Pushpa Deleted Scene: సీన్ అదిరిపోయింది ఎందుకు తీసేశారబ్బా..! పుష్ప డెలిటెడ్ సీన్..

ఐకాన్  స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ పుష్ప ఇప్పుడు థియేటర్స్ లో అదరగొడుతుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది.

Pushpa Deleted Scene: సీన్ అదిరిపోయింది ఎందుకు తీసేశారబ్బా..! పుష్ప డెలిటెడ్ సీన్..
Pushpa
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 31, 2021 | 1:29 PM

Pushpa The Rise: ఐకాన్  స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ పుష్ప ఇప్పుడు థియేటర్స్ లో అదరగొడుతుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. సుకుమార్ మేకింగ్ అల్లు అర్జున్ యాక్టింగ్ ప్రేక్షకుల చేత విజిల్స్ కొట్టిస్తుంది. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో పక్కా మాస్ క్యారెక్టర్ లో కనిపించాడు బన్నీ. అల్లు అర్జున్ పుష్ప రాజ్ గా ఒదిగిపోయిన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. గంధపు చెక్కల సాంగ్లింగ్ అనే కాన్సెప్ట్ తో సుకుమార్ మరో సారి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. రెండు భాగాలుగా రాబోతున్న ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయ్యింది. మొదటి భాగమే ఇంతటి భారీ విజయాన్ని అందుకోవడటంతో ఆనందంలో తేలిపోతున్నారు చిత్రయూనిట్.

ఈ సినిమాలో బన్నీ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఆకట్టుకుంది. శ్రీవల్లి పాత్రలో రష్మిక నటన ప్రేక్షకులను ఫిదా చేసిందనే చెప్పాలి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో డిలీట్ చేసిన ఒక సీన్ ను ఇప్పుడు యూట్యూబ్ ద్వారా పంచుకున్నారు మేకర్స్. ఈ సీన్ లో అల్లు అర్జున్ ఒక వడ్డీవ్యాపారి దగ్గర అప్పుచేయడం.. ఆ అప్పు తీర్చకపోవడంతో అతడు ఇంటి మీదికొచ్చి గొడవచేయడం చూపించారు. ఆ తర్వాత అప్పు తీర్చిన హీరో అతడిని కొట్టి అందరిముందు అప్పు తీర్చడాని చెప్పించడం ఈ వీడియోలో మనం చూడొచ్చు. సినిమా రన్ కారణంగానే ఈ సీన్ ను తొలగించారని తెలుస్తుంది. ఇక ఈ వీడియో ఇప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సీన్ కూడా సినిమాలో ఉంటే బాగుండేదని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Coronavirus: బాలీవుడ్‌లో ఆగని కరోనా ప్రకంపనలు.. వైరస్‌ బారిన పడిన బాహుబలి ‘మనోహరి’ Prabhas: డార్లింగ్‌ మనసు బంగారం.. రాధేశ్యామ్‌ ప్రీరిలీజ్‌లో గాయ పడిన అభిమానుల కోసం.. Jr.NTR: ఆ సమయంలో డిప్రెషన్‏లోకి వెళ్లాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన ఎన్టీఆర్..

ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!