- Telugu News Photo Gallery Cinema photos vijay devarakonda liger movie glimpse video creating new records by trending as #LigerFirstGlimpse in twitter
Vijay Devarakonda’s Liger: ఒక్కరోజు ముందే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మొదలుపెట్టిన ‘లైగర్’
Liger: రౌడీ ఫ్యాన్స్‌కు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎర్లీగా స్టార్ట్ అయ్యాయి. వరుస అప్‌డేట్స్‌తో హల్‌చల్ చేస్తోంది లైగర్ టీమ్.
Updated on: Dec 31, 2021 | 12:41 PM

రౌడీ ఫ్యాన్స్‌కు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎర్లీగా స్టార్ట్ అయ్యాయి. వరుస అప్‌డేట్స్‌తో హల్‌చల్ చేస్తోంది లైగర్ టీమ్.

విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావటంతో లైగర్ మీద నేషనల్ లెవల్‌లో భారీ అంచనాలు ఉన్నాయి.

ముంబై లో ఛాయ్ వాలా గా జీవనం సాగించే వ్యక్తి బాక్సర్‌గా ఎలా ఎదిగాడన్నది లైగర్ స్టోరి. ఈ సినిమాతో బాలీవుడ్ స్టార్ కిడ్ అనన్య పాండే టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు.

కోవిడ్ కారణంగా ఆలసమైన ఈ సినిమా 2022 ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్ ఈ చిత్రంతో ఇండియన్ సినిమాకు పరిచయం కాబోతున్నారు.

న్యూ ఇయర్ కానుకగా లైగర్ నుంచి వరుస అప్‌డేట్స్ ప్లాన్ చేసింది యూనిట్. ఇప్పటికే వర్కింగ్ స్టిల్స్.. ఇన్‌స్టా ఎఫెక్ట్ రిలీజ్ చేసిన మేకర్స్... తాజాగా గ్లింప్స్‌తో సర్‌ప్రైజ్ ఇచ్చారు.

టీజర్‌లో విజయ్ లుక్, యాటిట్యూడ్ సూపర్బ్ అనిపించేలా ఉన్నాయి. తల్లి పాత్రలో రమ్యకృష్ణ మరోసారి ఆకట్టుకుంటున్నారు.

ముంబై స్లమ్స్‌లో ఛాయ్ వాలాగా పెరిగిన ఓ వ్యక్తి ఇంటర్‌నేషనల్ లెవల్ బాక్సర్‌గా ఎలా ఎదిగారు అన్న పాయింట్‌ను తన మార్క్ కమర్షియల్ స్టైల్‌లో చూపించారు డైరెక్టర్ పూరి

ఇక ఈ గ్లిమ్ప్స్ విడుదలైన క్షణాల్లోనే వైరల్ గా మారింది. ట్విట్టర్ ట్రేండింగ్లో నెంబర్ 1గా నిలిచింది ఈ గ్లిమ్ప్స్. దీనిపై ఫ్యాన్స్ లైగర్ ఆన్ ఫైర్ అంటూ కామెంట్లు కురిపిస్తున్నారు.





























