Omicron Variant: ఒమిక్రాన్‌తో ఎవ్వరు చనిపోలేదు.. కొత్త వేరియంట్ కట్టడికి ప్రత్యేక చర్యలు
Omicron Variant: ఒమిక్రాన్ కరోనా వేరియంట్ వల్ల ఎవరూ చనిపోలేదని లేదా తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌కు గురికాలేదని రాష్ట్రంలోని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారని..
Omicron Variant: ఒమిక్రాన్ కరోనా వేరియంట్ వల్ల ఎవరూ చనిపోలేదని లేదా తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌కు గురికాలేదని రాష్ట్రంలోని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ (జిసిసి) కమిషనర్ గగన్‌దీప్ సింగ్ బేడీ మాట్లాడుతూ.. కొత్త సంవత్సర వేడుకల దృష్ట్యా నివాస ప్రాంతాల్లో ఏదైనా సామాజిక కార్యక్రమాలు జరుగుతున్నాయో లేదో పర్యవేక్షించడానికి కార్పొరేషన్ ‘ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలను’ నియమించిందని, అలాంటి సంఘటనలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఇక ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జె. బేడీ మాట్లాడుతూ.. ఓమిక్రాన్ కారణంగా ఎవరూ మరణించలేదని అన్నారు. కోవిడ్ -19 ప్రోటోకాల్‌ను అనుసరించేందుకు ప్రజలు దీనికి సహకరించాలని కోరారు.
సామాజిక దూరాన్ని పాటించాలని, మాస్క్‌లు ధరించాలని సూచనలు చేసింది ప్రభుత్వం. ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడే వివాహాలు లేదా సామాజిక కార్యక్రమాలపై ఏమైనా ఆంక్షలు విధించారా అనే విషయమై శుక్రవారం వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో ముఖ్యమంత్రి స్టాలిన్ సమావేశం కానున్నారు. గుంపులుగా ఉండకుండా సామాజిక దూరాన్ని పాటించాలన్నారు. నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా ప్రజలు పెద్ద సంఖ్యలో గుమికూడుతున్నారో లేదో తనిఖీ చేయడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి కఠిన చర్యలు చేపట్టనున్నారు అధికారులు.
ఇవి కూడా చదవండి: