AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: డార్లింగ్‌ మనసు బంగారం.. రాధేశ్యామ్‌ ప్రీరిలీజ్‌లో గాయ పడిన అభిమానుల కోసం..

Prabhas: సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్‌ గురించి ఎవరినీ ప్రశ్నించినా అతను ఒక డార్లింగ్‌, చాలా మంచి వాడు, గ్రౌండ్ టు ఎర్త్‌ అని చెబుతుంటారు. ప్రతీసారి తన మంచి మనసును చాటుకుంటూనే ఉంటారు...

Prabhas: డార్లింగ్‌ మనసు బంగారం.. రాధేశ్యామ్‌ ప్రీరిలీజ్‌లో గాయ పడిన అభిమానుల కోసం..
Narender Vaitla
|

Updated on: Dec 31, 2021 | 6:57 AM

Share

Prabhas: సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్‌ గురించి ఎవరినీ ప్రశ్నించినా అతను ఒక డార్లింగ్‌, చాలా మంచి వాడు, గ్రౌండ్ టు ఎర్త్‌ అని చెబుతుంటారు. ప్రతీసారి తన మంచి మనసును చాటుకుంటూనే ఉంటారు. వరదలతో సర్వం కోల్పోయిన వారికి భారీ ఆర్థిక సాయం అందిస్తూ ఎప్పడూ ముందు వరుసలో ఉంటారు. అందుకే ప్రభాస్‌ను ఆయన సన్నిహితులు డార్లింగ్‌ అని ముద్దుగా పిలుచుకుంటారు. తాజాగా ప్రభాస్‌ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. ప్రభాస్‌ హీరోగా నటించిన తాజా రాధేశ్యామ్‌ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించిన విషయం తెలిసిందే. అంగరంగ వైభవంగా సాగిన ఈ ఈవెంట్‌లో 30 వేలకు పైగా మంది పాల్గొన్నారని సమాచారం.

ఇదిలా ఉంటే ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొందరు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. ఈవెంట్‌లో ఏర్పాటు చేసిన ప్రభాస్‌ భారీ కటౌట్‌లపైకి ఎక్కారు. ఈ క్రమంలోనే కొంత మంది అభిమానులు కటౌట్స్‌ పై నుంచి జారీ పడ్డారు. దీంతో కొంత మంది గాయాలపాలయ్యారు. వీరిలో కొందరు ముగ్గురు తీవ్రంగా గాయపడిన విషయాన్ని తెలుసుకున్న ప్రభాస్‌ వారికి ఆర్థిక సాయాన్ని అందించారు. అభిమానుల ఆరోగ్యం కోసం కొంత మొత్తాన్ని ప్రభాస్‌ అందించారని సమాచారం. అభిమానుల క్షేమం కోసం ప్రభాస్‌ స్పందించిన తీరుపై ఆయన ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే రాధేశ్యామ్‌ సినిమా జనవరి 14న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే.

Also Read: Ration Card: రేషన్‌ కార్డు, ఇళ్లు లేనివారికి కేంద్రం గుడ్‌న్యూస్‌.. త్వరలో కొత్త వ్యవస్థ..!

Omicron Variant: ఒమిక్రాన్‌తో ఎవ్వరు చనిపోలేదు.. కొత్త వేరియంట్‌ కట్టడికి ప్రత్యేక చర్యలు

Chennai rain: వరద పోటెత్తింది.. సిటీ జలమయమైంది.. బిక్కు బిక్కుమంటున్న చెన్నై మహానగరం..