయారు. చరణ్ అనే పదాన్ని ఎలా పలకాలో తెలియడం లేదని అన్నారు. దీంతో వెంటనే స్టేజ్ వెనక ఉన్న బృందం సాయం చేయడంతో చరణ్ అని చెప్పారు.




ఆ తర్వాత వేదికపైకి వచ్చిన చెర్రీ వద్దకు వెళ్లి క్షమాపణలు చెప్పారు. అనంతరం హాలీవుడ్ నటి అంజలీ మాట్లాడుతూ.. చరణ్ పక్కన నిల్చొని ఆయనతో కలిసి అవార్డ్ అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇది తనకు అవార్డ్ విన్నింగ్ మూమెంట్ అని అన్నారు.
‘ MAN OF MASSES RAM CHARAN ‘ ❤️?? For a Reason ?
He’s True GLOBAL Phenomenon ? The International Film Superstar @AlwaysRamCharan‘s Aura at #HCAFilmAwards ❤️?#GlobalStarRamCharan @HCAcritics#GlobalstarRamcharan pic.twitter.com/v8PxuhZ4Pg
— RC YuvaShakthi (@RcYuvaShakthi) February 25, 2023
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




