Allu Arjun’s Pushpa: జడేజా తర్వాత ఇప్పుడు వార్నర్ వంతు.. తగ్గేదే లే డైలాగ్ తో అదరగొట్టిన ఆసీస్ క్రికెటర్
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ప్రస్తుతం సందడి చేస్తుంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.
Allu Arjun’s Pushpa: సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ప్రస్తుతం సందడి చేస్తుంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. రంగస్థలం సినిమాతర్వాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమా కావడంతో.. అటు అల్లు అర్జున్ నుంచి అల వైకుంఠపురంలో లాంటి సూపర్ హిట్ తర్వాత వచ్చిన పుష్ప కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో పక్కా మాస్ క్యారెక్టర్ లో కనిపించాడు బన్నీ. అల్లు అర్జున్ పుష్ప రాజ్ గా ఒదిగిపోయిన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. గంధపు చెక్కల సాంగ్లింగ్ అనే కాన్సెప్ట్ తో సుకుమార్ మరో సారి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. రెండు భాగాలుగా రాబోతున్న ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయ్యింది. మొదటి భాగమే ఇంతటి భారీ విజయాన్ని అందుకోవడటంతో ఆనందంలో తేలిపోతున్నారు చిత్రయూనిట్. ఇక ఈ సినిమాలో బన్నీ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో బన్నీ చెప్పిన తగ్గేదేలే అనే డైలాగ్ తెగ వైరల్ అవుతుంది. ఎక్కడ చూసిన ఇప్పుడు ఇదే డైలాగ్ వినబడుతుంది. ఇక సెలబ్రెటీలు కూడా ఈ డైలాగ్ చెప్పి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తెలుగు సినిమా పాటలన్నా.. డైలాగులన్న ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ వార్నర్ ముందుంటాడు. ఇప్పటికే పలు సినిమా డైలాగులు.. పాటలకు స్టెప్పులేసి సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇక ఇప్పటికే అలవైకుంఠపురం సినిమాలోని బుట్టబొమ్మపాటకు స్టెప్పులేసి బాగా వైరల్ అయ్యాడు. ఇప్పుడు పుష్ప సినిమాలోని తగ్గేదే లే డైలాగ్ చెప్పి మరోసారి హాట్ టాపిక్ అయ్యాడు. పుష్ప.. పుష్ప రాజ్ .. తగ్గేదేలే అంటూ అదరగొట్టాడు. ఇప్పుడు ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఇటీవలే ఇండియన్ క్రికెటర్ రవీంద్ర జడేజా కూడా ఇదే డైలాగ్ చెప్పి ఆకట్టుకున్నాడు.
View this post on Instagram
మరిన్ని ఇక్కడ చదవండి :